ఏసీ కళాశాల అధ్యాపకుల నిరవధిక దీక్ష
ఏసీ కళాశాల అధ్యాపకుల నిరవధిక దీక్ష
Published Fri, Jul 29 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
గుంటూరు ఈస్ట్ : ఏసీ కళాశాలలో పని చేస్తున్న అన్‌ఎయిడెడ్ అధ్యాపకులకు వెంటనే జీతాలు చెల్లించాలని అన్‌ఎయిడెడ్ టీచింగ్ స్టాఫ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దారా అంబేడ్కర్ డిమాండు చేశారు. కళాశాల మెయిన్ గేటు వెలుపల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్‌ఎయిడెడ్ అధ్యాపకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేస్తూ శుక్రవారం నిరవధిక నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా దారా అంబేడ్కర్ మాట్లాడుతూ 30 మంది అన్‌ఎయిడెడ్ అధ్యాపకులకు ఏఈఎల్‌సీ యాజమాన్యం 30 నెలలుగా జీతాలు చెల్లించడం లేదన్నారు. రూ.3,500 జీతంతో పనిచేస్తున్న అధ్యాపకులంతా భవిష్యత్తులో రెగ్యులర్ అవుతుందన్న ఆశతో అప్పుల పాలవుతున్నా ఉద్యోగాలు చేస్తున్నారని వివరించారు. కనీసం ఆ జీతం కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. కనీస వేతనం రూ.15 వేలుగా నిర్ణయించి జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వేణు ప్రకాశ్ బాబు, ఉపాధ్యక్షుడు వెంకటరత్నం, కనపాల జోసఫ్ ఆర్‌పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భగత్ సింగ్, నగర కన్వీనర్ తూమాటి ఇర్మియేల్, ఎం.సిరిల్ కుమార్, తూమాటి మోజస్, అధ్యాపకులు పాల్గొన్నారు.
Advertisement