నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని చింతపల్లి మండలం వింజమురు వద్ద బుధవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయాలయ్యాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొనడంతో తొలుత ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను కాపాడేందుకు స్థానికులు వెళ్లారు.
ఇంతలో అతివేగంతో దూసుకోస్తున్న బొలేరో వాహనం స్థానికులను ఢీకొట్టింది. గాయపడిన వారిలో మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లా మాడుగుల మండలం పల్లెతండాకు చెందిన మేనావత్ మాన్య(35) మృతిచెందగా.. 25 మంది స్థానికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ తరలించారు. మిగతావారిని దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షణాల్లో రెండు ప్రమాదాలు.. 25మందికి గాయాలు
Published Wed, May 25 2016 8:55 PM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM
Advertisement
Advertisement