గ్రేటర్ అమరావతి అవుతుంది
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మాదిరిగా అమరావతి కూడా గ్రేటర్ అమరావతి అవుతుందని చెప్పారు. శుక్రవారం ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కోర్ కేపిటల్ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకయ్య మాట్లాడుతూ.. తమ భవిష్యత్, బిడ్డల భవిష్యత్ బాగుండాలని రైతులు స్వచ‍్ఛందంగా ముందుకు వచ్చి రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చారని, వారిని అభినందిస్తున్నట్టు చెప్పారు. సభలో వెంకయ్య ఇంకా ఏ మాట్లాడారంటే..
- ప్రపంచంలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది
- ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంటే భారత్ బలోపేతంగా ఉంది
- దేశంలో రామరాజ్యం కోసం ప్రధాని మోదీ తపిస్తున్నారు
- దేశం మారుతూ ఉంది. దేశాన్ని అవినీతిరహితంగా, శక్తివంతంగా చేయడంలో అందరూ భాగస్వాములు కావాలి
- ఏపీ విభజన సందర్భంగా జరిగిన పరిస్థితులు తెలుసు
- ఏపీని ఆదుకోవడానికి గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా కేంద్ర సాయం చేస్తోంది
- మన భవిష్యత్ బాగుంటుంది. మన కలలు నెరవేరుతాయి
- విభజన చట్టంలోని అన్ని హామీలను కేంద్రం నెరవేరుస్తోంది
- విభజన చట్టంలో చేర్చని వాటిని కూడా అమలు చేస్తాం
- కేంద్రాన్ని విమర్శించేవాళ్లను పట్టించుకోవడం లేదు
- ఏపీకి కేంద్రం ఎన్నో విద్యా సంస్థలను మంజూరు చేసింది
- రాష్ట్ర రాజధానికి మెట్రో రైలు ఏర్పాటు చేస్తాం
- ఏపీలో కరెంట్ కొరత లేదు
- కేంద్రం సాయంతో ఏపీలో 24 గంటలూ విద్యుత్ ఇస్తున్నారు
- రాజ్యసభలో ఆనాడు నేను మాట్లాడబట్టే రాష్ట్రానికి మేలు జరిగింది
- 64 వేల కోట్లతో జాతీయ రహదారులను విస్తరిస్తాం
- మోదీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా