గుంటూరు : గుంటూరు జిల్లా తాడేపల్లి శివారు ప్రాంతంలోని దుర్గమ్మ వారధి వద్ద విజిలెన్స్ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు లారీలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం లారీలోని 360 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.