గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..! | One More Murder By Geesugonda Accused Sanjeev | Sakshi
Sakshi News home page

గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!

Published Mon, May 25 2020 2:41 PM | Last Updated on Mon, May 25 2020 3:01 PM

One More Murder By Geesugonda Accused Sanjeev - Sakshi

సాక్షి, వరంగల్‌ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట ఘటనలో మరో కొత్త కోణం బయటపడింది. ఈ ఘటనలో తవ్వినకొద్దీ నిందితుడు సంజయ్ కుమార్‌ హత్యా చరిత్రలో ఒక్కో దారుణం వెలుగుచూస్తోంది. తొమ్మిది మందిని హత్యకు ముందే ఓ యువతిని హత్యచేసినట్టు సంజయ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మక్సూద్ బంధువైన యువతి సంజయ్​కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపింకుండా పోయింది. ఈ తొమ్మిది హత్యల విచారణలో భాగంగానే ఆమెపై కూడా పోలీసులు ఆరా తీయగా.. సంజయ్‌‌ మరో నిజం బయటపెట్టాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య)

మార్చి 8న ఓ యువతిని నిడదవోలు వద్ద హత్య చేసినట్లు నిందితుడు అతడు అంగీకరించాడు. కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఆ యువతిని రైలు నుంచి తోసేసినట్లు సంజయ్​కుమార్​ ఒప్పుకున్నాడు. పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్​ కుటుంబాన్ని హతమార్చాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు. కాగా ఇవాళ (సోమవారం) నిందితుడు సంజయ్‌ను  వరంగల్‌ సీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. (బతికుండగానే బావిలో పడేశారు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement