యాదగిరిగుట్ట మండలం వరంగల్-హైదరాబాద్ రహదారిపై చిన్న కందుకూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
యాదగిరిగుట్ట మండలం వరంగల్-హైదరాబాద్ రహదారిపై చిన్న కందుకూరు స్టేజి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు బైక్‌పై వస్తోన్న ఆంజనేయులు అనే వ్యక్తి ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆంజనేయులు స్వగ్రామం వరంగల్ జిల్లా మద్దూరు.