ఆటోను ఢీకొన్న కారు
పెద్దవడుగూరు (తాడిపత్రి) : పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలోని టోల్ గేటు వద్ద నిల్చున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్‌ఐ రమణారెడ్డి కథనం ప్రకారం... జక్కలచెరువుకు చెందిన దçస్తగిరి పామిడిలో నివాసముంటూ పామిడి-గుత్తి మధ్య ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
బుధవారం ఉదయం 11:50 ప్రాంతంలో గుత్తి నుంచి ఆటో పామిడికి బయలుదేరింది. మార్గమధ్యంలోని టోల్ గేటు వద్దకు రాగానే అక్కడ డాబా నిర్వహించే వ్యక్తి ఆటో దిగి డబ్బులు ఇస్తుండగా, అదే సమయంలో గుత్తి వైపు నుంచి అనంతపురం వెళ్తున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చంద్రశేఖర్, రేణుక సహా గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన రామచంద్ర, పామిడి మహమ్మద్ అలీ, కృష్ణవేణి, వెంకటరమణమ్మ, ప్రసాద్ ఆటో డ్రైవర్ దస్తగిరి తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108లో గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యంకకోసం అనంతపురం తరలించారు. గాయపడిన వారిలో ఇంకా కొందరి వివరాలు తెలియరాలేదు.