బ్లాక్ మనీ మార్చలేదని ఉద్యోగం పీకేశారు! | A sad story of employ | Sakshi
Sakshi News home page

బ్లాక్ మనీ మార్చలేదని ఉద్యోగం పీకేశారు!

Published Tue, Nov 22 2016 3:49 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

బ్లాక్ మనీ మార్చలేదని ఉద్యోగం పీకేశారు! - Sakshi

బ్లాక్ మనీ మార్చలేదని ఉద్యోగం పీకేశారు!

పోడూరు: నల్లధనాన్ని మార్చేందుకు నిరాకరించిన ఓ చిరుద్యోగి జీవనోపాధి కోల్పోయిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చోటుచేసుకుంది. పోడూరు మండలం జిన్నూరు నరసింహరావుపేట ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పాలకొల్లు పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో బంక్ యజమానుల్లో ఒకరు తానిచ్చే రూ.2.35 లక్షల (రూ.500, రూ.1000 నోట్లు)ను ఆ ఉద్యోగి బ్యాంక్ ఖాతాలో వేసుకోవాల్సిందిగా సూచించాడు.

పరిస్థితులు చక్కబడిన అనంతరం ఆ మొత్తాన్ని బ్యాంక్ నుంచి డ్రా చేసి తనకు ఇవ్వాలని కోరాడు. అలా చేస్తే తనకు ఇబ్బంది కలుగుతుందని, దీనిపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తే చిక్కుల్లో పడతానని చెప్పిన సదరు చిరుద్యోగి ఆ సొమ్మును తన ఖాతాలో వేసేందుకు నిరాకరించాడు. దీంతో ఆ యజమాని అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ విషయం తెలిసి జిన్నూరు వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా చేయడం అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement