Sanjay Kumar Yadav
-
తొమ్మిది హత్యల కేసు : సంజయ్‌కు ఉరిశిక్ష
సాక్షి, వరంగల్ : తెలుగు రాష్ట్రల్లో సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంటలో జరిగిన తొమ్మిది హత్యలకు కారకుడైన సంజయ్ కుమార్ కి వరంగల్ న్యాయస్థానం లో ఉరి శిక్ష ఖరారు చేశారు. ఒక్క హత్యను కప్పి పుచ్చుకునేందుకు మరో 9మందిని హత్యలకు కారకుడైన మృగానికి ఉరి శిక్ష తీర్పు వెలువడింది. కేసు నమోదైనప్పటి నుంచి కేవలం ఐదు నెలల వారం రోజుల్లో శిక్ష పడేవిధంగా గీసుకొండ సీఐ శివరామయ్య సాక్షాలు సేకరించి తన చతురతని ప్రదర్శించారు. 25 రోజుల్లోనే కోర్డులో నేరారోపణ పత్రము దాఖలు చేశారు. కరోనా వల్ల అవాంతరాలు ఏర్పడినప్పటికీ ఒక నెల రోజుల్లోనే విచారణ పూర్తి చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు.. తీర్పును వెలువరించింది. నిందితుడికి ఉరిశిక్ష పడటం పట్ల వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. విచారణ త్వరగా పూర్తి చేసినందుకు పోలీసులను అభినందించారు. కాగా, కోర్టు తీర్పు పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మే 21న గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భాగంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు సంజయ్ వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేసి బావిలో పడేశాడు. తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పని కోసం వచ్చాక పరిచయం వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో బార్దాన్ గోదాంలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహ్మద్ మక్సూద్ ఆలం(47), ఆయన భార్య నిషా(40) పనిచేసేవారు. వీరితో పాటు మక్సూద్ కుమారులు షాబాజ్(19), సోహిల్ ఆలం(18)తో పాటు ఆయన కుమార్తె బుష్రా ఖాతూన్, ఆమె కుమారుడు బబ్లూ నివసించేవారు. ఈక్రమంలో బార్దాన్ పనికి వచ్చిన బీహార్ వాసి సంజీవ్ కుమార్ యాదవ్‌కు వీరితో పరిచయం ఏర్పడింది. ఇంతలోనే మక్సూద్ భార్య నిషా అక్క కుమార్తె రఫీకా(31) భర్తతో విడిపోయాక ముగ్గురు పిల్లలతో కలిసి పని కోసం వచ్చింది. ఆమెతోనూ çసంజయ్ పరిచయం పెంచుకున్నాడు. కొన్నాళ్లకు తనకు హోటళ్లలో తినడం ఇబ్బందిగా ఉందని చెబుతూ డబ్బు చెల్లించేలా మాట్లాడుకుని రఫీకా ఇంట్లో భోజనం చేయడం ఆరంభించాడు. ఆ పరిచయం సాన్నిహిత్యానికి.. ఆపై వివాహేతర సంబంధానికి దారి తీసింది. వివాహితతో పాటు ఆమె కుమార్తెతో.. మక్సూద్ సమీప బంధువైన రఫీకాతో సాన్నిహిత్యం ఏర్పడ్డాక ఆమె కుటుంబం మకాంను సంజయ్ జాన్‌పాకకు మార్చాడు. అక్కడ అద్దె ఇంటిని తీసుకుని వారితోనే ఉండసాగాడు. అప్పటికే యుక్త వయస్సుకు వచ్చిన రఫీకా కుమార్తెపై సంజయ్ కన్ను పడింది. ఈ విషయం రఫీకాకు తెలియగా నిలదీయడమే కాకుండా త్వరగా తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయసాగింది. దీంతో అడ్డు తొలగించుకోవాలని భావించిన సంజయ్.. బంధువులతో మాట్లాడాలంటూ పశ్చి మ బెంగాల్ బయలుదేరదీశాడు. విశాఖ వైపు గరీభ్‌ర థ్ రైలులో మార్చి 6న వెళ్లే క్రమంలో అప్పటికే సి ద్ధం చేసుకున్న నిద్రమాత్రలను మజ్జిగలో కలిపి ఇచ్చాడు. అది తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రఫీకా మెడకు చున్నీ బిగింగి రైలు నుంచి ఏపీలోని నిడదవోలు వద్ద తోసివేశాడు. ఆ తర్వాత రాజమండ్రిలో దిగి మరో రైలులో వరంగల్ వచ్చాడు. ఆమె ఎటు వెళ్లింది..? తాపీగా వచ్చిన సంజయ్ పని చేసుకుంటున్నాడు. అయితే, రఫీకా విషయమై నిషా సంజయ్‌ను గట్టిగా అడగసాగింది. పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పడంతో ఈ కుటుంబం అడ్డు కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాడు. కొడుకు పుట్టిన రోజే అందరికీ చివరి రోజు సంజయ్‌కుమార్ యాదవ్.. మక్సూద్ ఆలం కుటుంబాన్ని హతమార్చేందుకు మే 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు రెక్కీ నిర్వహించాడు. ప్రతీరోజూ సైకిల్‌పై వారు నివాసం ఉండే ఇంటికి వెళ్లి వస్తూ పరిశీలించాడు. ఈ కుటుంబంలో ఐదుగురికి తోడు పక్కన మరో భవనం పైభాగంలో నివాసముంటున్న బీహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంను గుర్తించాడు. చివరకు మే 20వ తేదీన మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం పుట్టినరోజు అని తెలుసుకుని సాయంత్రం వెళ్లాడు. మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసిన నిద్రమాత్రలను మక్సూద్ ఆలం కుటుంబంతో మాటల్లో ఉండగా పప్పు కూరలో కలిపాడు, అదే విధంగా శ్రీరాం, శ్యాం ఆహారంలో కూడా కలిపాడు. రాత్రి 12 గంటల వరకు అందరూ మత్తులో చేరుకోగా ఒకరి వెంట ఒకరిని గోనె సంచిలో పెట్టుకుని తీసుకొచ్చాడు. గోదాం – బావి మధ్య ఉన్న ప్రహరీపై ఆయన ఒక్కరొక్కరిని ఉంచాడు. ఆ పై తాను గోడ దూకి వారిని తీసుకెళ్లి బావిలో పడవేయసాగాడు. ఉదయం 5.30 గంటలకు మృతులు వాల్‌మార్ట్‌లో కొనుగోలు చేసి వస్తువులు, సెల్ఫోన్లు తీసుకుని జాన్‌పాక చేరుకున్నాడు. తొమ్మిది మంది మృతి చెందిన కేసును వరంగల్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితుడిని త్వరగా పట్టుకొని ఆధారాలు, సాక్ష్యాలు సేకరించి కోర్పుకు అప్పగించారు. దీంతో నిందితుడు సంజయ్‌కు ఉరిశిక్ష ఖరారైంది. -
9 హత్యల కేసు; కోర్టుకు నిందితుడు
వరంగల్ లీగల్ : వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో తొమ్మిది మందిని సజీవంగా బావిలో వేసి హత్య చేసిన కేసులో నిందితుడు సంజయ్‌కుమార్‌యాదవ్‌ను ఆరు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ మేరకు గీసుకొండ పోలీసులు గురువారం ఆయనను వరంగల్‌లోని కోర్టులో హాజరుపర్చగా కోర్టు అదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తొమ్మిది హత్యల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. (9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?) 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు కోర్టు ఆదేశించిన నేపథ్యంలో కేసు పూర్వాపరాలు, నిందితుని నుండి అదనపు సమాచారం కోసం ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కస్టడీలో భాగంగా ఆరు రోజుల పాటు సీన్ రీకన్‌స్ట్రక్టషన్ తరహాలో ఘటనా స్థలం, నిందితుడు అద్దెకు ఉన్న ఇళ్లు తదితర ప్రాంతాల్లో పరిశోధన జరిపిన పోలీసులు సంజయ్‌ను గురువారం కోర్టులో హాజరుపరిచారు. కాగా, నిందితుడిపై నమోదైన కేసులో పొందుపర్చిన వివిధ సెక్షన్ల క్రింద నేరం రుజువైతే రెండేళ్ల కఠిన కారాగారశిక్ష మొదలు యావజ్జీవ కారాగార శిక్ష.. చివరకు ఉరిశిక్ష సైతం పడే అవకాశం ఉందని సీనియర్ న్యాయవాదులు వ్యాఖ్యానిస్తున్నారు. నిందితుడి వయస్సు తక్కువే అయినందున శిక్షా కాలంలో ప్రవర్తన మార్పు తదితర అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పటికీ యావజ్జీవ కారాగార శిక్ష తప్పకుండా పడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. (సంజయ్‌కుమార్‌పై సీన్ రీ కన్స్ట్రక్షన్) -
9 హత్యల కేసు: వాటిని అమ్మిందెవరు?
సాక్షి, వరంగల్ రూరల్: గీసుకొండ మండలం గొర్రెకుంట శివారులోని పాడుపడిన బావిలో తొమ్మిది మందిని వేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ ఘటనలో భా గంగా మృతులందరి ఆహారంలో నిద్రమాత్రలు కలిపిన నిందితుడు వారు మత్తులోకి జారుకున్నాక హత్య చేశాడని పోలీసులు వెల్లడించా రు. ఇంత వరకు బాగానే ఉన్నా పెద్దమొత్తంలో నిద్ర మాత్రలు ఏ షాపులో కొనుగోలు చేశాడనే వివరాలు చెప్పకపోవడం గమనార్హం. విచారణలో భాగంగా నిందితుడు వరంగల్ చౌరస్తాలోని ఓ షాపులో మాత్రలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెబుతున్నా ఆ షాపు పేరు బహిర్గతం చేయడం లేదు. దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల్లో చిక్కిన నిందితుడు తొలుత చేసిన మహిళ హత్యను కప్పి పుచ్చుకునేందుకు నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ మరో తొమ్మిది మందిని హత్య చేసిన విషయం విదితమే. ఈ ఘటన జరిగాక పోలీసులు పడక్బందీ వ్యూహంతో ఏడు బృందాలు విడిపోయి మూడు రోజుల్లోగా నిందితుడిని అరెస్టు చేశారు. విచారణలో తొమ్మిది మందిని ఒక్కడే హతమార్చాడని వెల్లడిందని చెప్పిన పోలీసులు.. ఇంత మందిని హతమార్చేందుకు గాను బాధితులకు మత్తు కోసం 60 వరకు నిద్రమాత్రలను ఉపయోగించాడని ప్రకటించారు. కానీ నిద్రమాత్రలు కొనుగోలు చేసిన మెడికల్ షాపు పేరు కనుక్కోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పోలీసులకు షాపు పేరు తెలిసినా వెల్లడించడం లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి హంతుకుడిగా కఠిన శిక్షపడేలా చేస్తామని చెబుతున్న పోలీసులు.. మందుల షాపు విషయంలో మాత్రం తాత్సారం ఎందుకు చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చదవండి: ఒక హత్యను కప్పిపుచ్చేందుకు మరో 9 హత్యలు ప్రిస్క్రిప్షన్ లేకుండానే 60 మాత్రలా? కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రిస్క్రిప్షన్ లేకుండా దగ్గు, జలుబు మాత్రలు కూడా విక్రయించకూడదని మెడికల్ షాపుల నిర్వాహకులను రాష్ట్ర, జిల్లా అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఔషధ దుకాణాల నిర్వాహకులు తమ తీరును మార్చుకోవడం లేదని ఈ ఘటనలో వెల్లడైంది. గొర్రెకుంట ఘటనలో నిందితుడు ఉపయోగించిన 60 నిద్రమాత్రలు ఒక్క దుకాణంలోనే కొనుగోలు చేశాడా.. లేదంటే పలు షాపుల్లో తీసుకున్నాడా అనే ప్రశ్నకు అధికారుల నుంచి సమాధానం రావడం లేదు. ఈ విషయంపై డ్రగ్ కంట్రోల్ అధికారుల వివరణ కోరగా హంతకుడు ఉపయోగించిన నిద్రమాత్రల బ్యాచ్ నెంబర్‌ను తమకు తెలియజేస్తే ఏ షాపులో ఔషధాలు కొనుగోలు చేశాడనేది తేలేతుతుందని చెబుతున్నారు. బ్యాచ్ నంబర్ వివరాలు తెలపాలని పోలీసులను సైతం కోరామని స్పష్టం చేస్తున్నారు. విచారణలో చెప్పలేదా.. పోలీసుల విచారణలో హంతకుడు నిద్రమాత్రలు కొనుగోలు చేసిన ఔషధ దుకాణం పేరు వెల్లడించలేదా అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. హత్య జరిగిన తీరును పోలీసు అధికారులు పూర్తిస్థాయిలో వెల్లడించినా ఔషధ దుకాణాల పేర్లు మాత్రం బహిర్గతం చేయలేదు. దీంతో అసలు మతలబు ఏమిటనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులు ఈ అంశంపై పెదవి విప్పకపోగా.. ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మాత్రం మాత్రల బ్యాచ్ నంబర్ కోసం పోలీసులను అడిగామని చెప్పడం గమనార్హం. చదవండి: 9 హత్యల కేసు: ఫోరెన్సిక్ ల్యాబ్‌కు శాంపిళ్లు డేగకళ్లతో నిఘా గీసుకొండ: గొర్రెకుంట శివారులోని బావిలో తొమ్మిది మందిని, అంతకు ముందు ఓ మహిళను హత్య చేసిన నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ పోలీసు కస్టడీ కొనసాగుతోంది. కేసు విషయంలో మరింత సమాచారాన్ని రాబట్టేందుకు ఆయనను పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఆరు రోజుల కస్టడీ ఈనెల 4వ తేదీతో ముగియనుండగా అదేరోజు కోర్టులో హాజరు పర్చాల్సి ఉంది. ఈమేరకు ఘటనా స్థలమైన బావి, బార్దాన్ గోదాంతో పాటు సంజయ్‌కుమార్ యాదవ్ తిరిగిన వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయనను తీసుకెళ్లి పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఈక్రమంలో ఆయనను అనునిత్యం గమనిస్తూ ఆరుగురు పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే, ఉదయం పూట విచారణకు తీసుకెళ్తే పారిపోయే అవకాశముందని భావిస్తూ కేవలం రాత్రివేళ బందోబస్తు నడుమ విచారణ సాగిస్తున్నట్లు సమాచారం. వారితో ఎలా ఉండేవాడు? హత్యకు గురైన మహ్మద్ మక్సూద్ ఆలం కూతురు బుష్రా ఖాతూన్ మూడేళ్ల కుమారుడు బబ్లూ ఏడుస్తుండగా గొంతు నులిమి హత్య చేసి బావిలో వేసినట్లు తేలిన విషయం విదితమే. ఇదేక్రమంలో గ్రేటర్ పరిధి 4వ డివిజన్ స్తంభంపెల్లి పరిధిలోని ఆదర్శ నగర్లో సంజయ్‌కుమార్ యాదవ్ అద్దెకు ఉన్న ఇంటి వద్ద పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ తరహాలో మంగళవారం విచారణ జరిపినట్లు సమాచారం. మక్సూద్ ఆలం భార్య నిషా అక్క కూతురు రఫీకాతో సహజీవనం చేస్తూ ఆమె కుమార్తె, ఇద్దరు కుమారులతో అద్దె ఇంటిలో నివాసమున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. అయితే, పిల్లలతో ఎలా ఉండేవాడు, రఫీకాను ఎలా తీసుకెళ్లి నిడదవోలు వద్ద రైలు నుంచి కిందికి తోసి హత్య చేశాడనే విషయాలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. విచారణ తర్వాత మంగళవారం రాత్రి సంజయ్‌ను గీసుకొండ పోలీస్ స్టేషన్లోనే ఉంచినట్లు సమాచారం. -
రఫిక భర్తను కూడా ఏమైనా చేసి ఉంటాడా?
సాక్షిప్రతినిధి, వరంగల్ : గీసుకొండ మండలం గొర్రెకుంట బావిలో సామూహిక డెత్ మిస్టరీలో కొత్త కోణాలు, అనుమానాలు బయటకు వస్తున్నాయి. 9 మంది హత్య కేసులో నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ అంతకు ముందు మక్సూద్ భార్య నిషా అక్కకూతురు రఫికను రైలు నుంచి నిడదవోలు వద్ద కిందకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆమెకు కూతురు సిర్దాస్ ఖాతూన్, కుమారులు సుల్తాన్, సాల్మన్ ఉన్నారు. మహ్మద్ మక్సూద్ ఆలం కుటుంబసభ్యులు మృతి చెందడం.. తల్లిని కోల్పోయి అనాథలుగా మారిన రఫిక పిల్లలు ముగ్గురికి దిక్కెవరు? అన్న చర్చ జరుగుతోంది. అయితే రఫిక అలియాస్ చోటీ భర్త ఏమయ్యాడు? అసలు ఆయన ఉన్నాడా? లేడా? ఆయనను కూడా సంజయ్‌కుమార్ యాదవ్ ఏమైనా చేసి ఉంటాడా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. (ఖైదీ నంబర్ 4414) ఢిల్లీలో ఫర్నిచర్ దుకాణంలో పనిచేసినప్పుడు రఫికతో సంజయ్‌కి పరిచయం ఏర్పడిందన్న ప్రచారం బుధవారం నుంచి తెరపైకి వచ్చింది. అక్కడే ఆమెతో సాన్నిహిత్యం పెరగడంతో పిల్లలతో సహా రఫిక వరంగల్‌కు మకాం మార్చిందంటున్నారు. మృతుల్లో ఒకరైన మహ్మద్ మక్సూద్ ఆలం తన కూతురు బుష్రాను సైతం ఢిల్లీలో ఖాతూన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. రఫిక వ్యవహారం ఢిల్లీలో ఉన్నప్పడే తెలియడంతో వరంగల్‌కు వచ్చాక ఆమెను మక్సూద్ పట్టించుకోలేదని సమాచారం. దీంతో స్తంభంపల్లిలో రఫిక హంతకుడు సంజయ్‌మార్ కాపురం పెట్టిందని తెలిసింది. అయితే నిషా ఆలం తన సొంత సోదరి కుమార్తె కావడంతో అప్పుడప్పుడూ వెళ్లి వచ్చేదని, చివరకు రఫికా కనిపించకుండా పోవడాన్ని ఆమె నిలదీయడం వల్లే సంజయ్‌కుమార్ ఈ దురాఘతానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.(హత్య.. ఆపై హత్యలు) సంజయ్‌కుమార్ నేర చరిత్రపై ఆరా.. మక్సూద్ సమీప బంధువు రఫిక అలియాస్ చోటీ కుటుంబంపై కూపీ లాగుతున్న పోలీసులు, నిందితుడు సంజయ్‌కుమార్ యాదవ్ నేరచరిత్రపైనా మళ్లీ ఆరా తీస్తున్నారు. 14 రోజుల రిమాండ్ కోసం మంగళవారం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసింది. నిందితుడి నేరచరిత్రపై రోజుకో రకమైన ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సంజయ్‌కుమార్‌ను మరోసారి విచారించేందుకు కస్టడీ పిటిషన్ కింద అదుపులోకి తీసుకునే యోచన కూడా చేస్తున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా రెండు రోజులుగా రఫిక భర్త ఏమయ్యాడనే కోణాల్లో ఆరా తీస్తున్న పోలీసులు ఆయనను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రఫికా భర్త బతికే ఉన్నాడని, ఢిల్లీలోనే ఉన్నాడని.. అయితే ఆయన మానసిక ప్రవర్తన బాగాలేదన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టత వస్తేనే అందరి అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశం ఉంది.(గొర్రెకుంట.. ఒక్కడే 9 హత్యలు ఎలా చేశాడు?) రఫిక పిల్లలను కలిసి మాట్లాడిన బంధువులు గీసుకొండ(పరకాల) : గొర్రెకుంట ఘటన తర్వాత అనాథలైన రఫిక పిల్లకు గీసుకొండ పోలీసులు రక్షణ కల్పించారు. సిర్దాస్ ఖాతూన్‌ను హన్మకొండ సుబేదారిలోని సఖి సెంటర్లో, ఇద్దరు కుమారులను వరంగల్ నగరం ఆటోనగర్ వద్ద గల జువైనెల్ హోంకు తరలించారు. వారిని కలవడానికి పశ్చిమ బెంగాల్ నుంచి రఫిక తల్లికి అన్న(మేనమామ)తో పాటు మరో ముగ్గురు బంధువులు బుధవారం ఇక్కడికి వచ్చారు. పోలీసులను సంప్రదించడంతో మాట్లాడటానికి అనుమతించారు. మాట్లాడిన తర్వాత ముగ్గురు పిల్లలను తీసుకెళ్లి పోషిస్తామని కోరగా కోర్టు అనుమతి తప్పని సరి అని పేర్కొన్నారు. వారిని పోషించే స్తోమత మీకుందని కోర్టు నమ్మితే అనుమతిస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది. -
గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట ఘటనలో మరో కొత్త కోణం బయటపడింది. ఈ ఘటనలో తవ్వినకొద్దీ నిందితుడు సంజయ్ కుమార్ హత్యా చరిత్రలో ఒక్కో దారుణం వెలుగుచూస్తోంది. తొమ్మిది మందిని హత్యకు ముందే ఓ యువతిని హత్యచేసినట్టు సంజయ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మక్సూద్ బంధువైన యువతి సంజయ్‌కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపింకుండా పోయింది. ఈ తొమ్మిది హత్యల విచారణలో భాగంగానే ఆమెపై కూడా పోలీసులు ఆరా తీయగా.. సంజయ్ మరో నిజం బయటపెట్టాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య) మార్చి 8న ఓ యువతిని నిడదవోలు వద్ద హత్య చేసినట్లు నిందితుడు అతడు అంగీకరించాడు. కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఆ యువతిని రైలు నుంచి తోసేసినట్లు సంజయ్‌కుమార్ ఒప్పుకున్నాడు. పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని హతమార్చాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు. కాగా ఇవాళ (సోమవారం) నిందితుడు సంజయ్‌ను వరంగల్ సీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. (బతికుండగానే బావిలో పడేశారు!) -
చిత్తూరు జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
చిత్తూరు జిల్లాలో పలు దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఉత్తర్‌ప్రదేశ్ వాసిని పోలీసులు పట్టుకున్నారు. డీఎస్పీ రాజేంద్రప్రసాద్ కథనం..ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన సంజయ్‌కుమార్ యాదవ్(27) గత కొంతకాలంగా తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్ద తిప్పసముద్రం మండలాల్లో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతున్నాడు. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. బుధవారం ఉదయం అతడు తంబళ్లపల్లె వద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ2.50 లక్షల విలువైన 97 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, రిమాండ్‌కు తరలించారు.