pleanery
-
‘ముందస్తు’ ఉండదు..
గతంలో ముందస్తుకు వెళ్లడంతో ఎంపీ సీట్లు తగ్గాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు వేర్వేరుగా జరగడంతో కొంత నష్టం జరిగింది. ప్రస్తుతం లోక్‌సభ స్థానాల సంఖ్యను కూడా మరిన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో మనం కేంద్రంలోనూ కీలక పాత్ర పోషించేందుకు వీలుంటుంది. సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ముందుండి నడిపిన టీఆర్ఎస్కు ప్రజలు అప్పగించిన బాధ్యతకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాం. ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నామనే అనవసర అపోహలతో ఆందోళన వద్దు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ముందస్తు ఎన్నికలు ఉండవు..’ అని ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కూడిన లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశంలో సుమారు రెండు గంటలకు పైగా ఆయన మాట్లాడారు. ఎన్నికలు, విపక్షాల విమర్శలు, ప్లీనరీ తదితర అంశాలపై సుదీర్ఘంగా ప్రసంగించారు. ఎక్కువ స్థానాలు గెలిచేలా కష్టపడండి ‘మరిన్ని ఎంపీ స్థానాలు సాధిస్తే రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధుల కోసం మనం మరింత కొట్లాడేందుకు వీలుంటుంది. మరోవైపు మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. మనముందున్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని చేపట్టిన పనులన్నీ పూర్తి చేసుకుందాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా మరింత కష్టపడి పనిచేయండి..’ అని నేతలకు కేసీఆర్ పిలుపునిచ్చారు. ‘అధికారంలోకి వచ్చిన సుమారు ఏడున్నరేళ్లలో మేనిఫెస్టోలో చెప్పిన వాటితో పాటు అనేక ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. కానీ వాటిని మనం సరైన రీతిలో ప్రజలకు చెప్పుకోలేక పోతున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలను పార్టీ యంత్రాంగం ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడే లక్ష్యం నెరవేరుతుంది. ఇదే సమయంలో విపక్షాలు చేసే విమర్శలను ఎక్కడిక్కడ తిప్పికొట్టాలి..’ అని సూచించారు. కుక్కలు, నక్కల నోర్లు మూయించాలి ‘ఓట్ల రాజకీయాలే పరమావధిగా పనిచేస్తున్న కొన్ని రాజకీయ పక్షాలు మనమీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అలాంటి కుక్కలు, నక్కల నోర్లు మూయించేలా వచ్చే నెల 15న వరంగల్‌లో ‘తెలంగాణ విజయ గర్జన’ సభను దిమ్మదిరిగేలా నిర్వహిద్దాం. ఒక్కో గ్రామం నుంచి కనీసం 50 మంది చొప్పున సభకు హాజరయ్యేలా సుమారు పది లక్షల మందితో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభ నిర్వహణ బాధ్యతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వర్తిస్తారు. సభను విజయవంతం చేసేందుకు వెంటనే సన్నాహాలు ప్రారంభించాలి. నేటి నుంచి నేతలతో కేటీఆర్ భేటీలు సోమవారం నుంచి రోజుకు 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ వేర్వేరుగా భేటీ అవుతారు. విజయగర్జన సభకు జన సమీకరణ, ఇతర ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేస్తారు. ఈ సన్నాహక సమావేశాలకు ఒక్కో నియోజకవర్గం నుంచి 20 మంది వరకు ముఖ్య నేతలు హాజరయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత ఎCమ్మెల్యేలపై ఉంటుంది. సభకు హాజరయ్యే వారి కోసం కనీసం 22 వేల బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చుకునేందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు చేసుకోవాలి..’ అని కేసీఆర్ ఆదేశించారు. హుజూరాబాద్‌లో 13% ఆధిక్యత ‘హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ కంటే మనమే 13 శాతానికి పైగా ఓట్ల ఆధిక్యతలో ఉన్నాం. ఈ నెల 25న హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత 26 లేదా 27వ తేదీన హుజూరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీ సమావేశానికి హాజరయ్యే ప్రతినిధుల సంఖ్యను 14 వేల నుంచి 6 వేలకు కుదించాలి. గ్రామ, మండల కమిటీల అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులకు ఆహ్వానం పంపాలి. ప్లీనరీకి హజరయ్యేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి. చేయాల్సిన తీర్మానాలపై పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా సూచనలు ఇవ్వవచ్చు. ప్రజా సమస్యలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై తీర్మానాలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టన దళితబంధుపై దేశ వ్యాప్తంగా ఆసక్తి వ్యక్తమవుతోంది. ప్లీనరీలో ఈ అంశానికి తగిన ప్రాధాన్యత ఇచ్చి చర్చించాలి..’ అని సీఎం ప్రతిపాదించారు. ‘సుమారు 60 లక్షల మందితో కూడిన పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి గ్రామ, వార్డు, మండల, పట్టణ స్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తయింది. త్వరలో పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, ఆ తర్వాత కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి..’ అని ప్రకటించారు. -
నెల రోజులుగా సీఎం కేసీఆర్ బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: రెండు దశాబ్దాల కిందట ఉద్యమ పార్టీగా అవతరించి.. రాష్ట్ర సాధన తర్వాత పూర్తిస్థాయిలో రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితికి కొత్త శక్తినిచ్చే దిశగా పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురవడం, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కదలికలు పెరగడంతో కేసీఆర్ అప్రమత్తమైనట్లు ఆయన వ్యూహాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి ఏకతాటిపై నడిపించడం, పార్టీ యంత్రాంగం- ప్రభుత్వం నడుమ సమన్వయాన్ని సాధించడం లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం కాగా, రాబోయే రోజుల్లో దాని ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నాటి నుంచి అన్ని ఎన్నికల్లో ఏకపక్ష విజయం సాధించిన టీఆర్ఎస్కు ఇటీవలి కాలంలో ఎదురవుతున్న ప్రతికూలతను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికలకు తానే స్వయంగా సార«థ్యం వహిస్తున్నారు. త్వరలో జరిగే నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార వ్యూహాన్ని ఇప్పటికే ఖరారు చేసిన కేసీఆర్ పార్టీ యంత్రాంగం సన్నద్ధత మొదలుకుని అభ్యర్థి ఎంపిక వంటి అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచార వ్యూహం క్షేత్ర స్థాయిలో అమలవుతున్న తీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశమవుతూ మార్గనిర్దేశనం చేస్తున్నారు. నెల రోజులుగా దూకుడు.. ముఖ్యమంత్రిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు బాధ్యతలు చేపడుతున్నారంటూ ఈ ఏడాది ఆరంభంలో విస్తృత ప్రచారం జరగ్గా, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపై బహిరంగ ప్రకటనలు చేశారు. దీంతో పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ వర్గాల్లోనూ ముఖ్యమంత్రి మార్పు అంశం చర్చనీయాంశమైంది. దీంతో ఫిబ్రవరి మొదటివారంలో ఆకస్మికంగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసిన కేసీఆర్ మంత్రులను కూడా ఈ భేటీకి ఆహ్వానించారు. ‘మరో పదేళ్లు నేనే ముఖ్యమంత్రి’ని అంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పి ఊహాగానాలకు తెర దించారు. పార్టీ యంత్రాంగంలో కదలిక తెచ్చేలా సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు, ఏప్రిల్ 27న ప్లీనరీ సమావేశం... తదితరాలతో కూడిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు కేవలం నెలన్నర వ్యవధిలో పూర్తి చేయాల్సిందిగా గడువు నిర్దేశించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని గత నెల 10న హాలియాలో జరిగిన భారీ బహిరంగ సభలోనూ కేసీఆర్ పాల్గొన్నారు. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత కరోనా పరిస్థితుల నేపథ్యంలో సుమారు ఏడాదికాలంగా పార్టీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ప్రస్తుతం ప్రకటించిన సంస్థాగత షెడ్యూలుతో క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. ఎన్నికల వ్యూహం అమలుపై ప్రత్యేక శ్రద్ధ దుబ్బాక ఉపఎన్నిక, గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నిక, త్వరలో జరిగే నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో పార్టీ వ్యూహం, ప్రణాళిక అమలును కేసీఆర్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ ఎన్నికలో అసంతృప్తి తలెత్తకుండా అభ్యర్థి ఎంపికలో సీల్డ్ కవర్ విధానాన్ని అమలు చేశారు. ఎన్నికల వ్యూహరచనలో తనదైన శైలిని ప్రదర్శించే కేసీఆర్ పట్టభద్రుల ఎన్నికలోనూ విపక్షాలను ఒత్తిడిలోకి నెట్టేలా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ, వాటి అమలుకు సారథ్యం వహిస్తున్నారు. ‘నల్లగొండ- ఖమ్మం- వరంగల్’ పట్టభద్రుల కోటా అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలోకి దింపారు. పల్లాకు ముందుగానే గ్రీన్‌సిగ్నల్ లభించడంతో ఓటరు నమోదుతో పాటే సుమారు ఐదు నెలలుగా ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా గెలుపొందని ‘హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్’ స్థానంలో టీఆర్ఎస్ పోటీ చేయడం లేదనే ప్రచారం సాగుతున్న వేళ చివరి నిముషంలో దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కూతురు వాణీదేవిని పార్టీ అభ్యర్థిగా తెర మీదకు తెచ్చారు. పొరుగు జిల్లాలకు చెందిన మంత్రులను ఇన్చార్జిలుగా నియమించి, రెండు నియోజకవర్గాల పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలతో తరచూ సమావేశమవుతూ ఎన్నికల వ్యూహం అమలుపై మార్గనిర్దేశనం చేస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి ఎంపికపై ఓవైపు కసరత్తు చేస్తూనే... మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సన్నద్దం చేయడంపై దృష్టి సారించారు. పైస్థాయిలో ఖరారు చేసిన వ్యూహాన్ని క్షేత్రస్థాయిలో యధాతథంగా అమలు చేసే విషయంలో కేసీఆర్ పట్టుదలగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీపై ఎదురుదాడి రాష్ట్రంలో విస్తరణ వ్యూహాన్ని అమలు చేస్తున్న బీజేపీతోపాటు, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కదలికలు కూడా పెరగడాన్ని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్‌గా పరిగణిస్తున్నారు. రెండు జాతీయ పార్టీల దూకుడుకు ఇప్పటి నుంచే అడ్డుకట్ట వేయడంతో పాటు, 2023 అసెంబ్లీ ఎన్నికలకు పారీయంత్రాంగాన్ని సన్నద్దం చేసే దిశగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేసేలా ఎదురుదాడి వ్యూహాన్ని ఇటీవలి కాలంలో టీఆర్ఎస్ అనుసరిస్తోంది. కేటీఆర్, మంత్రులు, ఇతర నేతలు ‘బీజేపీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా అసత్య ప్రచారాలు’ చేస్తోందని ఎదురుదాడి చేస్తున్నారు. మీడియా చర్చలకు పార్టీ నేతలు దూరంగా ఉండాలనే ఆదేశాలను ఉపసంహరించుకున్న టీఆర్ఎస్ ఇకపై రెండు జాతీయ పార్టీలు.. ప్రత్యేకించి బీజేపీ విధానాలను టీవీ డిబేట్లలో ఎండగట్టాలని నిర్ణయించింది. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనూ కేంద్రంలో బీజేపీ వైఖరిని తూర్పారబట్టాలని, గణాంకాలతో సహా నిలదీయాలని పార్టీ నేతలకు సీఎం సంకేతాలు ఇచ్చారు. నాయకులు నిరంతరం క్షేత్రస్థాయిలోనే ఉంటూ పార్టీ యంత్రాంగంతో మమేకమయ్యేలా చేయడం, పాలన యంత్రాంగాన్ని గాడిలో పెట్టడం లక్ష్యంగా కేసీఆర్ తన వ్యూహానికి పదును పెడుతున్నట్లు సమాచారం. -
సురవరం హ్యాట్రిక్
కొల్లాం: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి(76) ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవి చేపట్టడం ఇది వరసగా మూడోసారి. కేరళలోని కొల్లాంలో ఆదివారం ముగిసిన పార్టీ 23వ ప్లీనరీ సమావేశాల్లో ప్రధాన కార్యదర్శితో పాటు 126 మంది సభ్యుల జాతీయ మండలి, 11 మందితో కూడిన సెక్రటేరియట్, 11 మంది సభ్యులుగా గల కంట్రోల్ మిషన్‌ను కూడా ఎన్నుకున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కన్హయ్య కుమార్‌కు జాతీయ మండలిలో చోటు దక్కింది. ఆ తరువాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆరెస్సెస్–బీజేపీని ఎదుర్కోవాలంటే లౌకిక, ప్రజాస్వామ్య, లెఫ్ట్ పార్టీల మధ్య ఐక్యత అవసరమని నొక్కి చెప్పారు. జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పోరులో కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. కేరళలో మాత్రం తాము భాగస్వామిగా ఉన్న ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యర్థే అని పేర్కొన్నారు. జాతీయ మండలికి ఎన్నిక కాలేకపోయిన సీనియర్ నాయకుడు, కేరళ మాజీ మంత్రి సి.దివాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2012లో తొలిసారి.. తెలంగాణలోని నల్గొండ నియోజక వర్గం నుంచి రెండు సార్లు(1998–99, 2004–09) లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సుధాకర్ రెడ్డి 2012లో తొలిసారి సీపీఐ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ కార్మిక స్థాయీ సంఘానికి చైర్మన్‌గా వ్యవహరించారు. 1942లో మహబూబ్‌నగర్‌లో జన్మించిన సుధాకర్ రెడ్డి 1967లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పూర్తిచేశారు. -
ప్రతిష్టాత్మకంగా జిల్లా ప్లీనరీ
కాకినాడ : వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీని ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు అజెండాగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా పార్టీ పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. విశాఖలో చేపట్టిన మహాధర్నాకు విచ్చేసిన జిల్లాపార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, సీఈసీ సభ్యులు పినపే విశ్వరూప్, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు, ఇతర ముఖ్యనేతలతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ నెల 29వ తేదీన జరగనున్న ప్లీనరీకి జరుగుతున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లీనరీ నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో మాజీమంత్రి కొప్పన మోహనరావు, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావునాయుడు వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, గిరిజాల బాబు, పితాని బాలకృష్ణ,కొండేటి చిట్టిబాబు, ముత్యాలశ్రీనివాస్, పర్వత ప్రసాద్, అమలాపురంపార్లమెంట్‌కో–ఆర్డినేటర్ వలవల బాబ్జి, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మిండకుదిటి మోహన్ తదితరులు ఉన్నారు. -
29న వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా ప్లీనరీ
పరిశీలకులుగా ధర్మాన, మోపిదేవి రాక విజయవంతానికి కన్నబాబు పిలుపు కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాన్ని ఈ నెల 29వ తేదీన కాకినాడలో నిర్వహించనున్నారు. ఈ మేరకు శనివారం స్థానిక ఆర్అండ్బి అతిథి గృహంలో వైస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగిన ప్లీనరీ సన్నాహక సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి వివిధ నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లతో చర్చించిన అనంతరం ప్లీనరీపై నిర్ణయం తీసుకున్నారు. సన్నాహక సమావేశం నిర్ణయం మేరకు 29వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్లీనరీ జరగనుంది. సమావేశ వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇప్పటికే 18 నియోజకవర్గాల్లో ప్లీనరీ సమావేశాలు నిర్వహించామన్నారు. ఈ నెల19వ తేదీన ఏజెన్సీలో జరిగే ప్లీనరీతో అన్ని నియోజకవర్గాలు పూర్తవుతాయన్నారు. జిల్లాలో తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి పాలన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడులు, అక్రమ కేసులు తదితర అంశాలపై సమావేశంలో చర్చించి తీర్మానాలను రాష్ట్ర కమిటీకి నివేదిస్తామన్నారు. ప్లీనరీకి జిల్లాపార్టీ పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ప్లీనరీ పరిశీలకునిగా నియమితులైన మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరవుతారన్నారు. . ప్రజా సమస్యలే అజెండాగా... తెలుగుదేశం పార్టీ ఇటీవల నిర్వహించిన మహానాడు ప్రజల కోసం కాకుండా కార్యకర్తలకు ఫుడ్ ఫెస్టివల్‌గా సాగిందని కన్నబాబు ఎద్దేవా చేశారు. అయితే తమ పార్టీ నిర్వహించే ప్లీనరీ మాత్రం పూర్తిగా ప్రజా సమస్యలే అజెండాగా కొనసాగుతుందన్నారు. ప్లీనరీకి జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. . యనమల పగటికలలు... ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పగటి కలలు కంటున్నారని కన్నబాబు విమర్శించారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు యనమల చాలా విడ్డూరంగా మాట్లాడుతున్నారన్నారు. జగన్‌ను చూసి యనమలకు, టీడీపీ నేతలకు నిద్రపట్టడంలేదని, ఆ పేరు చెబితేనే భయపడిపోతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ భూ కుంభకోణాన్ని మరుగున పర్చేందుకు హుదూద్ తుఫాన్లో మూడు లక్షల దస్త్రాలు(అడంగళ్) కొట్టుకుపోయాయంటున్నారని విమర్శించారు. . కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు... తెలుగుదేశం, వైఎస్సార్ సీపీ బీజేపీతో కుమ్మక్కయ్యాయంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై కన్నబాబు మండిపడ్డారు. ఆ పార్టీ విధానాలకు స్పష్టత లేకపోవడం వల్లే అడ్రస్ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి దీక్షలు, ధర్నాలు, నిరసనలు సహా ఎన్నో ఉద్యమాలు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్లీనరీ సమావేశంలో మాజీ మంత్రి కొప్పన మోహనరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన వేణు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, పెండెం దొరబాబు, అల్లూరు కృష్ణంరాజు, పాముల రాజేశ్వరిదేవి, నియోజకవర్గాల కో–ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్తా శశిధర్, ముత్యాల శ్రీనివాస్, పర్వత ప్రసాద్, జక్కంపూడి విజయలక్ష్మి, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, వేగుళ్ళ లీలాకృష్ణ, వేగుళ్ళ పట్టాభిరామయ్యచౌదరి, గిరిజాల బాబు, కొండేటి చిట్టిబాబు, పితాని బాలకృష్ణ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, సంగిశెట్టి అశోక్, గుత్తుల సాయి, వట్టికూటి రాజశేఖర్, అమలాపురం పార్లమెంట్ పరిశీలకుడు వలవల బాబ్జి, రాజమహేంద్రవరం ప్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి, రాజమహేంద్రవరం, కాకినాడ అర్బన్ నియోజకవర్గాల అధ్యక్షులు కందుల దుర్గేష్, ఆర్‌వీజేఆర్ కుమార్, పిఠాపురం ప్లోర్‌లీడర్ గండేపల్లి బాబి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు శెట్టిబత్తుల రాజబాబు, మట్టా సుజాత, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి ఒమ్మిరఘురామ్, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు కొల్లి నిర్మలాకుమారి, అనంత ఉదయభాస్కర్, మట్టపర్తి మురళీకృష్ణ, అబ్దుల్‌బషీరుద్దీన్, పెట్టా శ్రీనివాస్, మార్గాని గంగాధర్ పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. -
టీఆర్ఎస్ ప్లీనరీకి.. సకల ఏర్పాట్లు
హైదరాబాద్ సిటీ : అధికార టీఆర్ఎస్ ప్లీనరీని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం పని మొదలు పెట్టింది. ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో జరగనున్న ప్లీనరీ కోసం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ మేరకు వేదిక, సభా ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, మంత్రి పద్మారావు గౌడ్ శుక్రవారం ఎల్బీ స్టేడియాన్ని సందర్శించారు. జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీకి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కలిపి 36వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి చెప్పారు.