అనంతపురం సెంట్రల్ : సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన డయల్ –100కు జనవరిలో 2,357 ఫోన్‌కాల్స్ వచ్చాయని ఎస్పీ ఎస్.వి.రాజశేఖరబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తున్నట్లు వివరించారు. బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.