- రూ.2.20 లక్షలు, ఆరు బైక్‌లు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం
15 మంది అరెస్ట్
Published Tue, Aug 30 2016 10:40 PM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM
కాటారం: కాటారం సమీపంలోని నస్తూర్‌పల్లి అటవీ ప్రాంతంలోని పేకాట స్థావరంపై మంగళవారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో ఎసై ్స టి.కిరణ్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో సొత్తు, బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ సదన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మండలంతోపాటు భూపాలపల్లి ఇతర ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లు ఇక్కడకు వచ్చి పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఎసై ్స దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో 15 మంది పేకాటరాయుళ్లను పట్టుకుని వారి నుంచి రూ.2.22 లక్షల నగదు, ఆరు బైక్‌లు, 15 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మోరంచపల్లికి చెందిన ముత్యాల విష్ణు పేకాట కోసం తన భార్య నగలు తీసుకురాగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. పేకాటరాయుళ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చన్నుట్లు సీఐ తెలిపారు.
Advertisement
Advertisement