ఆదిశేషు అక్రమాస్తులు రూ.100 కోట్లు! | ACB Raids on assistant commissioner excise Adiseshu | Sakshi
Sakshi News home page

ఆదిశేషు అక్రమాస్తులు రూ.100 కోట్లు!

Published Wed, Jan 20 2016 1:03 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ఆదిశేషు అక్రమాస్తులు రూ.100 కోట్లు! - Sakshi

ఆదిశేషు అక్రమాస్తులు రూ.100 కోట్లు!

విజయవాడ : విజయవాడలోని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఇంటిపై బుధవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని బంధువుల ఇళ్లపై కూడా ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదిశేషుకు చెందిన దాదాపు రూ. 100 కోట్ల అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.

సాయంత్రానికి ఈ తనిఖీలు పూర్తయి... మరిన్నీ ఆస్తులు బహిర్గతమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం చాగల్లు బెవరేజెస్ కార్పొరేషన్లో పని చేస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించి ఆక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఆదిశేషుతోపాటు అతడి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement