అనుమానమే నిజమైంది.. | Initially svarupa Blows m deaths of her husband | Sakshi
Sakshi News home page

అనుమానమే నిజమైంది..

Published Wed, Jun 11 2014 2:55 AM | Last Updated on Sat, Aug 11 2018 8:11 PM

అనుమానమే  నిజమైంది.. - Sakshi

అనుమానమే నిజమైంది..

స్వరూపది హత్యే
భర్త దెబ్బలకేmమృతిచెందినట్లు నివేదిక
భర్త, బావ రిమాండ్
పరారీలో అత్తమామ    

 
 జమ్మికుంట: జమ్మికుంట మండ లం కొత్తపల్లికి చెందిన ఎనమనగండ్ల స్వరూప(25) మృతి కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 30న ఆమె అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే అందరి అనుమానమే నిజమైంది. భర్తే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. భర్త కొట్టిన దెబ్బలకే చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదిక తెలిపింది. స్వరూప భర్త సాగర్, బావ రమేశ్‌ను అరెస్టు చేశారు. అత్తమామలు సమ్మక్క, అయిలయ్య పరారీలో ఉన్నారు. వివరాలు సీఐ బాలస్వామి కథనం ప్రకారం..

 కొత్తపల్లికి చెందిన సాగర్‌తో వరంగల్ జిల్లా దూంపళ్లగూడెం పరిధిలోని ఎల్బీనగర్‌కు చెందిన స్వరూప వివాహం తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి వివేక్(6), శ్రీవర్షిని(3) సంతానం. అదనపు కట్నం కోసం రెండేళ్లుగా స్వరూపను భర్త వేదింపులకు గురిచేశాడు. గత నెల 30 ఇంట్లో ఎవరు లేని సమయంలో భార్యను చితకబాదాడు. ఈక్రమంలో ఆమె తలను గోడకేసి బాదడంతో అక్కడికక్కడే మృతిచెందింది. భర్త సాగర్, అత్తమామలు, బావ కలిసి స్వరూప ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చేపట్టిన విచారణలో వాస్తవాలు తెలిశాయి. సంఘటన దాచిపెట్టే ప్రయత్నం చేసిన సాగర్ తల్లిదండ్రులతోపాటు అన్న రమేశ్‌పై కేసు నమోదు చేశారు. సాగర్, రమేశ్‌ను రిమాండ్‌కు తరలించారు. మృతురాలి అత్తమాలు సమ్మక్క,అయిలయ్య పరారీలో ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement