రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మృతిచెందింది.
రఘునాథపల్లి(వరంగల్ జిల్లా): రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌కు చెందిన ఓ మహిళ స్వైన్‌ఫ్లూతో మృతిచెందింది. గ్రామానికి చెందిన ఉప్పోజు స్వరూప (42) స్వైన్‌ప్లూ బారిన పడి ఈ నెల 5న అపస్మారక స్థితికి చేరుకోగా కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందింది.
స్వరూపకు స్వైన్‌ప్లూ సోకినట్లు నిర్దారణ కాగానే డీఎంహెచ్‌ఓ ఆదేశాల మేరకు గ్రామంలో వారం రోజుల పాటు వైద్య శిబిరం ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. స్వరూప గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి. చికిత్సకు డబ్బులు లేవని వైద్యాధికారుల చుట్టు తిరిగినా ఎవరూ కనికరించలేదని కుటుంబ సభ్యులు వాపోయారు.