- స్నేహితులతో పాకాలకు వెళ్లిన కుమారస్వామి
- ఫిట్స్ వచ్చిందంటూ ఆస్పత్రిలో చేర్పించిన మిత్రులు
- వైద్యం ప్రారంభించేలోగా కన్నుమూత
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Published Sat, Aug 13 2016 11:46 PM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
ఖానాపురం : అనుమానాస్పద స్థితి లో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, ఏఎస్సై కుమారస్వామిలు తెలిపిన వివరాల ప్రకారం.. గీసుగొండ మం డలం మచ్చాపురానికి చెందిన నమిండ్ల సాంబయ్య, మల్లమ్మ దంపతుల కుమారుడు నమిండ్ల కుమారస్వామి(28) ఓ దినపత్రికలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. వరంగల్‌లోని లేబర్‌కాలనీకి చెందిన ఆరూరి రవి, జన్ను అరుణ్, జన్ను మహేష్, జన్ను అరుణ్‌కుమార్‌లతో కలిసి పాకాలకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరాడు. పాకాలకు చేరుకొని అక్కడ మిత్రులంతా ఈత కొడుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ క్రమంలో కుమారస్వామికి ఫిట్స్ వచ్చిందంటూ తోటి స్నేహితులు నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో వైద్యులు సెలైన్ బాటిల్ ఎక్కించే ప్రయత్నం చే శారు. అయితే అప్పటికే కుమారస్వామి మృతి చెందాడు. పాకాలకు వెళ్లిన తమ కొడుకు తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడని తెలుసుకున్న ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఆస్పత్రిలోని కుమారుడి మృతదేహాన్నిచూసి గుండెలవిసేలా ఏడ్చారు. అయితే మృతుడు కుమారస్వామితో కలిసి పాకాలకు వెళ్లినస్నేహితులు పరారవడం గమనార్హం. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఖానాపురం పోలీ స్‌స్టేçÙన్‌లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం మృతుడి తండ్రి సాంబయ్య ఫిర్యాదు చేశా రు. అనంతరం నర్సంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న కుమారస్వామి మృతదేహాన్ని పోలీసులు పరిశీ లించారు. మృతుడికి భార్య మహేశ్వరీ ఉంది. ‘మా అబ్బాయిని పాకాలకు తీసుకెళ్లిన వ్యక్తులే ఏదో చేసి ఉంటారు. వాడికి ఇప్పటిదాకా ఎన్నడూ ఫిట్స్ రాలేదు. ఇప్పుడు ఫిట్స్ వచ్చిందంటే నమ్మబుద్ధి కావడం లేదు. కారకులైన వారిని పోలీసులు పట్టుకోవాలి’ అని కుమారస్వామి తల్లిదండ్రులు కోరుతున్నారు.
Advertisement
Advertisement