warnagal
-
వరంగల్ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం
వరంగల్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమించిన అమ్మాయి కుటుంబంపై విచక్షణా రహితంగా తల్వార్‌తో దాడి చేసిన ఘటన వరంగల్ జిల్లా చంద్రరావు పేట మండలం 16 చింతల తండా జరిగింది. ఈ దాడిలో యువతి తల్లి, తండ్రులు మృతి చెందారు. యువతి, ఆమె తమ్ముడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.పోలీసుల కథనం ప్రకారం.. గూడూరు మండలం గుండెంగకి చెందిన మేకల నాగరాజు అలియాస్ బన్నీ 16 చింతల తండా దీపిక ప్రేమించుకున్నారు. అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పా పెట్టకుండా ఇంట్లోనుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన రెండు నెలలకే దీపిక, నాగరాజుల మధ్య మనస్పర్దలు తలెత్తడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు. ఈ క్రమంలో నిందితుడు ముందస్తు కుట్రలో భాగంగా బుధవారం అర్ధరాత్రి 1:35 నిమిషాల సమయంలో తల్వార్‌తో దీపిక ఇంటికి వచ్చాడు. ఇంటి బయట గాడ నిద్రలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డాడు. ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రి బానోతు శ్రీనివాస్ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.నిందితుడు దాడితో తీవ్రగాయాల పాలైన దీపిక, ఆమె తమ్ముడు మదన్‌లు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి అనంతరం నిందితుడు పరారాయ్యాడు.నిందితుడి దాడితో స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు నాగరాజు కోసం బృందాలుగా విడిపోయి పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులతో సీపీ రంగనాథ్ సమావేశం
-
వరంగల్‌లో మెడికల్ కాలేజీని ప్రారంభించనున్న కేసీఆర్
సాక్షి ప్రతినిధి, వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన ఉదయం 11 గంటలకు హనుమకొండ జిల్లా దామెరకు చేరుకోనున్నారు. దామెర క్రాస్ వద్ద నిర్మించిన ప్రతిమ రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీ హాస్పిటల్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను కేసీఆర్ ప్రారంభిస్తారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. వరంగల్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శుక్రవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య, పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషిలతో కలిసి పరిశీలించారు. -
కాబోయే సైనికుడు రాకేష్ అంతిమ యాత్ర
-
వరంగల్ ఓఆర్ఆర్ ల్యాండ్ పూలింగ్ రద్దు
సాక్షి, హైదరాబాద్ /వరంగల్ అర్బన్: వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియలో భాగంగా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ (భూసమీకరణ) పద్ధతిలో భూములను సేకరించాలని తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. 41 కిలోమీటర్ల వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు కోసం వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లోని 28 గ్రామాల రైతుల నుంచి భూములు సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూములు సేకరించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) గతంలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సర్వే పనులను ప్రారంభించింది. అయితే ల్యాండ్ పూలింగ్‌కు భూ యజమానుల సమ్మతి కోసం తెచ్చిన జీఓ 80ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మూడు జిల్లాల పరిధిలో ఐదు నెలలుగా రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. దీంతో ఇటీవల ‘కుడా’ వైస్ చైర్మన్ పి.ప్రావీణ్య భూ సేకరణ నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటిం చారు. అయినప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగించారు. రహదారుల దిగ్బంధనం చేపట్టారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎమ్మెల్యే ఆరూరి రమేష్ హైదరాబాద్‌లో మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ల్యాండ్ పూలింగ్ విధానానికి స్వస్తి పలకాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు అర్వింద్‌కుమార్ సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. -
33 అంతస్తులు, 2000 పడకలు.. త్వరలో వరంగల్‌లో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
సాక్షి ప్రతినిధి, వరంగల్: వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా టి.హరీశ్‌రావు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వరంగల్ పెద్దాసుపత్రి నిర్మాణం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా, అత్యాధునికంగా రూపుదిద్దుకునేలా çసరికొత్త నమూనా, సీఎం కేసీఆర్ బొమ్మ ఉన్న ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. పేదలకు పెద్దరోగమొస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పట్నంబాట పట్టే వరంగల్ ప్రాంతవాసుల కష్టాలకు త్వరలో తెరపడనుంది. 59 ఎకరాల విస్తీర్ణంలో రూ.2,180 కోట్ల వ్యయంతో 33 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏడాదిన్నరలో అందుబాటులోకి రానుంది. వరంగల్‌ను హెల్త్‌హబ్‌గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సీఎం భారీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే విధంగాహెలీ అంబులెన్స్ సేవలు అందుబాటులోకిరానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణానికి వరంగల్ సెంట్రల్ జైలు ఆవరణలో జూన్ 21న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. రెండు వేల పడకలు.. 36 విభాగాలు... రెండువేల పడకల సామర్థ్యంతో తీర్చిదిద్దనున్న ఈ ఆ స్పత్రిలో 36 విభాగాలు పనిచేయనున్నట్లు వైద్య, ఆరో గ్య శాఖ ఉన్నతాధికారులు గతంలోనే వెల్లడించారు. సుమారు 500 మంది వైద్యులు, వెయ్యి మందికిపైగా నర్సులు, పారామెడికల్ సిబ్బందితోపాటు ఇతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తారు. పది సూపర్ స్పెషాలిటీ విభాగాలతో రోగులకు సేవలందించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రైనాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరో సర్జరీతోపాటు, పిడియాట్రిక్ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభా గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. కొత్తది అందుబాటులోకి వస్తే అన్నిరకాల వైద్య సేవలు, శస్త్రచికిత్సలు ఇక్కడే అందుతాయి. పర్యావరణహితంగా నిర్మాణం భారీ నిర్మాణం పూర్తిగా పర్యావరణహితంగా సాగనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే జీవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తారు. పచ్చదనం వెల్లివిరిసేలా భవన నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేయాలని శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు. కెనడా తరహా వైద్య విధానాలు, సౌకర్యాలతో ఆస్పత్రి నిర్మించాలని ఆయన అధికారులకు సూచించగా ఈ మేరకు భవనం మ్యాప్, ప్లాన్‌ను సీఎం దృష్టికి తెచ్చారు. కేసీఆర్ ఆదేశాలతో కెనడా వైద్య విధానాలపై అధ్యయనానికి తెలంగాణ వైద్య నిపుణులు బృందం త్వరలో ఆ దేశానికి వెళ్లనుంది. -
జలదిగ్బంధంలో ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : జలప్రళయం.. ఉమ్మడి వరంగల్ జిల్లాను అతలాకుతలం చేసింది. కాలనీలు, గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. రామప్ప, పాకాల, లక్నవరం సహా చెరువులు, కుంటలు మత్తళ్లు దుముకుతుండగా, జంపన్నవాగు, చలివాగు, మోరంచ, కటాక్షపురం వాగులు ఉగ్రరూపం దాల్చాయి. ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 421 గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మేడారం సమీపంలోని జంపన్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మారుమూల ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. చరిత్రలో మొదటిసారిగా జంపన్నవాగు పొంగిపొర్లిందని చెబుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కుందనపల్లి వద్ద చలివాగు ప్రమాదకర స్థాయికి చేరింది. వరంగల్ రూరల్ జిల్లా నడికుడ వాగులో ఓ ప్రైవేట్ బస్సు కొట్టుకుపోగా.. అందులో ఉన్న వారు సురక్షితంగా బయటపడ్డారు. లక్నవరం సరస్సులోకి భారీగా వరద నీరు చేరుతుండటంతో టూరిజం అధికారులు లక్నవరం, బొగతలకు సందర్శకులను అనుమతించడం లేదు. ఆత్మకూరు మండలం కటాక్షపూర్ చెరువు మత్తడి ఉధృతి పెరగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే.. చెన్నారావుపేట మండలంలో నర్సంపేట ప్రధాన రహదారిపై ఉన్న లోలెవల్ కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తున్నది. దీంతో నర్సంపేట వైపు రాకపోకలు ఆగిపోయాయి. భూపాలపల్లి ఏరియాలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పిత్తి నిలిచిపోయింది. నీట మునిగిన కాలనీలు వరంగల్ మహానగరంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. కాలనీలన్నీ జలమయమయ్యాయి. హన్మకొండ నయీంనగర్ దగ్గర ‘నాలా’పొంగడం.. చింతగట్టు దగ్గర రోడ్డు పైన నీళ్లు వెళ్లడంతో కరీంనగర్ రహదారి వైపు శనివారం రాత్రి వరకు రాకపోకలు నిలిచాయి. ఖిలా వరంగల్ పరిధిలోని ఉర్సు బీఆర్ నగర్ నీట మునిగింది. దాదాపు 500 ఇళ్లలోకి నీరు చేరింది. గిర్మాజీపేట, శివనగర్ అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు ముంచెత్తడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. హన్మకొండలోని అంబేద్కర్ నగర్, కాకతీయ కాలనీ వడ్డెర వీధి ముంపునకు గురయ్యాయి. నగరంలోని ములుగు రోడ్డు వద్ద ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సమ్మయ్యనగర్ పూర్తిగా మునిగిపోవడంతో అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోపాలపురం చెరువు ప్రమాదకరంగా మారింది. పైగా చెరువుకు గండి పడే అవకాశం ఉన్నట్లుగా తెలియడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాజెక్టులకు వరద పోటు భారీ వర్షాలతో ప్రాజెక్టులకు వరద తాకిడి పెరిగింది. కాళేశ్వరం వద్ద శనివారం 10.10 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం ఉంది. దిగువన కన్నెపల్లిలోని లక్ష్మీపంపుహౌస్ వద్ద 7 లక్షల క్యూసెక్కులు తరలిపోతోంది. అలాగే, మహదేవపూర్ మండలం అన్నారంలోని సరస్వతీ బ్యారేజీలో మానేరు నుంచి వరద తాకిడి పెరుగుతుండటంతో 66 గేట్లకు గాను 51గేట్లు ఎత్తారు. మానేరు వాగుతో పాటు ఇతర వాగుల ద్వారా బ్యారేజీకి ఇన్‌ఫ్లో 3.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లు ఎత్తడంతో దిగువకు అవుట్‌ఫ్లో 4 లక్షల క్యూసెక్కుల వరద తరలిపోతుందని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. అలాగే, గోదావరి, ప్రాణహిత నదుల నుంచి భారి ప్రవాహాలు వస్తుండటంతో లక్ష్మీబ్యారేజీలో 85 గేట్లకు గాను 65 గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక! భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శనివారం తెల్లవారుజామున నీటిమట్టం 43 అడుగులకు చేరింది. దీంతో కేంద్ర జల వనరుల శాఖ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాగా, సాయంత్రం 6 గంటలకు 46 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరికకు రెండు అడుగుల దూరంలోనే ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి ఆ నీటిని సైతం గోదావరిలోకే వదులుతుండటంతో నది ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే పాలేరు, వైరా రిజర్వాయర్లు అలుగుపోస్తున్నాయి. కిన్నెరసాని ప్రాజెక్టుకు గరిష్ట స్థాయిలో నీరు చేరడంతో 12 గేట్లు ఎత్తి 86 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో ప్రాజెక్టు పరిధిలోని 22 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 2016 తర్వాత ఒకేసారి 12 గేట్లు ఎత్తడం ఇదే ప్రథమం. ఇక జిల్లావ్యాప్తంగా శనివారం 16.18 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అప్రమత్తంగా ఉండండి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మంత్రులతో మాట్లాడారు. జిల్లాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రులు తమ జిల్లాల్లోనే ఉండాలని, కలెక్టర్, పోలీస్ అధికారులతో కలసి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. చాలా చెరువులు పూర్తి స్థాయిలో నిండాయని ఫలితంగా కొన్ని చోట్ల చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని, అలాగే వరదల వల్ల రోడ్లు తెగిపోయే ప్రమాదం ఉందని, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే పరిస్థితి ఉత్పన్నం కావచ్చని సీఎం చెప్పారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ రెండు జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు వీటిని వినియోగించనున్నారు. -
గొర్రెకుంట : 9 కాదు 10 హత్యలు..!
సాక్షి, వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన గీసుకొండ మండలం గొర్రెకుంట ఘటనలో మరో కొత్త కోణం బయటపడింది. ఈ ఘటనలో తవ్వినకొద్దీ నిందితుడు సంజయ్ కుమార్ హత్యా చరిత్రలో ఒక్కో దారుణం వెలుగుచూస్తోంది. తొమ్మిది మందిని హత్యకు ముందే ఓ యువతిని హత్యచేసినట్టు సంజయ్ పోలీసుల విచారణలో వెల్లడించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మక్సూద్ బంధువైన యువతి సంజయ్‌కి సన్నిహితంగా ఉండేది. కొన్నాళ్లుగా ఆమె కనిపింకుండా పోయింది. ఈ తొమ్మిది హత్యల విచారణలో భాగంగానే ఆమెపై కూడా పోలీసులు ఆరా తీయగా.. సంజయ్ మరో నిజం బయటపెట్టాడు. (వీడిన మిస్టరీ : 9 మంది దారుణ హత్య) మార్చి 8న ఓ యువతిని నిడదవోలు వద్ద హత్య చేసినట్లు నిందితుడు అతడు అంగీకరించాడు. కోల్‌కతా తీసుకెళ్తున్నానని చెప్పి ఆ యువతిని రైలు నుంచి తోసేసినట్లు సంజయ్‌కుమార్ ఒప్పుకున్నాడు. పోలీసులకు చెబుతారనే భయంతో మక్సూద్ కుటుంబాన్ని హతమార్చాడు. ఇలా మొత్తం 10 మందిని హత్య చేశాడు. కాగా ఇవాళ (సోమవారం) నిందితుడు సంజయ్‌ను వరంగల్ సీపీ సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. (బతికుండగానే బావిలో పడేశారు!) -
కొత్తగా..వింతగా ఎన్నికల ప్రచారం..!
సాక్షి, వరంగల్ రూరల్: ఒకరు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో పూరీలు చేస్తే... మరొకరు కూరగాయల దుకాణంలో కూరగాయలు అమ్ముతున్నారు..ఇంకొకరు టీకొట్టులో టీ పోస్తున్నారు..ఇలా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు లోకసభ సభ్యుడిగా పోటీ చేసే ఆయా పార్టీల అభ్యర్థులు వింత ప్రచారంలో పోటీ పడుతున్నారు. జనాల మెప్పు, మార్కుల కోసం నాయకులు పడే పాటు అన్నీ..ఇన్నీ కావు. కళాకారుల నృత్య ప్రదర్శనలు డప్పు వాయిధ్యాల నడుము వినూత్నంగా అలంకరించిన వాహనాలతో ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచార కోలాహలం కొనసాగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ ఎన్నికల వేళ అభ్యర్థులు ఓట్ల వేటలో తీవ్రంగా శ్రమిస్తూ ప్రచార రంగాల్లో వింత పదనిసలు పలికిస్తున్నారు. వ్యాయామ ప్రచారాలు.. చాలా మంది ఉదయపు నడక ఆరోగ్యకరమని వాకింగ్ చేస్తుంటారు. కొందరు లేవగానే వ్యాయా మం చేస్తుంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు వాకింగ్ చేసే ప్రదేశాల్లోనూ ప్రచార బాటలు వేస్తున్నారు. సామాన్య ప్రజలతో మమేకమై వ్యాయామాలు, యోగా చేస్తున్నారు. క్రీడా మైదానాల్లోకి చేరి ఓ అభ్యర్థి వారితో కలిసి షటిల్ ఆడి తమ ప్రచారాన్ని సాగిస్తున్నారు. అయ్యా.. నీ ఓటు నాకే... ప్రతి ఓటరును కలిసేప్పుడు ఆ ఓటు తమకే పడుతోందని అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇళ్ల ముందరకు వెళ్లి అయ్యా.. అమ్మా.. అక్కా.. చెల్లి.. అంటూ అందరినీ అప్యాయంగా పలకరిస్తున్నారు. ఇటీవల వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్లో రైతు కాళ్లు పట్టుకుని ఓటు వేసి గెలిపించాలని ఓ అభ్యర్థి కోరారు. ఇలా ప్రజల నుంచి ఓట్లను పొందేందుకు అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. కూరగాయలు అమ్ముతూ.. కూరగాయలు అమ్మే దుకాణం దగ్గరికి వెళ్లి అభ్యర్థులు విక్రయాలు చేస్తున్నారు. హోటల్లో పూరీలు చేస్తూ మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇలా జిల్లాలో ప్రచారంలో భాగంగా తిరుగుతున్న నాయకులు ఆయా పనుల్లో నిమగ్నమై వారి వద్దకు వెళ్లి ఓట్లను అడుగుతున్నారు. పేరంటాల్లో.. ఓట్ల గలగల సాధారణ వేళల్లో ఎంత ఖాళీగా ఉన్నా.. పెళ్లిళ్లు, పేరింటాలకు వెళ్లని నాయకులు, ఎన్నికల సమయంలో ఏ చిన్న శుభకార్యం జరిగినా చెప్పిందే ఆలస్యం, తప్పక హాజరవుతున్నారు. ఎక్కువ మంది ప్రజలు వచ్చే వీలున్న పేరింటాలకైతే ముందుగానే చేరుకుంటున్నారు. తదనుగుణంగా ఓట్లు గలగల రాలుతాయనే వ్యూహంగా ముందుకు సాగుతున్నారు. ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా ప్రజల నాడి అంతు చిక్కాలంటే ఎన్నికలయ్యే వరకు ఆగాల్సిందే. -
గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
సాక్షి, నర్మెట: గుర్తుతెలియని ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలం లోని లోక్యాతం డా శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకోగా వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతదేహం వేలాడుతూ కనిపించింది. స్థానికులను విచారించగా వ్యక్తి వివరాలు తెలియరాలేదని ఎస్సై జక్కుల పరమేశ్వర్ తెలిపారు.మృతుడు ఎర్రని చారల చొక్కా, చెవి పోగుతో గుండు చేయించుకున్న చామనచాయ రం గు కలిగి సుమారు 40 ఏండ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. స్థలంలో తెల్లని ప్లాస్టిక్ సంచి, టార్చిలైటు, నల్లని ప్యారాగాన్ చెప్పులు, దు ప్పటి, బొంతలు లభించాయని తెలి పారు. ఈ వివరాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నుట్ల ఎస్సై పరమేశ్వర్ తెలిపారు. -
వరంగల్ అర్బన్ జిల్లాలో దారుణం
వరంగల్ అర్బన్: వరంగల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కట్టుకున్న భార్యతో పాటు కన్నబిడ్డలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ సంఘటన జిల్లాలోని తిమ్మాపురంలో సోమవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన భార్య భవానితో పాటు కూతుళ్లు వర్షిణి, అమృతల పై కిరోసిన్ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో భార్య భవాని, కూతురు వర్షిణి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో కూతురు అమృతకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుడుంబా స్థావరాలపై ఆకస్మిక దాడులు
కేససముద్రం: వరంగల్ జిల్లా కేససముద్రం మండలం గిర్నితండాలో బుధవారం గుడుంబా స్థావరాలపై దాడులు జరిగాయి. వరంగల్ ఎన్ఫోర్స్మెంట్, గూడూరు ఎక్సైజ్ అధికారులు కలిసి ఒక్కసారిగా దాడులు నిర్వహించి 1500 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. గుడుంబా తయారీకి వాడే కుండలను, డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పార్క్ చేసి ఉన్న బైక్సే టార్గెట్
-16 ద్విచక్రవాహనాలు స్వాధీనం వరంగల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన విజయ్ చదువు మానేసి చోరీల బాట పట్టాడు. పార్క్ చేసి ఉన్న బైక్‌లను టార్గేట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు విజయ్ను శనివారం అరెస్ట్ చేశారు.