mahatma jyotirao phule
-
బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే 197వ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట రూ. 20 వేల కోట్ల బీసీ సబ్‌ప్లాన్ పెట్టాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకొనేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు. వచ్చే బడ్జెట్లో రూ. 20 వేల కోట్లు కేటాయించాలని, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, బీసీలకు మండలానికో అంతర్జాతీయ స్థాయి గురుకులాల ఏర్పాటు వంటి హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరో మూడేళ్లలో జరగనున్న పూలే ద్విశతాద్ది ఉత్సవాల నాటికి హైదరాబాద్‌లో ఆయన భారీ విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ మేరకు అసెంబ్లీలో ఫూలే విగ్రహం ఏర్పాటు చేయాలని, బీసీలకు ఇచి్చన హామీలను నోటి మాటలకు పరిమితం చేయకుండా కాంగ్రెస్ ఆచరించి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాటల్లో కాదు.. చేతల్లో చూపించాం బీసీల అభివృద్ధి, సంక్షేమంతోపాటు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా వారికి రాజకీయ అవకాశాల కోసం బీఆర్ఎస్ మాత్రమే పాటుపడుతోందని కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువ స్థానాలు ఇవ్వడంతోపాటు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలకు సగం సీట్లు కేటాయించామని చెప్పారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో బీసీల అభ్యున్నతిని మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించి చూపామని.. ఫూలే ఆలోచనా విధానంలో భాగంగా వెయ్యికిపైగా గురుకులాలను ఏర్పాటు చేశామని వివరించారు. నేత, యాదవ, ముదిరాజ్, గౌడ సామాజికవర్గాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టామని... అత్యంత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. బీసీలను స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్న కాంగ్రెస్‌పై బడుగు, బలహీనవర్గాలు ఆగ్రహంతో ఉన్నాయని ఎమ్మెల్సీ మధుసూధనాచారి అన్నారు. గత పదేళ్లలో సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేశారని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. -
అధ్యయనం కోసం కమిటీ
సాక్షి, అమరావతి: బీసీల కుల గణనపై కార్యాచరణకు కమిటీని నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. 139 బీసీ కులాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు ఏపీలో బీసీల గణన చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. దేశ సామాజిక విప్లవోద్యమ పితామహుడు మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి వేణు మాట్లాడుతూ బీసీ సంఘాల ఆభ్యర్ధన మేరకు బీసీల కుల గణన కార్యాచరణ బాధ్యతను సీఎం జగన్ తనకు అప్పగించారని తెలిపారు. దీనిపై కమిటీని నియమించి ఇతర రాష్ట్రాల్లో కూడా అధ్యయం చేస్తామన్నారు. చదువు అనే ఆయుధంతో సమాజంలో గుర్తింపు, గౌరవం సాధించడంలో జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలవగా సీఎం జగన్ వారి ఆశయాలను ఆచరిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు. బీసీలకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు వారికి రాయల్టీ చెల్లించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం దేశంలో పూలే ఆశయాలను సంపూర్ణంగా అమలు చేస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి జగన్ అని గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పూలే జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 25 మంది మంత్రులుంటే 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారేనని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో సామాజిక న్యాయం చేయలేదన్నారు. సామాజిక న్యాయంపై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమేనని చంద్రబాబు, లోకేశ్‌కు సవాల్ విసిరారు. విద్య అనే ఆయుధాన్ని కలిగి ఉంటే సమస్యలను సమర్ధంగా ఎదుర్కోవచ్చని, ఈ దిశగా విద్యా రంగంలో సీఎం జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని ఎంపీ మార్గాని భరత్ తెలిపారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జంగా కృష్ణమూర్తి, లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, పోతుల సునీత, ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మీ, రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పి.గౌతమ్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, అగ్రికల్చరల్ మార్కెటింగ్ సలహాదారు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ సిటీ పార్టీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొని పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
'వాటిని ఆచరణలో చూపింది వైఎస్ జగన్'
సాక్షి, విజయవాడ: మహాత్మా జ్యోతిరావు పూలే 194వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం ఆవరణలో ఉన్న పూలే విగ్రహానికి దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'పూలే లాంటి మహనీయుల ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి. పూలే ఆశయాలను తూచ తప్పకుండా పాటిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ.. 'పూలే ఆశయాలను ఆయన చూపిన బాటలోనే బలహీన వర్గాల కోసం అభినవ పూలేగా సీఎం వైఎస్ జగన్ పాలన సాగిస్తున్నారు. బలహీన వర్గాలను ముందుకు తీసుకువెళ్లాలన్న పూలే ఆలోచనలను ఆచరణలో చూపిన నాయకుడు వైఎస్ జగన్. నామినేటేడ్ పోస్టుల్లో, వర్క్స్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం రిజర్వేషన్లు.. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ తెచ్చిన గొప్ప వ్యక్తి సీఎం జగన్' అంటూ కొనియాడారు. చదవండి: జ్యోతిరావు పూలేకి సీఎం వైఎస్ జగన్ నివాళి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మాట్లాడుతూ.. 'మా ప్రభుత్వానికి పూలే ఆదర్శం. ఆయన లక్ష్యాలు, సిద్ధాంతాలు మరవలేని. మహిళలకు విద్యావకాశాలు, వయోజన విద్య కోసం కృషిచేసిన పూలే జీవిత చరమాంకం వరకు బలహీన వర్గాలకోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి. కాగా పూలే బాటలో బలహీన వర్గాల కోసం రూ.5వేల కోట్లు నిధులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఖర్చుచేస్తున్నట్లు' తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. 'సమాజం కోసం అంకితభావంతో కృషిచేసిన వ్యక్తి పూలే. అదే మార్గంలో బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరగాలని సీఎం వైఎస్ జగన్ 50శాతం రిజర్వేషన్లు తెచ్చి మరో అభినవ పూలేగా మారారని ప్రజలు కొనియాడుతున్నట్లు' ఆయన పేర్కొన్నారు. -
జ్యోతిరావు పూలేకి సీఎం వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అమరావతి: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రులు మోపిదేవి, వెల్లంపల్లి.. ఎమ్మెల్యే జోగి రమేష్, వైఎస్సార్సీపీ బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, సీఎం ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం హాజరయ్యారు. అనంతరం సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. 'దేశసమాజ పునర్నిర్మాణానికి జ్యోతిరావు పూలే చేసిన విశేష కృషి చిరస్మరణీయం. వెనుకబడిన తరగతుల సంక్షేమం, అందరికీ చదువులు, మహిళా సాధికారత వంటి ఆ మహనీయుని ఆశయాలే స్ఫూర్తిగా మన ప్రభుత్వం ముందుకెళ్తోందని' పేర్కొన్నారు. చదవండి: మీ నిస్వార్థ సేవలకు సెల్యూట్ -
పూలే స్ఫూర్తితో ప్రభుత్వ కార్యక్రమాలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో బడుగుల సంక్షేమానికి ప్రభుత్వం పలు కార్యక్రమాలకు రూపకల్పన చేసిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మంగళవారం పూలే జయంతి సందర్భంగా సీఎం శుభాకాంక్షలు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాంతం పనిచేయడమే కాకుండా భావి తరాలకు పూలే మార్గం చూపారని కొనియాడారు. బడుగుల సంక్షేమానికి ఈ ప్రభుత్వం పునరంకితమవుతున్నట్లు ప్రకటించారు. -
ఫూలే సేవలు ఆదర్శం
ఎల్బీనగర్: మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. సోమవారం బీఎన్ రెడ్డినగర్‌లో ఫూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఆడపిల్లల చదువు కోసం జ్యోతిరావు పూలే, ఆయన సతీమణి సావిత్రీబాయి ఎంతో కృషి చేశారని అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ కుల వివక్షకు వ్యతిరేకంగా ఫూలే జీవితాంతం పోరాడారని తెలిపారు. ఫూలే కల లు కన్న రాజ్యం రావాలంటే ప్రజలు చైతన్యవంతులు కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ సమాజంలో మార్పు కోసం పూలే చేసిన త్యాగాలను మననం చేసుకుంటూ వారి బాటలో నడవాలని అన్నారు. అనంతరం పలువురికి జ్యోతిరావు పూలే మెమోరియల్ అవార్డులను ప్రదానం చేశారు. బీసీ కులాల సమన్వయ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ రఘురాం నేత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు టి.వీరేందర్‌గౌడ్, కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీప్రసన్న, నాయకులు కె.లక్ష్మ య్య, బాబూరావు, హరికృష్ణ, సత్యనారాయణ, జగన్నాథం, రాము నేత, చామకూర రాజు, సంజయ్‌కుమార్, రాములు, నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోనూ పూలే వర్ధంతిని నిర్వహించారు. -
పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
హాలియా : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. సమసమాజ స్థాపనకు, నిరక్ష్యరాస్యత, మూఢాచారాల నిర్మూలన, సాంఘీక దురాచారాలు తదితర అంశాల్లో ప్రజలను చైతన్యవంతంగా తయారు చేయడంలో ఆయన పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు జవ్వాజి వెంకటేశం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రిక్కల ఇంద్రసేనారెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కుందూరు వెంకట్‌రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంపటి శ్రీనివాస్, చెరుపల్లి ముత్యాలు, గౌని రాజారమేష్ యాదవ్, అనుముల ఏడుకొండల్, మాకమళ్ల జంగయ్య, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, పొదిల శ్రీనివాస్, సత్యం, కిలారి కృష్ణ, కూరాకుల రవి, నసీర్, అన్వర్, పోశం శ్రీనివాస్ గౌడ్, రావుల వెంకటేశం గౌడ్, నామని సుధాకర్, చెరుపల్లి వెంకటేశ్వర్లు, మోటముర్రి సురేందర్ పాల్గొన్నారు. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో.. బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం హాలియా బీసీ సంక్షేమ వసతి గృహంలో జ్యోతిబాపూలే వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు చిట్యాల రాంబాబు, సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సురభి రాంబాబు, సూర్యనారాయణ, వసతి గృహ అధికారి వెంకటేశ్వర్లు, ఎడారి నరేష్, నారందాసు అంజయ్య, నాగిళ్ల నరేందర్, నంద్యాల ప్రవీణ్, దివాకర్, సైదులు వసతి గృహ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చల్మారెడ్డిగూడెం ఉన్నత పాఠశాలలో.. మండలంలోని చల్మారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జ్యోతిబా పూలే వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కరుముల వెంకట్మ్రణారెడ్డి, ఉపాధ్యాయులు చీదళ్ల శ్రీనివాస్‌లు, అరవింద్‌కుమార్, సైదుల్‌రావ్ గౌతమ్, లిల్లీథెరిస్సా, సత్తయ్య, సునీత, సుధాకర్, శ్రీనివాస్, శివ పాల్గొన్నారు. మాదిగ ఉద్యోగుల ఆధ్వర్యంలో.. సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే 126వ వర్ధంతిని సోమవారం హాలియాలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంఈఎఫ్ నాయకులు యడవల్లి సోమశేఖర్, మామిడి శంకర్, మందా గౌతమ్, చింత వెంకటేశ్వర్లు, వర్కాల శ్రీనివాసరెడ్డి, పాల నాగేందర్, వెంకటేశ్వర్లు, లక్ష్మయ్య, బాబొద్దీన్ పాల్గొన్నారు. గుర్రంపూడ్ : మండలంలని కొప్పోల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో జ్యోతిరావ్ పూలే వర్ధంతిని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ సర్పంచ్ పోలా సరోజినమ్మ పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి అనంతరం మాట్లాడారు. సమసమాజ సాప్థనకు, పూలే ఆశయాలకు సాధనకు కృషి చేయలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట యాదయ్య, నర్ర రవి తదితరులున్నారు. పెద్దవూర : యువత జ్యోతిరావు పూలే అశయాలకు అనుగుణంగా నడుచుకుని ఆదర్శంగా తీసుకోవాలని టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ నోముల నర్సింహయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో పూలే వర్థంతినిఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వస్తపురి మల్లిక, నాయకులు పులిమాల కృష్ణారావు, కర్ణ బ్రహ్మారెడ్డి, హైమద్‌అలీ, వస్తపురి నర్సింహ, వెంకటేశ్వర్లు, దేవయ్య, పరమేష్, సులోచన, వెంకటయ్య, కొండయ్య, నడ్డి లక్ష్మయ్య, శ్రీనివాస్‌చారి పాల్గొన్నారు. -
పూలే విగ్రహానికి స్థలం కరువు!
ఇందూరు, న్యూస్‌లైన్ : ఓ మహనీ యుని విగ్రహం ఏ ర్పాటుకే జిల్లా కేం ద్రంలో స్థలం కరువైంది. మూడేళ్ల క్రితమే జిల్లాకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని మంజూరు చేసిం ది.అయితే ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ఇప్పటివరకు ఆవిష్కరణకు నో చుకో లేదు. విగ్రహ ఏ ర్పాటు కోసం విడుద ల చేసిన రూ. 4 లక్షల 25 వేలు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. 2011 నుంచి జిల్లాలో పనిచేసిన కలెక్టర్లు జ్యోతిరావు పూలే విగ్ర హ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ని జామాబాద్ కార్పొరేషన్ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. కలెక్టర్లు బదిలీలపై వెళ్లిపోయారు గానీ అధికారులు ఇంత వరకు స్థలాన్ని చూపించలేక పోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు రెండేళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన రావడం లేదు. గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వరప్రసాద్, క్రిస్టీనా జెడ్ చొంగ్తూలు జిల్లా కేంద్రంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే వారు బదిలీపై వెళ్లిపోయారు. శుక్రవారం జ్యోతిరావు పూలే 188వ జయంతిని నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ చౌరస్తాలో గల అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రద్యుమ్న హయాంలోనైనా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కావాలని దళిత సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
పూలే చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
సిరికొండ,న్యూస్‌లైన్: సామాజిక విప్లవోద్యమ పితామహుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్రను పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆర్.లింబాద్రి అన్నారు. మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో గురువారం నిర్వహించిన పూలే వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆనాటి కాలంలో అగ్రవర్ణాలకే పరిమితమైన విద్యను .. అందరికీ పంచేందుకు పూలే చూపిన చొరవ అమోఘమన్నారు. సమాజ మార్పు, స్త్రీలకు విద్యను అం దించడం కోసం తన భార్య సావిత్రిబాయికి చదువు చెప్పి ఉపాధ్యాయురాలిగా మలిచిన మేధావి పూలే అని కొనియాడారు. పూలేను గురువుగా భావించిన అంబేద్కర్ కూడా చదువుతోనే అన్నిం టినీ ప్రభావితం చేయవచ్చని భావించారన్నారు. అందుకే రాజ్యాంగం ద్వారా అణగారిన వర్గాలకు అన్ని హక్కులు సంక్రమించేలా చేశారని కీర్తించారు. అనంతరం గతేడాది పదో తరగతి, ఇంటర్ మండల టాపర్లకు నగదు పురస్కారం *1116, ప్రశంసాపత్రం, జ్ఞాపికలను అందచేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఆర్.నర్సయ్య, ఎం ఈఓ సుశీల్‌కుమార్, సర్పంచ్‌లు చిన్నసాయ న్న, సురేఖ, ఠాకూర్ జితేందర్‌సింగ్, రమేశ్, లాలీ, విండో చైర్మన్ గోపాల్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు నర్సిం హులు,ఉపాధ్యాయ సంఘ నాయకు లు సాల్మన్,బాలయ్య, రాజేశ్వర్, సత్యానంద్,చిన్ననర్సయ్య పాల్గొన్నారు.