Geesugonda
-
ఫ్లెక్సీ వార్.. గీసుకొండ పోలీస్ స్టేషన్ కు కొండా సురేఖ
-
బొడ్రాయి ప్రతిష్టాపన @ 5 కోట్లు!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మచ్చాపూర్ గ్రామంలో నాలుగు రోజులుగా జరిగిన బొడ్రాయి ప్రతిష్టాపన, వనభోజనాల కార్యక్రమంలో ఏకంగా రూ.5 కోట్ల మేర ఖర్చయిందనే విషయం చర్చనీయాంశమైంది. గ్రామ సర్పంచ్ బోడకుంట్ల ప్రకాశ్ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన మాట మేరకు సొంతంగా రూ.15 లక్షలు ఖర్చు చేశారని అంటున్నారు. అలాగే ప్రతీ ఇంటికి కొత్త బట్టలు, పూజ సామగ్రి, యాట పోతుల కొనుగోలు, వంటకాలు, బంధువులకు మర్యాదలు, భోజనాలు, విందు కోసం మందు, ఇలా ప్రతీ ఖర్చును లెక్కలోకి తీసుకుంటే సుమారు రూ. 5 కోట్ల మేర ఖర్చయిందని గ్రామస్తులు చెబుతున్నారు. -
తండ్రి మాట ప్రకారం.. నిమ్మకాయలు, నల్లకోడి కోసి తవ్వకాలు.. పక్కా సమాచారంతో..
సాక్షి, గీసుకొండ(వరంగల్): అరేయ్.. చేనులో చెట్టుకింద గుప్తనిధులు ఉన్నాయి.. తవ్వుకుని తీసుకోండి, నాకేదో గుబులుగా ఉంది.. అంటూ ఓ తండ్రి తరచుగా తన కుమారులకు చెబుతుండేవాడు.. గుప్తనిధి విషయం కలలో వస్తోందని తండ్రి పదే పదే మొత్తుకున్నా వారు ఆసక్తి చూపలేదు. ఇటీవల తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. అతడు చెప్పినట్లు కుమారులు గుప్తనిధుల కోసం చెట్టుకింద తవ్వ కాలు చేపట్టగా.. 30 రాగి నాణేలు బయటకు వచ్చాయని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో యార కొమురయ్య అనే రైతుకు మల్లారెడ్డి, రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డి అనే నలుగురు కుమారులున్నారు. కాగా మల్లారెడ్డికి 1.8 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో తండ్రి మాట ప్రకారం గత నెల 23న తన అన్నదమ్ములు, మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన పంజరబోయిన శ్రీనివాస్, గంగ దేవిపల్లికి చెందిన మేడిద కృష్ణ,నెక్కొండ మండలం అమీన్‌పేటకు చెందిన యాటపూర్ణచందర్ అనే పురోహితుడి సాయంతో నల్లకోడి, నిమ్మకాయలను కోసి పూజలు చేసి ఐదు చోట్ల లోతు గోతిని తవ్వారు. వారి తవ్వకాల్లో 1818నాటి పురాతనమైన 30 రాగి నాణేలు లభ్యం కాగావాటిని మష్ అనే మధ్యవర్తి సహకారంతో హైదరాబాద్‌లో విక్రయించడానికి ప్రయత్నించగా విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం ప్రణాళిక ప్రకారం పట్టుకుని, నలుగురిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి నాలుగు సెల్ఫోఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యార రమణయ్య, కుమారస్వామి, రాజిరెడ్డిలు పరారీలో ఉన్నారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. కాగా, పురాతనమైన రాగినాణేలు లక్ష్మీగణపతి, ఆంజనేయస్వామి, వినాయకుడు, అమ్మవారి రూపంలో ఉన్నాయని పేర్కొన్నారు. అడిషనల్ డీసీపీ ఐపీఎస్ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్‌జీ, సంతోష్, ఎస్సై ప్రేమానందం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కాగా, టాస్క్‌ఫోర్స్ అందింన వివరాల ప్రకారం తవ్వకాల్లో ప్రమేయం ఉన్నవారిపై కేసు నమోదు చేసి నట్లు గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తెలిపారు. చదవండి: Gadwal Bidda: ఇంటర్నెట్ సెన్సేషన్ గద్వాల్ బిడ్డ కన్నుమూత! -
గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట ఘటనలో మరో కొత్త కోణం బయటపడింది. ఈ ఘటనలో తవ్వినకొద్దీ నిందితుడు సంజయ్ కుమార్ హత్యా చరిత్రలో ఒక్కో దారుణం వెలుగుచూస్తోంది. తొమ్మిది మందిని హత్యకు ముందే ఓ యువతిని హత్యచేసినట్టు సంజయ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మక్సూద్ బంధువైన యువతి సంజయ్‌కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపింకుండా పోయింది. ఈ తొమ్మిది హత్యల విచారణలో భాగంగానే ఆమెపై కూడా పోలీసులు ఆరా తీయగా.. సంజయ్ మరో నిజం బయటపెట్టాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య) మార్చి 8న ఓ యువతిని నిడదవోలు వద్ద హత్య చేసినట్లు నిందితుడు అతడు అంగీకరించాడు. కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఆ యువతిని రైలు నుంచి తోసేసినట్లు సంజయ్‌కుమార్ ఒప్పుకున్నాడు. పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని హతమార్చాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు. కాగా ఇవాళ (సోమవారం) నిందితుడు సంజయ్‌ను వరంగల్ సీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. (బతికుండగానే బావిలో పడేశారు!) -
వడ్డీ వ్యాపారాలు చేసుకోండి
టీచర్ల కొట్లాటపై విచారణ పోచమ్మమైదాన్ : ‘వడ్డీ వ్యాపారాలు చేసుకోండి.. పంతులు పని ఎందుకు మీకు? ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు సరిగా పనిచేయరు.. చదువు సరిగా చెప్పరని అంటుంటారు.. ప్లాట్ల బిజినెస్, చిట్టీల వ్యాపారం చేసుకోండి.. ఉద్యోగాల విలువ మీకు తెలియదు. రోడ్ల మీద తిరిగే వాళ్లలా కొట్లాడుకోవడం ఏంటి?’ అంటూ ఆర్జేడీ బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గీసుకొండ మండలం ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీచర్లు మెుగిలయ్య, ప్రేమ్‌నాథ్ బుధవారం ఉదయం ప్రార్థన ముగిసిన తర్వాత చిట్‌ఫండ్ డబ్బుల విషయంలో కొట్టుకున్నారు. మెుగిలయ్య ఓ చిట్‌ఫండ్ లో డబ్బులు తీసుకున్నాడు. దీనికి ప్రేమ్‌నాథ్‌తో పాటు ఇతర ఉపాధ్యాయులు జమానత్‌గా ఉన్నారు. మెుగిల య్య చిట్‌ఫండ్ డబ్బులు చెల్లించకపోవడంతో జమానత్‌గా ఉన్న ప్రేమ్‌నాథ్, ఇతర టీచర్ల వేతనాల్లో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగాయి. బుధవారం కూడా వారి ద్దరు గొడవపడి కొట్టుకున్నారు. పరస్పరం ఒకరిపై మరొకరు పోలీస్‌స్టేçÙన్లో ఫిర్యాదు చేసుకున్నారు. వీరి కొట్లాటపై గురువారం దినపత్రికల్లో కథనం ప్రచురితమైంది. పత్రికల్లో చూసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ వై.బాలయ్య గురువారం డిప్యూటీ డీఈఓ తోట రవీందర్, ఎంఈఓ సృజన్ తేజలతో కలిసి పాఠశాలకు చేరుకొని విచారణ జరిపారు. దాడికి దిగిన ప్రేమ్‌నాథ్‌ను తొలుత, ఆతర్వాత మెుగిలయ్యను విచారించారు. ఉపాధ్యాయుల కొట్లాట సమయంలో పదో తరగతి విద్యార్థులు ఉండగా వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎంసీ బాధ్యులను అడగ్గా ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అటెండెన్స్ రిజిస్టర్లో టీచర్లు ఉమారాణి, రవికుమార్ సంతకాలు చేసి లేకపోవడంతో పాఠశాలకు వచ్చిన వారు ఎందుకు చేయలేదని హెచ్ఎం సుజాతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సంతకాలు పెట్టగానే మెుబైల్ఫోన్లు డిపాజిట్ చేయించుకోవాలని ఆదేశించారు. అటెండెన్స్‌ను జిరాక్స్ తీయించుకున్నారు. విచారణ అనంతరం చర్యల నిమిత్తం డిప్యూటీ డీఈఓ తోట రవీందర్ నివేదికను జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పగించారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి
గీసుకొండ (వరంగల్ జిల్లా) : గీసుకొండ మండలం కొమ్మల గ్రామం వద్ద వరంగల్-నర్సంపేట రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. బైక్‌పై మచ్చాపూర్ గ్రామం నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భాగావత్ శివ(16) అక్కడికక్కడే మృతిచెందగా, భాగావత్ వెంకన్న(15), కొర్ర రాజు(25) లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వెంకన్నను హైదరాబాద్ తరలించారు. రాజుకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.