శ్రీశైలంలో సారా, మద్యం పట్టివేత
శ్రీశైలంలో సారా, మద్యం పట్టివేత
Published Tue, Dec 13 2016 10:41 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానం పరిధిలో మంగళవారం మద్యం బాటిళ్లు, నాటు సారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు వివరాలను సీఐ విజయకృష్ణ విలేకరులకు వివరించారు. క్షేత్ర పవిత్రతను కాపాడే చర్యల్లో భాగంగా వన్‌టౌన్ పోలీసులు ఎస్‌ఐ వర ప్రసాద్ ఆధ్వర్యంలో అనుమానాస్పద వ్యక్తులను విచారిస్తున్నారు. ఈ క్రమంలో మేకలబండ వద్ద సారా విక్రయిస్తున్నభీమేష్ గౌడ్‌ను అదుపులోకి తీసుకుని, 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సాక్షిగణపతి వద్ద మద్యం విక్రయిస్తున్న చిరంజీవిని అదుపులోకి తీసుకుని 62 ఛీప్ లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. శ్రీశైలక్షేత్రంలో సిగరెట్లు, గుట్కాలు, మద్యం, మాంసం, గుడ్లు విక్రయాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement