రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రవేశాలు
Published Fri, Jul 29 2016 12:44 AM | Last Updated on Fri, Aug 17 2018 3:08 PM
నల్లగొండ : ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో సెక్స్ వర్కర్ల కుటుంబాలకు చెందిన పిల్లలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఏజేసీ వెంకట్రావు అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం కింద యాదగిరిగుట్టలో సెక్స్ వర్కర్ల కుటుంబాలకు చెందిన 26 మంది పిల్లలను జిల్లా ఎస్పీ గుర్తించినందున వారిని సంక్షే మ శాఖల రెసిడెన్షియల్ స్కూళ్లలో చేర్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. 11 మంది బాలికలు, 15 బాలురు ఉన్నారని వీరికి ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించేందుకు అధికారులు చర్యలు తీసుకో వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీఆర్వో రవినాయక్, సంక్షేమ శాఖల అధికారులు రాజశేఖర్, వేణుగోపాల్, నరోత్తమ్‌రెడ్డి, ఆర్వీఎం పీవో కిరణ్‌కుమార్, రాజాపేట ఎస్‌ఐ బీసన్న పాల్గొన్నారు.
Advertisement