ఇందూరు, న్యూస్‌లైన్ : ఓ మహనీ యుని విగ్రహం ఏ ర్పాటుకే జిల్లా కేం ద్రంలో స్థలం కరువైంది. మూడేళ్ల క్రితమే జిల్లాకు ప్రభుత్వం మహాత్మా జ్యోతిరావు పూలే కాంస్య విగ్రహాన్ని మంజూరు చేసిం ది.అయితే ప్రజా ప్రతినిధులు, అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి కారణంగా ఇప్పటివరకు ఆవిష్కరణకు నో చుకో లేదు. విగ్రహ ఏ ర్పాటు కోసం విడుద ల చేసిన రూ. 4 లక్షల 25 వేలు బ్యాంకులోనే మూలుగుతున్నాయి. 2011 నుంచి జిల్లాలో పనిచేసిన కలెక్టర్‌లు జ్యోతిరావు పూలే విగ్ర హ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ని జామాబాద్ కార్పొరేషన్ అధికారులకు ఆ దేశాలు జారీ చేశారు. కలెక్టర్‌లు బదిలీలపై వెళ్లిపోయారు గానీ అధికారులు ఇంత వరకు స్థలాన్ని చూపించలేక పోయారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నేతలు రెండేళ్లుగా పూలే వర్ధంతి, జయంతి కార్యక్రమాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనలు చేస్తున్నప్పటికీ అధికారుల్లో స్పందన రావడం లేదు. గతంలో కలెక్టర్‌లుగా పనిచేసిన వరప్రసాద్, క్రిస్టీనా జెడ్ చొంగ్తూలు జిల్లా కేంద్రంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటుకు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే వారు బదిలీపై వెళ్లిపోయారు. శుక్రవారం జ్యోతిరావు పూలే 188వ జయంతిని నిజామాబాద్ నగరంలోని రైల్వే కమాన్ చౌరస్తాలో గల అంబేద్కర్ భవన్‌లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రద్యుమ్న హయాంలోనైనా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు కావాలని దళిత సంఘాల నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పూలే విగ్రహానికి స్థలం కరువు!
Published Fri, Apr 11 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:51 AM
Advertisement
Advertisement