adinarayana
-
మిస్సింగ్ కాదు మోసం.. ఆదినారాయణ అదృశ్యం కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, కోడూరు(అవనిగడ్డ): కృష్ణానదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ ద్వారా నమ్మించే ప్రయత్నం చేసిన ఆదినారాయణ మిస్సింగ్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు.. పెడన మండలంలోని కాకర్లపూడి శివారు ముత్రాస్పాలెం గ్రామానికి చెందిన యరగాని ఆదినారాయణ ఈ నెల 25వ తేదీన ఇంటి వద్ద నుంచి తన ద్విచక్రవాహనంపై ఉల్లిపాలెం–భవానీపురం వారధి వద్దకు చేరాడు. రాత్రి 7గంటల సమయంలో ఆదినారాయణ తన బైక్‌ను వారధిపై ఉంచి, అందులో తాను చనిపోతున్నట్లుగా సూసైడ్ నోట్ రాసి బైక్ ట్యాంక్ కవర్లో పెట్టాడు. ఇదే సూసైడ్ నోట్‌ను తన భార్య నవ్యశ్రీ ఫోన్‌కు కూడా పంపాడు. అప్పుల బాధలు ఎక్కువ కావడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన కోసం ఎవరూ గాలించవద్దని, గాలించినా కూడా తన మృతదేహం దొరకదంటూ ఆదినారాయణ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కోడూరు వంతెన సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న ఆదినారాయణ రెండు రోజుల పాటు ముమ్మర గాలింపు.. ఆదినారాయణ బైక్‌తో పాటు సూసైడ్ నోట్ కూడా వారధిపై ఉండడంతో పోలీసులు ఆదినారాయణ వారధిపై నుంచి కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు కోడూరు, పెడన పోలీసులు, ఎన్ఢీఆర్ఎప్ బృందాలు, స్థానిక మత్స్యకారుల సహాయంతో కృష్ణానదిని జల్లెడ పట్టారు. బందరు, కోడూరు మండలాల్లో ప్రవహించే నది ప్రాంతమంతా వెతికినా కూడా ఆదినారాయణ ఆచూకీ లభించలేదు. సహజంగా ఓ వ్యక్తి నదిలో దూకితే 36గంటల లోపు నీటిలో పైకి తేలతాడని, అయితే ఆదినారాయణ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు మరో కోణంలో తమ దర్యాప్తును ప్రారంభించారు. సీసీ టీవీ ఫుటేజీల్లో ఆచూకీ.. ఆదినారాయణ నదిలో దూకలేదని పోలీసులకు అనుమానం రావడంతో పెడన దగ్గర నుంచి కోడూరు వరకు ఉన్న అన్ని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలించారు. ఇంటి వద్ద నుంచి బయలుదేరినప్పుడు ఆదినారాయణ వద్ద బ్యాగ్ లేదని, బందరులోని ఓ దుకాణంలో బ్యాగ్‌ను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అక్కడ నుంచి బైక్‌పై చిన్నాపురం మీదగా ఉల్లిపాలెం వస్తున్నట్లు సీసీ టీవీల్లో రికార్డు అయింది. ఉల్లిపాలెం వారధి వద్ద ఆదినారాయణ తాను ఇంటి వద్ద వేసుకున్న దుస్తులను మార్చుకొని, ముఖానికి మాస్క్ ధరించి ఆటోలో కోడూరు వెళ్లడాన్ని గుర్తించారు. కోడూరు వంతెన సెంటర్లోని గంగాభవానీ అమ్మవారి దేవాలయం వద్ద ఆదినారాయణ ఆటో దిగడంతో పాటు చేతిలో బ్యాగు పట్టుకొని, మరో బ్యాగు తగిలించుకొని నవ్వుతూ సెల్‌ఫోన్‌ల్లో మాట్లాడుకుంటూ అక్కడ తిరగడం సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. కోడూరు నుంచి అవనిగడ్డకు బైక్‌ను లిఫ్ట్ అడిగి వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. తప్పుదోవ పట్టించేందుకు.. విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు వారధి వద్ద బైక్, సూసైడ్ నోట్ పెట్టి ఆదినారాయణ బయట ప్రాంతాలకు పరారయ్యాడని పోలీసులు చెప్పారు. చేసిన అప్పులు కట్టకుండా తప్పించుకొనేందుకు ఈ తరహాలో మోసానికి పాల్పడినట్లు తమ విచారణలో తేలిందన్నారు. ఆదినారాయణ ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగుతుందని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ కూడా కొనసాగుతుందని ఎస్ఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పెడన పోలీసులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారని ఎస్ఐ చెప్పారు. -
ఎస్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం
ఘంటసాల(అవనిగడ్డ): ఆందోళనలు, రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దని చెప్పిన ఘంటసాల ఎస్ఐ శ్రీనివాస్‌పై మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఊగిపోయారు. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఆయనకు వంతపాడారు. దీంతో టీడీపీ నేతలు ఎస్ఐపై రెచ్చిపోయారు. వారి తీరుతో కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలో చేపట్టిన టీడీపీ ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. ఎస్ఐ కూచిపూడి శ్రీనివాస్ తెలిపిన వివరాలు..చంద్రబాబు పిలుపు మేరకు సోమవారం బుద్ధప్రసాద్ నేతృత్వంలో మాజీ ఎంపీ కొనకళ్లతో మరికొంతమంది టీడీపీ నేతలు శ్రీకాకుళం నుంచి ర్యాలీగా ఇసుక క్వారీ వరకు వెళ్లారు. అక్కడ టీడీపీ జెండాలు ఉంచి నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ ఈ ఆందోళన కార్యక్రమానికి ఒక గంట మాత్రమే అనుమతిచ్చారు. పామర్రు టీడీపీ ఇన్చార్జి వర్ల కుమారరాజా రావడం ఆలస్యం కావడంతో ఇచ్చిన సమయం దాటిపోయింది. అయినప్పటికీ కొంతమంది నేతలు మాట్లాడుతుండటంతో మీకిచ్చిన సమయం అయిపోయింది, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఏదైనా ఉంటే చట్టపరంగా చూసుకోవాలని ఎస్ఐ సూచించారు. దీంతో కోపోద్రిక్తుడైన బుద్ధప్రసాద్.. ‘ఇసుక దోపిడీకి అనుమతిస్తావా, మేము మాట్లాడుతుంటే ఆడ్డుపడతావా’ అంటూ ఎస్ఐపై విరుచుకుపడ్డారు. ఇసుక దోపీడిని అరికట్టకుండా మమ్మల్నే అడ్డుకుంటావా..అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. కొనకళ్ల కలి్పంచుకుని ఇసుక దోపిడీ గురించి మాట్లాడుతుంటే అడ్డుకుంటానికి మీరెవరు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మచిలీపట్నం పార్లమెంటరీ టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షుడు మాచవరపు ఆదినారాయణ ఎస్ఐకి వేలు చూపిస్తూ.. నువ్వు దొంగవి అంటూ దురుసుగా ప్రవర్తించారు. అనంతరం జేపీ సిబ్బందిని తీసుకొచ్చిన ఎస్ఐ శ్రీనివాస్.. ఇసుక ధరలు, క్వారీ అనుమతుల గురించి బుద్ధప్రసాద్‌తో మాట్లాడించారు. ఇక్కడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గ పరిధిలో జగనన్న కాలనీలకు సంబంధించిన స్టాక్ పాయింట్లకు ఇసుక రవాణా చేయడం వల్ల వాటికి రేటు వేయరని చెప్పారు. మైనింగ్ అనుమతి గురించి ప్రశ్నించగా.. మా ఉన్నతాధికారుల వద్ద వివరాలున్నాయని సిబ్బంది చెప్పారు. ఇసుక క్వారీకి సంబంధించి అనుమతులు చూపించాలని లేదంటే రేపు పోలీస్ స్టేషన్ ఎదుట నిరాహార దీక్ష చేస్తామంటూ ఎస్ఐని బుద్ధప్రసాద్ హెచ్చరించారు. -
పుట్టుమచ్చలు చూపాలంటూ వేధింపులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం/తనకల్లు: పుట్టుమచ్చలు చూపాలంటూ విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న ఉపాధ్యాయుడి లీలలు ఆలస్యంగా వెలుగుచూశాయి. విచారణ జరిపిన అధికారులు ఆయనను గురువారం సస్పెండ్ చేశారు. శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లగుట్లపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జీవీ ఆదినారాయణ ఇన్చార్జ్ హెడ్మాస్టర్. పుట్టుమచ్చలు చూపాలంటూ కొన్ని రోజులుగా 8, 9, 10 తరగతి విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారు. ఆయనకు భయపడిన విద్యార్థినులు తల్లిదండ్రులకు విషయం చెప్పలేకపోయారు. కాగా, జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా పాఠశాలలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధితో పాఠశాలకు చెందిన ఓ బాలిక తన గోడును వెళ్లబోసుకుంది. దీంతో ఆ ప్రతినిధి ఆ తర్వాత కూడా కొన్ని రోజుల పాటు ఆ ఉపాధ్యాయుడి వ్యవహారశైలిని పరిశీలించి, అతడి అకృత్యాలు నిజమేనని నిర్ధారించుకున్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖాధికారి మీనాక్షికి సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు విచారణ జరిపి జీవీ ఆదినారాయణను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఆదినారాయణపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎంఈవో లలితమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల రాజీ యత్నం ఉపాధ్యాయుడు జీవీ ఆదినారాయణ భార్య రామలక్ష్మి గతంలో టీడీపీ ఓబుళదేవర చెరువు మండలం జెడ్పీటీసీగా పనిచేశారు. ఇప్పటికీ టీడీపీలో క్రియాశీలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసును నీరుగార్చేందుకు శ్రీసత్యసాయి జిల్లా టీడీపీ ముఖ్యనేత ఒకరు తీవ్రంగా యత్నిస్తున్నారు. జీవీ ఆదినారాయణ వయసు ప్రస్తుతం 61 ఏళ్లు కావడం, కేసు బలంగా ఉంటే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు రావన్న ఉద్దేశంతో కేసు నీరుగార్చేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే బాలికల తల్లిదండ్రులతోనూ రాజీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
వైద్యుడిపై పోలీస్ ఆఫీసర్ దాడి..!
సాక్షి, నరసరావుపేట రూరల్ : ఎన్నికల సమయంలో పోలీసులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. ఎంతో హుందాగా ఉండాల్సిన వీరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేట టూటౌన్ సీఐ ఆదినారాయణ.. అత్యవసర చికిత్స అందించేందుకు ఆస్పత్రికి వెళ్తున్న వైద్యునిపై అకారణంగా దాడికి పాల్పడి వీధి రౌడీలాగా వ్యవహరించాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలో టీడీపీ, జనసేన అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ల ర్యాలీలు నిర్వహించారు. టీడీపీ ర్యాలీ ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరింది. ఇదే సమయంలో స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చెందిన సుస్మిత ఆర్థో ట్రామాకేర్ సెంటర్లో రోగికి చికిత్స అందించేందుకు డాక్టర్ జయభారత్‌రెడ్డి తన కారులో అక్కడికి చేరుకున్నారు. కారు ఆసుపత్రిలోకి వెళ్లే సమయంలో ర్యాలీ రావడంతో అక్కడే విధుల్లో ఉన్న టూటౌన్ సీఐ ఆదినారాయణ ఆగ్రహంతో ఊగిపోతూ చేతిలో ఉన్న వాకీటాకీతో కారు అద్దంపై గట్టిగా కొట్టాడు. అంతటితో ఆగకుండా.. డ్రైవింగ్ సీటులో ఉన్న డాక్టర్ జయభారత్‌రెడ్డిని కారు నుంచి బలవంతంగా చొక్కా పట్టుకుని కిందకు లాగి భౌతికదాడికి పాల్పడ్డాడు. దీంతో జయభారత్‌రెడ్డి తాను డాక్టర్‌నని, రోగికి అత్యవసర చికిత్స అందించేందుకు వెళ్తున్నానని ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డాడు. డాక్టర్‌ను గుర్తించిన స్థానికులు.. సీఐకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా వారిపైనా దురుసుగా ప్రవర్తించాడు. కాగా, సంఘటనలో కారు అద్దం దెబ్బతినగా, డాక్టర్ జయభారత్‌రెడ్డి ఒంటిపై గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి చేరుకుని జయభారత్‌రెడ్డిని పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. అనంతరం ఆయన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఐ దాడిని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా తీవ్రంగా ఖండించింది. డాక్టర్ విధులకు ఆటంకం కలిగించిన సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఐఎంఏ పట్టణ శాఖ అధ్యక్షుడు డా.ఏఏవీ రామలింగారెడ్డి డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన సీఐ ఆదినారాయణపై జయభారత్‌రెడ్డి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
మేడాపురం ఘటనలో ఏడుగురి అరెస్టు
ధర్మవరం అర్బన్ : చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో నాగమ్మ, ముత్యాలప్ప దంపతుల కుమారుడు ఆదినారాయణ(17) పట్ల అమానుషంగా వ్యవహరించిన ఉదంతంలో ఏడుగురిని బుధవారం అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ హరినాథ్ తెలిపారు. ధర్మవరంలోని గుట్టకిందపల్లికి చెందిన మల్లికార్జున, అతని అనుచరులు అనుచరులు షెక్షావలి, బాబయ్య, నారాయణ, ఆర్వేటి లింగమయ్య, తాడిమర్రి రహంతుల్లా, జె.ఆంజనేయులు కలసి బాలుడి పట్ల క్రూరత్వంగా ప్రవర్తించిన సంగతి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితులందరినీ అరెస్టు చేసి, అనంతపురం జూనియర్ సివిల్ కోర్టులో హాజరుపరచగా జూలై 4 వరకు వారిని రిమాండ్‌కు ఆదేశిస్తూ జడ్జి గీతావాణి ఆదేశించారని వివరించారు. -
వడదెబ్బకు ఉపాధి కూలీ మృతి
లేపాక్షి (హిందూపురం) : లేపాక్షి మండలం కల్లూరుకు చెందిన ఆదినారాయణ(45) అనే ఉపాధి కూలీ వడదెబ్బతో గురువారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఉదయమే ఉపాధి పనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాక, కాసేపు విశ్రాంతి తీసుకున్నాడని వివరించారు. అంతలోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం హిందూపురం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. మృతునికి భార్య లక్ష్మమ్మ, ఒక కుమారుడు ఉన్నాడు. -
ప్రాణాలు తీస్తున్న వడదెబ్బ
సూర్యభగవానుడు అగ్నిగోళమై మండుతున్నాడు. వడగాల్పులతో జనం బిక్కచచ్చిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న వడదెబ్బ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మంగళవారం మరో ముగ్గురు బలికావడంతో ఆయా ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పెద్దదిక్కును కోల్పోయి ఆయా కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. గుంతకల్లు రూరల్: గుంతకల్లు మండలంలోని వై.టి.చెరువు గ్రామంలో చిన్నాయప్ప అలియాస్ ఆంజనేయులు(52) అనే వ్యవసాయ కూలీ వడదెబ్బతో మృతి చెందారు. సోమవారం కూలీ పనులకు వెళ్లొచ్చిన ఆయన రాత్రి ఇంటికి చేరుకున్నారని బంధువులు తెలిపారు. నీరసం, తలనొప్పిగా ఉందంటూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు చెప్పారు. ఆ వెంటనే ప్రాణం వదిలినట్లు పేర్కొన్నారు. మృతునికి భార్య సోమక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకట్రావిురెడ్డి(వైవీఆర్) మంగళవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకున్నారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట పార్టీ నాయకులు దశరథరెడ్డి, శంకర్, జయరావిురెడ్డి, మద్దన్న, జయన్న, సిపాయి బాషా, గోపాల్, నరసింహులు, పక్కీరప్ప ఉన్నారు. డి.చెర్లోపల్లిలో మరొకరు... బత్తలపల్లి (ధర్మవరం): బత్తలపల్లి మండలం డి.చెర్లోపల్లిలో గుజ్జల కృష్ణమూర్తి(55) వడదెబ్బతో మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూలీ పనులకు వెళ్లిన అతను సాయంత్రం ఇంటికి రాగానే తీవ్ర తల, ఒళ్లు నొప్పులతో అస్వస్థతకు గురైనట్లు వివరించారు. తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. నాయనపల్లిలో ఇంకొకరు... నార్పల(శింగనమల): నార్పల మండలం నాయనపల్లిలో వల్లెపు ఆదినారాయణ(69) అనే గొర్రెల కాపరి వడదెబ్బకు గురై మంగళవారం సాయంత్రం మరణించినట్లు బంధువులు తెలిపారు. ఉదయం పొట్టేళ్లను మేత కోసం తోలుకెళి్లన ఆయన, మధ్యాహ్నం 3 గంటలకు అస్వస్థతకు గురై కుప్పకూలిపోయినట్లు వివరించారు. తోటి కాపర్లు చికిత్స కోసం నాయనపల్లి క్రాస్‌లోని ఆస్పత్రి వద్దకు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు అక్కడి వైద్యుడు నిర్ధారించారన్నారు. మృతుని భార్య, కుమారుడు అనాథలయ్యారు. -
కటకటాల్లో కీచకుడు
అనంతపురం సెంట్రల్ : కోడలిపై కన్నేసి, ఆమెను లైంగికంగా వేధించడమే గాక, చంపుతానంటూ బెదిరించిన కేసులో కీచక మామను ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. అనంతపురం వన్‌టౌన్ సీఐ రాఘవన్ కథనం ప్రకారం... అనంతపురం నీరుగంటివీధిలో ఆదినారాయణ అనే వ్యక్తికి అంధుడైన కుమారుడు ఉన్నాడు. దీన్ని ఆసరా చేసుకుని కోడలిని లైంగికంగా వేధించాడు. ఆమె అడ్డం తిరగడంతో హతమారుస్తానంటూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. మామా బారి నుంచి తప్పించుకున్న ఆ అభాగ్యురాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పరారీలో ఉన్న నిందితుడ్ని చివరకు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, రిమాండ్‌కు జడ్జి ఆదేశించారని సీఐ వివరించారు. -
‘అనంత’లో కీచకుడు
అనంతపుర ం సెంట్రల్ : అనంతపురంలో ఓ కీచకుడు వావివరసలు మరిచాడు. సొంత కోడలినే లైంగికంగావేధించాడు. తనకు లొంగలేదనే కసితో గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు. అనంతపురం వన్ టౌన్ సీఐ రాఘవన్ కథనం మేరకు... నీరుగంటి వీధిలో ఉంటున్న ఆదినారాయణ అనే వ్యక్తి సొంత కోడలిని లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆదినారాయణ కుమారుడు పుట్టుకతోనే అంధుడు. ఐదేళ్ల కిందట ఆయనకు ఓ మహిళతో వివాహం జరిపించారు. వారికి ఇద్దరు పిల్లలు. అయితే అంధుడైన కుమారుడు ఇంట్లో లేని సమయంలో కోడలిపై మామ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. గురువారం బలవంతం చేశాడు. అందుకు ఆమె ససేమిరా అనడంతో చంపుతానంటూ బెదిరించాడు. అంతటితో ఆగక గొంతునులిమేందుకు యత్నించాడు. అయితే ఆమె తప్పించుకుని జరిగిన ఘటనను భర్త, ఆమె బంధువులకు తెలిపారు. అనంతరం వన్‌టౌన్ సీఐకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కీచక మామ కోసం గాలిస్తున్నారు. -
విత్తన నాణ్యతలో రాజీపడేది లేదు
అనంతపురం అగ్రికల్చర్ : విత్తన వేరుశనగ నాణ్యత విషయంలో రాజీపడేది లేదని, నిబంధనల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఏపీ మార్క్‌ఫెడ్ జనరల్ మేనేజర్ (జీఎం) ఆదినారాయణ ఆదేశించారు. శుక్రవారం జిల్లాకు వచ్చిన ఆయన మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎ.బాలభాస్కర్తో కలిసి అనంతపురం, కల్లూరు, ధర్మవరం, గుత్తి ప్రాంతాల్లో ఉన్న విత్తన వేరుశనగ ప్రాసెసింగ్ ప్లాంట్లను సందర్శించారు. అక్కడ జరుగుతున్న విత్తనశుద్ధి కార్యక్రమాన్ని పరిశీలించారు. తేమశాతం, వ్యర్థాలు, కల్తీ విత్తనాలు తదితర విషయాల్లో నిబంధనలు తప్పకుండా పాటించి, విత్తనశుద్ధి చేయాలన్నారు. ప్యాకింగ్, ట్యాగ్, సంచులు తదితర అంశాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతపురం జిల్లాలో రాయితీ విత్తన వేరుశన పంపిణీకి మార్క్‌ఫెడ్ తరఫున ఈ ఏడాది 34,600 క్వింటాళ్లు సేకరించి నిల్వ చేస్తున్న నేపథ్యంలో రైతులకు మంచి విత్తనకాయలు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
స్కూటర్‌ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఉంగటూరు మండలానికి చెందిన ఆదినారాయణ, బాపనమ్మ (56) దంపతులు స్కూటర్‌పై రాజమండ్రిలోని బంధువుల ఇంట జరగనున్న వివాహ వేడుకకు వెళుతున్నారు. దొమ్మేరు సమీపంలో వీరి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. వారిద్దరూ కిందపడిపోగా బాపనమ్మ తలపై నుంచి లారీ చక్రం వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆదినారాయణ తలకు హెల్మెట్ పెట్టుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. -
దంపతులపై దాడి.. కేసు నమోదు
ఇంటి ముందు నిల్చొని ఉన్న భార్య భర్తలపై నలుగురు యువకులు దాడి చేసిన సంఘటన నగరంలోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అరుణ్‌కాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ఆదినారాయణ, ప్రమీలలు ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో అటుగా వచ్చిన నలుగురు యువకులు వారిపై దాడి చేశారు. దీంతో వారికి గాయాలవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. -
మున్సిపాలిటీ 'పరువు' హత్య!
పన్నుల వసూళ్ల కోసం చెత్త పద్ధతులు ఫాలో కావద్దని న్యాయస్థానాలు ఓ వైపు చీవాట్లు పెడుతూనే ఉన్నా పురపాలక అధికారుల చిత్తంలో మాత్రం మార్పు రావట్లేదు. చిత్తూరు జిల్లా పుంగనూరులో బకాయి వసూళ్ల కోసం మున్సిపల్ అధికారులు చేసిన నిర్వాకం ఓ నిండు ప్రాణాల్ని బలితీసుకుంది. సకాలంలో పన్నులు చెల్లించలేదంటూ పుంగనూరుకు చెందిన ఆదినారాయణ ఇంటి ముందు చెత్త ట్రాక్టర్‌ను నిలిపారు. మున్సిపల్ అధికారుల చర్యను ఘోర అవమానంగా భావించిన ఆదినారాయణ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఆదినారాయణ వైఎస్సీర్ సీపీ రైతు విభాగం పుంగనురు అధ్యక్షుడు కూడా. మున్సిపల్ అధికారులే ఆదినారాయణను పొట్టనబెట్టుకున్నారంటూ ఆయన భార్యా, పిల్లలు పెద్దపెట్టున రోదించడం పలువురిని కంటతడి పెట్టించింది. అధికారులపై హత్య కేసు నమోదుచేయాలని కుటుంబసభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పుంగునూరు, పలమనేరు ఎమ్మెల్యేలు ఘటనా స్థలాన్ని సందర్శించారు. -
రిజిస్ట్రేషన్..పరేషాన్
డీఆర్ కార్యాలయంలో ఒక ఉద్యోగి రెండేసి బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ ఆదినారాయణ లాంగ్‌లీవులో వెళ్లారు. హెడ్‌క్లర్క్ జయకుమార్ ఆదోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి డెప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో డీఐజీ కార్యాలయం నుంచి వచ్చిన సీనియర్ అసిస్టెంట్ రాముడు హెడ్క్లర్క్తోపాటు సొసైటీ రిజిస్ట్రేషన్ విధులు నిర్వహిస్తున్నాడు. జూనియర్ అసిస్టెంట్ లలిత్‌కుమార్ చిట్స్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ రెండింటి విధులను నిర్వహిస్తున్నారు. ఖాళీగా ఉన్న డీఆర్ పోస్టులు: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో కీలకమైన మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కర్నూలు జిల్లా రిజిస్ట్రార్‌గా ఎన్.మాధవి విధులు నిర్వహిస్తూ కార్యాలయానికి వచ్చిన వ్యక్తి కేసీ రాముడితో లంచం తీసుకుంటూ గతేడాది ఏప్రిల్ 24న ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెగ్యులర్ డీఆర్ లేక అనేక ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ స్థానానికి ఇన్చార్జ్గా ఆడిట్ డీఆర్ అనిల్‌కుమార్‌ను నియమించారు. ఈయన కూడా ఈ ఏడాది మే 31న పదవీ విరమణ పొందారు. దీంతో కర్నూలు డీఆర్ స్థానంతోపాటు ఆడిట్ డీఆర్ స్థానం ఖాళీ అయింది. నంద్యాల డీఆర్‌గా అబ్రహం విధులు నిర్వహిస్తూ ఆరునెలల క్రితం ఒంగోలు డీఆర్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం జిల్లాలో రెండు డీఆర్, ఒక ఆడిట్ డీఆర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో కర్నూలు డీఆర్, ఆడిట్ డీఆర్ ఇన్చార్జ్ బాధ్యతలను డిఐజీ గిరిబాబుకు, నంద్యాల డీఆర్ ఇన్చార్జ్ బాధ్యతలు ప్రొద్దుటూరు డీఆర్ గంగిరెడ్డికి అప్పగించారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్ల హల్చల్ డీఐజీ, డీఆర్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులు కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో హల్చల్ చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో అధిక సీట్లు ఖాళీగా ఉన్నప్పుడు బుద్ధిగా విధులు నిర్వహించాల్సిన వారు రోజూ కర్నూలు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, డీఐజీ గిరిబాబుల పేర్లు వినియోగిస్తూ హడావుడి చేస్తూ బంధువులకు, స్నేహితులకు ఆగమేఘాల మీద పనులు చేసిపెట్టేందుకు ప్రాధాన్యత ఇస్తూ తమ విధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. వీరితో పాటు ఓ సబ్ రిజిస్ట్రార్ తనకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాగా తెలుసు.. తన మాట వినకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ ఉద్యోగులను వేధిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై డిప్యూటీ సీఎంకు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. తన పేరును ఎవరు వాడుకున్నా సహించేది లేదని ఫిర్యాధిదారులకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే ఫిర్యాదిదారులు మాజీ మంత్రి మూలింటి మారెప్ప దృష్టికి తీసుకురావడంతో ఆ ఇద్దరి జూనియర్ అసిస్టెంట్లతో పాటు, ఆ సబ్ రిజిస్ట్రార్‌పై కూడా చర్యలు తీసుకుని ట్రాన్స్ఫర్ చేయండి అంటూ మారెప్ప డీఐజీకి ఫిర్యాదు చేశారని తెలిసింది. సాక్ష్యాత్తు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి ఆ శాఖ బాధ్యతలు ఉండడంతో ఆయన ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.