29న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్లీనరీ | 29th ysrcp meeting | Sakshi
Sakshi News home page

29న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్లీనరీ

Published Sat, Jun 17 2017 11:26 PM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

29th ysrcp meeting

  • పరిశీలకులుగా ధర్మాన, మోపిదేవి రాక
  •  విజయవంతానికి కన్నబాబు పిలుపు
  • కాకినాడ:
  • వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన కాకినాడలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో వైస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం ప్లీనరీపై నిర్ణయం తీసుకున్నారు. సన్నాహక సమావేశం నిర్ణయం మేరకు 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్లీనరీ జరగనుంది. సమావేశ వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే 18 నియోజకవర్గాల్లో  ప్లీనరీ సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ నెల19వ తేదీన ఏజెన్సీలో జరిగే ప్లీనరీతో అన్ని నియోజకవర్గాలు పూర్తవుతాయన్నారు.   జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి పాలన, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానాలను రాష్ట్ర కమిటీకి నివేదిస్తామన్నారు. ప్లీనరీకి జిల్లాపార్టీ పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్లీనరీ పరిశీలకునిగా నియమితులైన మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరవుతారన్నారు. 
    .
    ప్రజా సమస్యలే అజెండాగా...
    తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు ప్రజల కోసం కాకుండా కార్యకర్తలకు ఫుడ్‌ ఫెస్టివల్‌గా సాగిందని కన్నబాబు ఎద్దేవా చేశారు. అయితే తమ పార్టీ నిర్వహించే ప్లీనరీ మాత్రం పూర్తిగా ప్రజా సమస్యలే అజెండాగా కొనసాగుతుందన్నారు. ప్లీనరీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 
    .
    యనమల పగటికలలు...
    ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పగటి కలలు కంటున్నారని కన్నబాబు విమర్శించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు  యనమల చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ను చూసి యనమలకు, టీడీపీ నేతలకు నిద్రపట్టడంలేదని, ఆ పేరు చెబితేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణాన్ని మరుగున పర్చేందుకు హుదూద్‌ తుఫాన్‌లో మూడు లక్షల దస్త్రాలు(అడంగళ్‌) కొట్టుకుపోయాయంటున్నారని విమర్శించారు. 
    .
    కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదు...
    తెలుగుదేశం, వైఎస్సార్‌ సీపీ బీజేపీతో కుమ్మక్కయ్యాయంటూ కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న విమర్శలపై కన్నబాబు మండిపడ్డారు. ఆ పార్టీ విధానాలకు స్పష్టత లేకపోవడం వల్లే అడ్రస్‌ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి దీక్షలు, ధర్నాలు, నిరసనలు సహా ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని  ఆయన గుర్తు చేశారు. ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, పాముల రాజేశ్వరిదేవి, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్, పర్వత ప్రసాద్, జక్కంపూడి విజయలక్ష్మి, డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంగిశెట్టి అశోక్, గుత్తుల సాయి, వట్టికూటి రాజశేఖర్, అమలాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు వలవల బాబ్జి, రాజమహేంద్రవరం ప్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి,  రాజమహేంద్రవరం, కాకినాడ అర్బన్‌ నియోజకవర్గాల అధ్యక్షులు కందుల దుర్గేష్, ఆర్‌వీజేఆర్‌ కుమార్, పిఠాపురం ప్లోర్‌లీడర్‌ గండేపల్లి బాబి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, మట్టా సుజాత, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి,  రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు,  జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర సేవాదళ్‌ కార్యదర్శి ఒమ్మిరఘురామ్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మలాకుమారి, అనంత ఉదయభాస్కర్, మట్టపర్తి మురళీకృష్ణ, అబ్దుల్‌బషీరుద్దీన్, పెట్టా శ్రీనివాస్, మార్గాని గంగాధర్‌ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. 
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement