చిత్తూరు జిల్లాలో పలు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసిని పోలీసులు పట్టుకున్నారు.
చిత్తూరు జిల్లాలో పలు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కథనం..ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్(27) గత కొంతకాలంగా తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్ద తిప్పసముద్రం మండలాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు.
ఈ మేరకు బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. బుధవారం ఉదయం అతడు తంబళ్లపల్లె వద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ2.50 లక్షల విలువైన 97 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.