ఎస్‌ఐ రాత పరీక్షకు 415 మంది ఎంపిక
కర్నూలు : ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, జైలు వార్డర్ పోస్టుల నియామకాలకు సంబంధించిన శారీరక కొలతల పరిశీలన, దేహదారుఢ్య పరీక్షల ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. కర్నూలు రేంజ్ డీఐజీ రమణకుమార్ పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ప్రక్రియను గురువారం రాయలసీమ ఐజీ శ్రీధర్‌రావు పరిశీలించారు. కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి 415 మంది హాజరయ్యారు. అభ్యర్థుల అర్హత, ధ్రువీకరణ పత్రాల పరిశీలన, వేలి ముద్రల సేకరణ, ఛాతి, ఎత్తు కొలతల పరిశీలన, 1600 మీటర్లు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్ పరీక్షలను వరుసగా నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచి రాత పరీక్షకు 415 మంది ఎంపికయ్యారు. నిఘా కోసం ప్రతి ఈవెంట్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఏఆర్ అదనపు ఎస్పీ ఐ.వెంకటేష్, ఓఎస్‌డీ రవిప్రకాష్, డీఎస్పీలు రాజశేఖర్‌రాజు, ఏజీ కృష్ణమూర్తి, వెంకటరమణ, భక్తవత్సలం, సీఐలు, ఎస్‌ఐలు విధులు నిర్వహించారు.