కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
నెల్లూరు(పొగతోట): విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసి తరగతులు నిర్వహించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ డి.అంజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేఎస్‌ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో అనుమతి లేకుండా అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేశారని, బీఎస్సీ అగ్రికల్చర్, బి–టెక్ కోర్సులకు సంబంధించి 43 మంది విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేశారని తెలిపారు. ఫీజులు చెల్లించిన విద్యార్థులు ఆఫీసులో విచారించినా, ఫోన్లు చేసిన సమాచారం లేదన్నారు. 43 మంది విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ జేసి–2 రాజ్‌కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. ధర్నాలో జేఏసీ నాయకులు వాసిత్, శ్రీహర్ష, శేఖర్, వినయ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.