అందరికన్నూ జోగుళాంబ ఆలయం పైనే!
Published Thu, Sep 1 2016 1:27 AM | Last Updated on Mon, Sep 4 2017 11:44 AM
l దేవస్థాన కమిటీ చైర్మన్ పదవి కోసం
పోటాపోటీ
lపైరవీలలో చోటామోటా నాయకులు
అలంపూర్‌రూరల్ : జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయంపై రాజకీయ నాయకుల కళ్లు పడ్డాయి. దేవదాయ శాఖ నుంచి ట్రస్టుబోర్డు కోసం నోటిఫికేషన్ విడుదల కావడంతో చోటామోట రాజకీయ నాయకులు అప్పుడే పైరవీలు ప్రారంభించారు. వీరితోపాటు వివిధ కుల, ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థల వారు కూడా ఈపనిలోనే ఉన్నారు. ఒకరికి తెలియకుండా మరొకరు దరఖాస్తులు తీసుకెళ్తూ పలుకుబడి గల అధికార పార్టీ నాయకులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైరవీలో భక్తిపరులు కొందరు ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా గతంలో నేరచరిత్ర కలిగిన వారు, ఆలయంలో పనిచేసే సిబ్బంది బంధువులు కూడా పైరవీలు చేస్తున్నారు.
ఇదీ ప్రకటన
జీ.ఓ.ఆర్.టీ నం34రి/రెవెన్యు(ఎండోమెంట్స్) శాఖ 6–08–2016 ప్రకారం 30/2007 దేవాదాయ శాఖ చట్టం ప్రకారం తెలంగాణ ఆర్డినెన్స్ నం.3/2016ను అనసరిస్తూ సెక్షన్15, ఉపసెక్షన్ 1కి లోబడి వంశ పారంపర్యం కానీ ధర్మకర్తల మండలికి నోటిఫికేషన్‌ను వెలువరించింది. నోటీస్ బోర్డు తేదీ నుంచి 20రోజులలోపుగా దరఖాస్తు చేసుకోవాలని గడువు ప్రకటించింది.
రాజకీయ నిరుద్యోగులకు వరం
రాజకీయాలలో ఉంటూ నేటì వరకు ఎలాంటి పదవి లభించకపోవడంతో ఎంతోమంది రాజకీయ నాయకులు ధర్మకర్తల మండలికి పోటీ పడుతున్నారు. రిటైర్డ్ అయిన మరికొంత మంది కూడా ఇటీవల అలంపూర్‌లో నివాసం ఉంటూ అటుప్రజలు, ఇటు అధికారులు, మరోవైపు రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా కొందరు మందా జగన్నథంను, మరికొందరు ఎంపీ జితేందర్‌రెడ్డిని, అలాగే నిరంజన్‌రెడ్డిని, పలువురు జూపల్లి, శాసనసభా స్పీకర్, దేవాదాయ శాఖ మంత్రిని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తంగా ఈ పదవి ఎవరిని వరిస్తుందో వేచిచూడాలి మరి.
Advertisement
Advertisement