ఊపందుకున్న వ్యవసాయ పనులు
– జిల్లాలో తేలికపాటి వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు ఊపందుకుంటున్నాయి. అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో భూములను ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధం చేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. మూడు రోజుల కిత్రం ఆదోని, హొళగొంద, హాలహర్వి, పెద్దకడుబూరు తదితర మండలాల్లో వర్షాలు పడటం వల్ల వల్ల వేసవి దుక్కులు ప్రారంభించారు. తాజాగా గోనెగండ్ల, వెల్దుర్తి, గూడూరు మండలాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. గొనెగండ్లలో 26.4 మిమీ, వెల్దుర్తిలో 21.2, గూడూరులో 14.0, సి.బెలగల్‌లో 10.0మిమీ, క్రిష్ణగిరిలో 10.0 మి.మీ వర్షఽం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉండటంతో ఖరీప్ విత్తనం పనులు కూడా ముందస్తుగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మేలో సాధారణ వర్షపాతం 38.5 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 17.1 మి.మీ., నమోదైంది.