ఆదిశేషును విచారిస్తున్న ఏసీబీ
విజయవాడ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పట్టుబడిన ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఎం. ఆదిశేషును ఏసీబీ అధికారులు గురువారం విజయవాడలో విచారిస్తున్నారు. అందులోభాగంగా అతడికి చెందిన బ్యాంక్ లాకర్లను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. అందుకోసం రంగం సిద్ధం చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు మద్యం డిపోలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ మిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఎం. ఆదిశేషు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలోని ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడి చేశారు.
అలాగే గుంటూరు, ఏలూరులోని బంధువుల ఇళ్లపై ఏసీబీ ఏకకాలంలో దాడులు చేసింది. ఈ దాడుల్లో రూ. 80 కోట్ల ఆస్తులు ఆదిశేషు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అందులోభాగంగా ఏసీబీ అధికారులు ఎం.ఆదిశేషును ప్రశ్నిస్తున్నారు.