స్వయం పాలనలో సమస్యలు పరిష్కారం
Published Sat, Jul 16 2016 6:42 PM | Last Updated on Fri, Aug 17 2018 5:24 PM
మార్కెట్ కమిటీ ఉద్యోగ నేతలు నర్సింహారెడ్డి, ముఖరం
ఖమ్మం వ్యవసాయం : తెలంగాణ ఏర్పడి స్వయంపాలన వచ్చిన తర్వాత సమస్యలను దశలవారీగా పరిష్కారమవుతాయని రాష్ట్ర మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం అధ్యక్ష, కార్యదర్శులు చిలక నర్సింహారెడ్డి, ఎండీ ముఖరం అన్నారు. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వచ్చిన వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మార్కెటింగ్ శాఖలో పనిచేసే 234 మంది ఉద్యోగులకు మంత్రి తన్నీరు హరీష్‌రావు, కమిషనర్ డాక్టర్ శరత్ కృషి ఫలితంగా పదోన్నతులు లభించాయన్నారు. 649 ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు కృషి జరుగుతోందని తెలిపారు. అయితే ఈ శాఖలో మొత్తం 2 వేల పోస్టులకు గాను వెయ్యి ఖాళీలున్నాయని చెప్పారు. 20 ఏళ్లకు పైగా సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారని, సెక్యూరిటీ ఏజెన్సీలు మారినంత మాత్రాన ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. హరితహారం కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలో ముందంజలో ఉందని, మార్కెట్ యార్డుల్లో, గోదాముల వద్ద, మార్కెట్ స్థలాల్లో, కార్యాలయాల వద్ద ఇప్పటికే 8 లక్షల మొక్కలు నాటామన్నారు.
Advertisement
Advertisement