swarupa
-
రెండో భార్య మోజులో పడి.. మొదటి భార్యను పొలం దగ్గరకి తీసుకెళ్లి..
మెదక్: రెండో భార్య మోజులో పడి మొదటి భార్యకు బలవంతంగా పురుగు మందు తాగించాడు. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఆమె ఐదురోజుల పాటు ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ బుధవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి కథనం ప్రకారం.. మెదక్ మండలం తిమ్మక్కపల్లి తండాకు చెందిన కాట్రోత్ రమేశ్‌కు కౌడిపల్లి మండలం మహబూబ్‌నగర్ తండాకు చెందిన స్వరూపను (30) పదేళ్ల కిత్రం ఇచ్చి వివాహం చేశారు. వారికి ఒక బాబు జన్మించాడు. కాగా రమేశ్ ఇటీవల తిమ్మక్కపల్లి తండాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్య స్వరూపకు, రమేశ్‌కు తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఎలాగైనా మొదటి భార్యను చంపాలని పన్నాగం పన్నాడు. ఈనెల 6వ తేదీన సాయంత్రం పొలం వద్దకు వెళ్లి వద్దామని తీసుకెళ్లాడు. పథకం ప్రకారం ముందే పురుగు మందు డబ్బా తీసుకొచ్చి బలవంతంగా స్వరూపకు తాగించాడు. అపస్మారక స్థితికి చేరుకోగానే ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి పురుగు మందు తాగిందని చెప్పాడు. అనంతరం ఆమెను మెదక్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. రెండో భార్య మంజుల, అల్లుడు రమేశ్ వేధింపులకు గురి చేసి తన కూతురును పొట్టనపెట్టుకున్నారని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపించారు. గురువారం సాయంత్రం ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పెద్దల ముందే నరికి చంపాడు..
ఎల్కతుర్తి: తోడబుట్టిన అన్న ఇటీవలే రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, ఆస్తిని వదిన తీసుకుంటే తనకు ఏమీ దక్కదని కక్ష పెంచుకున్న మరిది.. పంచాయితీ పెద్దమనుషుల సమక్షంలోనే ఆమెపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం ప్రకారం.. ముల్కనూర్‌కు చెందిన పురాణం స్వరూప (35) భర్త జంపయ్య గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆస్తి విషయంలో భర్త తమ్ముడు సమ్మయ్యతో గొడువలు జరుగుతున్నాయి. ఆస్తిలో వాటాల విషయమై మాట్లాడటానికి స్వరూప తన తమ్ముడు మౌటం గురువయ్య, అతడి భార్య తిరుపతమ్మతో కలసి ఆదివారం పెద్దమనుషుల సమక్షంలో కూర్చుని మరిది సమ్మయ్యను పిలిపించింది. ఇరుపక్షాల మధ్య చర్చలు జరుగుతుండగానే సమ్మయ్య వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో వదిన స్వరూపపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పెద్దమనుషులు ఆపే ప్రయత్నంచేసినా వినకుండా స్వరూప మెడ, ఇతర శరీర భాగాలపై నరకడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో అక్కడున్నవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
మేయర్‌పై అవినీతి ఆరోపణలు
అనంతపురం న్యూసిటీ : నగర మేయర్ మదమంచి స్వరూపపై ప్రచురించిన కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారంలో న గరపాలక సంస్థలోని కొందరు కార్పొరేటర్లకు రెండు పేజీల కరపత్రాలను కాంట్రాక్టర్ల పేరిట పంపారు. అందులో పేర్కొన్న ఆరోపణలిలా ఉన్నాయి. డీజిల్ బిల్లులు నొక్కేశారని, ప్లాస్టిక్ కవర్ల పేరుత వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేశారని పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపునకు మేయర్ భర్త వెంకటేష్చౌదరికి పది శాతం మామూలు చెల్లించాలి. లేదంటే ఆ పని రద్దువుతుంది. కంచే చేను మేసినట్టు మేయర్ కుటుంబానికి కమిషనర్, కొంత మంది అధికారులు తోడై నగరపాలక సంస్థను దివాలా తీయించారని ఆరోపిచారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్ మేయర్ బావ రాజశేఖర్‌నాయుడు కనుసన్నల్లో నడుస్తోంది. అడ్డగోలుగా అపార్టుమెంట్లు, ఇళ్లకు అప్రూవల్ ఇప్పించి రూ కోట్లు దండుకున్నారని పేర్కొన్నారు. మేయర్ కుటుంబ రెండేళ్లలో రూ.10 కోట్లు అక్రమంగా సంపాదించారని, పురపాలక సంఘంలో అవినీతిపై విచారణ జరిపించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆ కరపత్రాల్లో వారు కలెక్టర్‌కు విన్నవించారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
అప్పుల బాధ తాళలేక వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఇద్దరు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ జిల్లా శాయంపేట గ్రామానికి చెందిన చౌడరపు సుమన్(29) రెండేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి సరిగా రాలేదు. ఇటీవల ఓ వివాహానికి వెళ్లగా అక్కడ అర తులం బంగారు ఉంగరం పోగొట్టుకున్నాడు. మనస్తాపానికి గురైన సుమన్ శుక్రవారం బాత్రూంలో పురుగుల మందు తాగాడు.ఎంతకూ బయటకు రాకపోవడంతో భార్య అనూష తలుపు తీసి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. పరకాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సుమన్‌కు ఏడాదిన్నర క్రితమే వివాహమైంది. కరీంనగర్ జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన మహిళా రైతు చల్లా స్వరూప(38) భర్త శ్రీనివాస్‌తో కలసి తమ ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. దిగుబడి లేక చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోయారు. ఇదే క్రమంలో గురువారం తమ పత్తి చేనులో కలుపు తీస్తుండగా మేడిగడ్డ బ్యారేజీ సర్వే అధికారులు వచ్చి మీ భూమి మొత్తం పోతుందని తెలిపారు. ఇప్పటికే రూ. 5 లక్షల అప్పు ఉన్నామని, భూమి కూడా పోతే ఎలా బతకాలని మనస్తాపం చెందిన స్వరూప ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి పురుగుల మందు తాగింది. కుమార్తె మానస వికలాంగురాలు కావడంతో ఆమెపై మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు. -
మహిళా రైతు ఆత్మహత్య
మహదేవ్పూర్ : కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలం సూరారంలో చల్లా స్వరూప(38) అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గత ఏడాది పత్తి పంటతో రూ.3 లక్షలు నష్టం వచ్చింది. అదే విధంగా మేడిగడ్డ బ్యారేజీ కింద భూమిని కోల్పోనుండటంతో నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వరూప ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వైన్‌ప్లూతో మహిళ మృతి
రఘునాథపల్లి(వరంగల్ జిల్లా): రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మృతిచెందింది. గ్రామానికి చెందిన ఉప్పోజు స్వరూప (42) స్వైన్‌ప్లూ బారిన పడి ఈ నెల 5న అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది. స్వరూపకు స్వైన్‌ప్లూ సోకినట్లు నిర్దారణ కాగానే డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు గ్రామంలో వారం రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. స్వరూప గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. చికిత్సకు డబ్బులు లేవని వైద్యాధికారుల చుట్టు తిరిగినా ఎవరూ కనికరించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు. -
ఎన్నాళ్లిలా?
అనంతపురం కార్పొరేషన్ : సుదీర్ఘ కాలం అధికారుల పాలన తర్వాత నగర పాలక సంస్థకు కొత్త పాలక వర్గం ఏర్పడటంతో ఇక మంచి రోజులొచ్చాయని సంబరపడిన ప్రజలకు నిరాశే ఎదురరుు్యంది. పాలకవర్గం ఏర్పడి ఐదు నెలలు దాటినా పాలనపై మేయర్ మదమంచి స్వరూప పట్టు సాధించలేక సతమతమవుతున్నారు. దీంతో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నగరంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పని ఒక్కటి కూడా జరగడం లేదు. అత్యంత కీలకమైన టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురువుతున్నారు. పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. సమస్యలతో ప్రజలు సతమవుతున్నారు. ఐదునెలలుగా మేయర్ నగరంలో పర్యటిస్తున్నా పారిశుద్ధ్యం కనీస స్థాయిలో కూడా మెరుగు పడలేదు. మేయర్‌గా స్వరూప బాధ్యతలు చేపట్టిన ఐదు నెలలు గడిచింది. పాలనా వ్యవహారాలపై అవగాహన వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. వేరొకరు వెనకుండి నడిపించినట్లుగా పాలన సాగిస్తున్నారు. ఆమె ఆదేశాలు ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదంటే పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. వర్గ పోరు షురూ పాలకవర్గంలో వర్గ రాజకీయం ఆది నుంచి కొనసాగుతోంది. మేయర్‌ది ఒక వర్గం, డిప్యూటీ మేయర్‌ది మరో వర్గం. ఇరు వర్గాల మధ్య విభేదాలు ఏ స్థారుులో ఉన్నాయో ఇటీవల జరిగిన కౌన్సిల్ సమావేశం అద్దం పట్టింది. అధికార పార్టీ సభ్యుల మధ్య విబేధాలు చోటు చేసుకున్నాయి. ఒక వర్గం సభ్యుడు చేసిన ప్రతిపాదనను మరోవర్గం సభ్యులు విబేధించడం కనిపించింది. ఇలాంటి పరిస్థితి నిత్యం కార్యాలయంలో ప్రతి విషయంలోనూ కనిపిస్తోంది. నగర పాలనలో స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి జోక్యాన్ని అడ్డుకోవడానికే మేయర్ వర్గానికి సమయం సరిపోనట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కార్పొరేటర్లకు లబ్ధి చేకూర్చే దిశగా అన్నట్లు.. డివిజన్‌కు రూ.5 లక్షలతో అభివృద్ధి పనులు మొదలు పెట్టారు. ఇప్పుడు మరో రూ.10 లక్షలు కేటారుుంచేందుకు సిద్ధమవుతున్నారు తప్పించి ప్రణాళికా బద్ధంగా వెళుతున్న దాఖలాలు కనిపించడం లేదు. నగరంలో ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలు దర్శనమిస్తాయి. వాటిలో పందులు చేరి మరింత అధ్వానంగా మారుస్తుంటాయి. వంకలు, కాలువల్లో మురుగు పేరుకుపోయింది. కాలనీల్లో కాలువ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంటుంది. నగర ప్రజలను కుక్కలు, కొతులు, పందుల బెడద వేధిస్తోంది. ఈ సమస్యలు పరిష్కరించే విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం లేదనే అపవాదును సైతం మూటగట్టుకున్నారు. సంస్థలో అత్యంత కీలకమైన విభాగాల్లో టౌన్ ప్లానింగ్ ఒకటి. ఇక్కడ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు మాత్రమే ఉన్నారు. టీపీఓ, రెండు టీపీఎస్‌లు పోస్టులు, రెండు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కార్యకలాపాలు సక్రమంగా జరగాలంటే పూర్తి స్థాయిలో సిబ్బంది అవసరమని తెలిసినా ఈ అంశంపై మేయర్ ఇప్పటి వరకు దృష్టి సారించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. మేయర్ పనితీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వెనుక షాడో మేయర్లుగా ఇద్దరు పాలన సాగిస్తునట్లు విమర్శలు బహిరంగంగా వినవస్తున్నాయి. ఏ పనైనా వారిని కలిస్తే అయిపోతుందనే ప్రచారం జోరందుకుంది. -
రూ.పది ఇవ్వలేదని భార్య ప్రాణం తీశాడు...
నర్సంపేట: మద్యానికి బానిసైన ఓ వ్యక్తి 10 రూపాయుల కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వరంగల్ జిల్లా నర్సంపేట వుండలం లక్నెపల్లి గ్రామానికి చెందిన తుప్పతుర్తి బుచ్చయ్య మద్యానికి బానిసయ్యాడు. అనారోగ్యంతో ఆస్పత్రి పాలై సోమవారమే ఇంటికి వచ్చాడు. మంగళవారం ఉదయం స్వరూప(40)ను మద్యానికి రూ.10 ఇవ్వాలని కోరాడు. లేవని చెప్పటంతో ఆగ్రహంతో గొడ్డలితో మెడపై నరకగా ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
అనుమానమే నిజమైంది..
స్వరూపది హత్యే భర్త దెబ్బలకేmమృతిచెందినట్లు నివేదిక భర్త, బావ రిమాండ్ పరారీలో అత్తమామ జమ్మికుంట: జమ్మికుంట మండ లం కొత్తపల్లికి చెందిన ఎనమనగండ్ల స్వరూప(25) మృతి కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అందరి అనుమానమే నిజమైంది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భర్త కొట్టిన దెబ్బలకే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. స్వరూప భర్త సాగర్, బావ రమేశ్‌ను అరెస్టు చేశారు. అత్తమామలు సమ్మక్క, అయిలయ్య పరారీలో ఉన్నారు. వివరాలు సీఐ బాలస్వామి కథనం ప్రకారం.. కొత్తపల్లికి చెందిన సాగర్‌తో వరంగల్ జిల్లా దూంపళ్లగూడెం పరిధిలోని ఎల్బీనగర్కు చెందిన స్వరూప వివాహం తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి వివేక్(6), శ్రీవర్షిని(3) సంతానం. అదనపు కట్నం కోసం రెండేళ్లుగా స్వరూపను భర్త వేదింపులకు గురిచేశాడు. గత నెల 30 ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యను చితకబాదాడు. ఈక్రమంలో ఆమె తలను గోడకేసి బాదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త సాగర్, అత్తమామలు, బావ కలిసి స్వరూప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చేపట్టిన విచారణలో వాస్తవాలు తెలిశాయి. సంఘటన దాచిపెట్టే ప్రయత్నం చేసిన సాగర్ తల్లిదండ్రులతోపాటు అన్న రమేశ్‌పై కేసు నమోదు చేశారు. సాగర్, రమేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. మృతురాలి అత్తమాలు సమ్మక్క,అయిలయ్య పరారీలో ఉన్నారు. -
విద్యార్థుల స్కాలర్షిప్లు స్వాహా
చిన్నమంగళారం(మొయినాబాద్), న్యూస్‌లైన్ : మహిళా గ్రూపుల్లో సభ్యులుగా ఉండి అభయహస్తం, ఆమ్ఆద్మీ పథకాల్లో భాగస్వాములైన వారి పిల్లలకు అందివ్వాల్సిన స్కాలర్షిప్లను వీఓ(విలేజ్ ఆర్గనైజర్)లు స్వాహా చేశారు. ఒకరివి కాదు.. ఇద్దరివి కాదు... ఏకంగా 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వకుండా తమ సొంత అవసరాలకు వాడేసుకున్నారు. వాటితోపాటు అభయహస్తం ద్వారా 24 నెలలుగా ఇద్దరు వృద్ధురాళ్లకు పింఛన్లు సైతం ఇవ్వడంలేదు. డబ్బులు స్వాహా చేసి సంవత్సరం దాటినా ఇప్పటివరకు విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు సామాజిక తనిఖీల్లో వారి బండారం బయటపడింది. 39మంది విద్యార్థులకు సంబంధించి రూ.46,800లు వారు స్వాహా చేసినట్లు తేలింది. ఈ ఉదంతం మండల పరిధిలోని చిన్నమంగళారంలో జరిగింది. చిన్నమంగళారం గ్రామంలో 48 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో అభయహస్తం, ఆమ్ ఆద్మీ పథకాల్లో ఉన్న సభ్యుల పిల్లలకు( 9, 10, ఇంటర్ చదువుతున్నవారికి) ప్రతి సంవత్సరం రూ.1200 చొప్పున స్కాలర్షిప్ వస్తుంది. 2011 - 12 విద్యా సంవత్సరానికిగాను 101 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరయ్యాయి. చిన్నమంగళారం వీఓలుగా ఉన్న స్వరూప, యూసుబ్బీలు విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేసేవారు. అయితే గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వకుండా డబ్బులను వీఓలు దిగమింగినట్లు సామాజిక తనిఖీ బృందం తేల్చింది. కాగా, పింఛన్లకు సంబంధించిన డబ్బులు ఎవరు స్వాహా చేశారనే విషయం మాత్రం తేలాల్సి ఉంది. సామాజిక తనిఖీతో వెలుగులోకి... చిన్నమంగళారంలో స్వయం సహాయక సంఘాల ద్వారా అందించే స్కాలర్షిప్లు, బీమా, పింఛన్లపై ఈ నెల 10 నుంచి 12 వరకు సామాజిక తనిఖీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రామంలో 39మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్లు అందనట్లు తేలింది. సామాజిక తనిఖీ అధికారులు బుధవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామసభ నిర్వహించి స్కాలర్షిప్ అందనివారి, పింఛన్ అందని వారి పేర్లు చదివి వినిపించారు. గ్రామస్తుల ఆందోళన... స్కాలర్షిప్ డబ్బులు స్వాహా అయినట్లు బయటపడటంతో విద్యార్థులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. వీఓలను పిలిపించి అడగాలని పట్టుపట్టారు. దీంతో సామాజిక తనిఖీ అధికారులు వీఓ స్వరూపను పిలిపించారు. యూసుబ్బీ అందుబాటులో లేరు. సర్పంచ్ బాలమణితో పాటు గ్రామస్తులంతా వీఓ స్వరూపను నిలదీశారు. డబ్బులు ఎందుకు వాడుకున్నావని ప్రశ్నించారు. విద్యార్థుల స్కాలర్షిప్లు చెల్లించాలని, వీఓలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. 13మందికి మాత్రమే ఇవ్వలేదు : స్వరూప, వీఓ 2011-12 సంవత్సరానికి సంబంధించిన స్కాలర్షిప్ డబ్బులు 88 మంది విద్యార్థులకు ఇద్దరం వీఓలం కలిసి అందజేశాము. వారు తీసుకున్నట్టు మా దగ్గర సంతకాలు ఉన్నాయి. కేవలం 13 మంది విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వలేదు. వాటిని అత్యవసర పరిస్థితుల్లో వాడుకున్నాము. వాటిని వెంటనే తిరిగి చెల్లిస్తాము. నివేదికను డీఆర్డీఏ పీడీకి అందజేస్తాం : వాసవచారి, సామాజిక తనిఖీ అధికారి చిన్నమంగళారంలో మూడు రోజులు సామాజిక తనిఖీ నిర్వహించాము. గ్రామంలో 39 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఇద్దరు వృద్ధురాళ్లకు అభయహస్తం పింఛన్ డబ్బులు అందలేదని తేలింది. అదే విషయాన్ని గ్రామసభలో గ్రామస్తులందరికీ చెప్పాం. తనిఖీ నివేదికను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్‌కు అందజేస్తాం.