నెల్లూరు : నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం చిరమన గ్రామంలో అగ్రిగోల్డ్ ఏజంట్‌లు, ఖాతా దారులకు మధ్య ఆదివారం వాగ్వివాదం చోటు చేసుకుంది. అది కాస్తా ఉద్రిక్తంగా మారడంతో రెండు వర్గాలు ఒక వర్గంపై మరో వర్గం రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది స్వల్పంగా గాయపడ్డారు.
ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇరువర్గాల వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది.