కటకటాల్లో కీచకుడు | accuse arrest of sexual case | Sakshi
Sakshi News home page

కటకటాల్లో కీచకుడు

Published Fri, Apr 7 2017 11:34 PM | Last Updated on Thu, Oct 4 2018 8:29 PM

accuse arrest of sexual case

అనంతపురం సెంట్రల్‌ : కోడలిపై కన్నేసి, ఆమెను లైంగికంగా వేధించడమే గాక, చంపుతానంటూ బెదిరించిన కేసులో కీచక మామను ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అనంతపురం వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌ కథనం ప్రకారం...  అనంతపురం నీరుగంటివీధిలో ఆదినారాయణ అనే వ్యక్తికి అంధుడైన కుమారుడు ఉన్నాడు. దీన్ని ఆసరా చేసుకుని కోడలిని లైంగికంగా వేధించాడు. ఆమె అడ్డం తిరగడంతో హతమారుస్తానంటూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. మామా బారి నుంచి తప్పించుకున్న ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పరారీలో ఉన్న నిందితుడ్ని చివరకు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని సీఐ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement