పవర్‌ లిఫ్టర్‌కు ఐదు లక్షల చెక్కు | 5 lakh cash reward to lifter | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టర్‌కు ఐదు లక్షల చెక్కు

Published Thu, Jul 28 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

వి.లావణ్యకు రూ.5లక్షల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జలగం వెంకట్రావు

వి.లావణ్యకు రూ.5లక్షల చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే జలగం వెంకట్రావు

కొత్తగూడెం రూరల్‌:
    రాజస్థాన్‌ రాష్ట్రం ఉదయ్‌పూర్‌లో జరిగిన జూనియర్‌ ఆసియా పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించిన వి.లావణ్యగౌడ్‌కు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు రూ.5 లక్షల చెక్కు అందజేశారు. కొత్తగూడెంలో వ్యాయామశాల నిర్వహిస్తున్న లావణ్యగౌడ్‌కు ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఈ చెక్కును అందించింది. ఈ కార్యక్రమంలో పవర్‌ లిప్టింగ్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మల్లేశ్, నేతాజీ వ్యాయామశాల కోచ్‌ కుంచన కృష్ణారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు జీవీకే మనోహర్, కంచర్ల చంద్రశేఖర్, నాగేంద్రత్రివేది, అక్బర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement