- రాష్ట్ర స్థాయి అవార్డులకు ముగ్గురు ఎంపిక
- వీరిలో ఒక హెచ్‌ఎం, టీచర్, అధ్యాపకుడు
అనంతపురం ఎడ్యుకేషన్: గురపూజోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఈనెల 5న పంపిణీ చేయనున్న రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు ఎంపికయ్యారు. వీరిలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు, జూనియర్ కళాశాల అధ్యాపకుడు ఉన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వై.లోకేశ్వర్‌రెడ్డి, లేపాక్షి మండలం ఎం. వెంకటాపురం ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పని చేస్తున్న కె.హరిప్రసాద్, అనంతపురం కొత్తూరు బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా పని చేస్తున్న పి.లక్ష్మయ్య రాష్ట్ర స్థాయి అవార్డులకు ఎంపికయ్యారు. వీరి ఎంపిక పట్ల పలువరు ఉపాధ్యాయులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.
గురుభ్యోన్నమః
Published Fri, Sep 1 2017 9:39 PM | Last Updated on Tue, Sep 12 2017 1:34 AM
Advertisement
Advertisement