ఆదిశేషు ఆస్తులు అటాచ్
విజయవాడ : ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు ఆస్తులును గురువారం ఏసీబీ అటాచ్ చేసింది. ప్రభుత్వం ఆయన్ని విధుల నుంచి సస్పెన్షన్ చేసింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లులో విధులు నిర్వహిస్తున్న ఆదిశేషు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ నేపథ్యంలో విజయవాడలోని ఆయన నివాసంతో పాటు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లాలోని బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ దాడుల్లో ఆదిశేషు సుమారు రూ. 130 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో అతడి అస్తులను ఏసీబీ అటాచ్ చేసింది. అలాగే విధుల నుంచి తొలగించింది.