
బాణసంచా దుకాణాలకు 37 దరఖాస్తులు
దీపావళి సందర్భంగా శ్రీకాకుళం నరగరం, డివిజన్‌లోని ఇతర మండలల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు తెలిపారు. గతంలో దుకాణాల అనుమతులను కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చేవి.
శ్రీకాకుళం పాతబస్టాండ్: దీపావళి సందర్భంగా శ్రీకాకుళం నరగరం, డివిజన్‌లోని ఇతర మండలల్లో బాణసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటి వరకు 37 దరఖాస్తులు వచ్చాయని రెవెన్యూ వర్గాలు తెలిపారు. గతంలో దుకాణాల అనుమతులను కలెక్టర్ కార్యాలయం నుంచి వచ్చేవి.
గత ఏడాది నుంచి రెవెన్యూ డివిజినల్ అధికారులకు దుకాణాల కేటాయింపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం పట్టణంలో 30, నరసన్నపేటలో 4, ఆమదాలవలసలో 2, సరుబుజ్జిలి నుంచి ఒక దరఖాస్తు వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. ఈ దరఖాస్తులకు సంబంధించి విపత్తుల శాఖ, పోలీసు, రెవెన్యూ, నగర పాలక సంస్థ, మండల పరిషత్, స్థానిక సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు ఇంకా గడువు ఉంది.