అనంతపురం న్యూసిటీ : నగర మేయర్ మదమంచి స్వరూపపై ప్రచురించిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారంలో న గరపాలక సంస్థలోని కొందరు కార్పొరేటర్లకు రెండు పేజీల కరపత్రాలను కాంట్రాక్టర్ల పేరిట పంపారు. అందులో పేర్కొన్న ఆరోపణలిలా ఉన్నాయి. డీజిల్ బిల్లులు నొక్కేశారని, ప్లాస్టిక్ కవర్ల పేరుత వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేశారని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు మేయర్ భర్త వెంకటేష్‌చౌదరికి పది శాతం మామూలు చెల్లించాలి. లేదంటే ఆ పని రద్దువుతుంది.
కంచే చేను మేసినట్టు మేయర్ కుటుంబానికి కమిషనర్, కొంత మంది అధికారులు తోడై నగరపాలక సంస్థను దివాలా తీయించారని ఆరోపిచారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ మేయర్ బావ రాజశేఖర్‌నాయుడు కనుసన్నల్లో నడుస్తోంది. అడ్డగోలుగా అపార్టుమెంట్లు, ఇళ్లకు అప్రూవల్ ఇప్పించి రూ కోట్లు దండుకున్నారని పేర్కొన్నారు. మేయర్ కుటుంబ రెండేళ్లలో రూ.10 కోట్లు అక్రమంగా సంపాదించారని, పురపాలక సంఘంలో అవినీతిపై విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆ కరపత్రాల్లో వారు కలెక్టర్‌కు విన్నవించారు.
మేయర్‌పై అవినీతి ఆరోపణలు
Published Fri, Oct 28 2016 11:29 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement