2.13 లక్షల క్యూసెక్కుల మిగులు జలాల విడుదల
Published Mon, Sep 26 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
ధవళేశ్వరం : కాటన్ బ్యారేజ్ నుంచి సోమవారం 2,13,327 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మంగళవారం సాయంత్రానికి కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యారేజ్ వద్ద నీటిని పూర్తిగా దిగువకు వదిలేస్తుండటంతో సోమవారం సాయంత్రం 6 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. తూర్పు డెల్టాకు పూర్తిగా నీటిని నిలిపివేశారు. మధ్య డెల్టాకు 500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరంలో 9.64 మీట ర్లు, పేరూరులో 11.45 మీటర్లు, దుమ్ముగూడెంలో 8.77 మీటర్లు, భద్రాచలంలో 27.80 అడుగులు, కూనవరంలో 8.40 మీటర్లు, కుంటలో 4.62 మీటర్లు, కోయిదాలో 9.46 మీటర్లు, పోలవరంలో 7.25 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వేబ్రిడ్జివద్ద 12.88 మీటర్ల వద్ద నీటిమట్టాలు కొనసాగుతున్నాయి.
Advertisement