'మీ ప్రాణాలకు 5.5 కోట్ల బస్సుంటే.. మా ప్రాణాలకు' | '5.5 Crores for Bus, Chief Minister?' Says Farmer in Letter Before Suicide | Sakshi
Sakshi News home page

'మీ ప్రాణాలకు 5.5 కోట్ల బస్సుంటే.. మా ప్రాణాలకు'

Published Wed, Sep 23 2015 7:08 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

'మీ ప్రాణాలకు 5.5 కోట్ల బస్సుంటే.. మా ప్రాణాలకు' - Sakshi

'మీ ప్రాణాలకు 5.5 కోట్ల బస్సుంటే.. మా ప్రాణాలకు'

పశ్చిమ గోదావరి: ఓ రైతు ఆత్మఘోషను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రైతు కల్లకు గట్టారు. తనలాంటి రైతు సోదరులందరి కష్టాలు కడతీరేందుకు, తన ప్రాణ త్యాగంతో ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని విశ్వసించి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 'అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు మీ ప్రాణాల రక్షించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థతో రూ.5.5కోట్లతో ప్రత్యేక బస్సు చేయించుకున్నారే.. మీ ప్రాణాలే విలువైనవా మావి కాదా' అంటూ ఆ రైతు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, యర్నగూడెంకు చెందిన పొగాకు రైతు సింహాద్రి వెంకటేశ్వరరావు తాను చనిపోయే ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి, కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు. ఆ లేఖలో పేర్కొన్న సారాంశం ఏంటంటే..

ఆంధ్రప్రదేశ్లో 14 వేలమంది పొగాకు రైతులు బ్యారెన్ లైసెన్సులు పొంది ఉన్నారని, ఇప్పుడు వారంతా అప్పుల ఊబిలో ఉన్నారని చెప్పారు. బ్యాంకు అప్పులు తీర్చలేక టుబాకో బోర్డులో సరుకు కొనక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాణరక్షణ కోసం ఏపీఎస్ ఆర్టీసీ ఐదున్నర కోట్లు వెచ్చించి బస్సు తయారు చేయించినప్పుడు తమ ప్రాణానికి విలువ ఉండదా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో హుదుద్ తుఫాను వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు ఆ బస్సు తీసుకున్నారని, అది షిప్ట్ ఆఫీసుగా ఉందని, టీవీ, సోఫా, కాన్ఫరెన్స్ స్క్రీన్, చిన్న పడక గదిలాంటి లగ్జరీలతో అది ఉందని కూడా రైతు ప్రస్తావించాడు. ఒక రైతు ప్రాణం తీసుకుంటుంటే ఆ రైతు కుటుంబం రోడ్డున పడుతోందని, అలాంటి రైతులను ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. అయితే, ఈ లేఖ ముఖ్యమంత్రికి అందిందో లేదో తెలియదుగానీ, తన బంధువు ద్వారా మాత్రం బయటకు వచ్చింది. దీనిపై పోలీసులను ప్రశ్నించగా ఆ రైతు కుటుంబ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన భార్య నుంచి మూడు నెలలుగా విడిపోయి వేరుగా ఉంటున్నాడని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement