'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు' | Ambati rambabu fire on chandra babu | Sakshi
Sakshi News home page

'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు'

Published Sun, Jan 31 2016 11:00 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM

'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు' - Sakshi

'బాబు మళ్లీ అలాంటి ప్రేలాపనలే పేలుతున్నారు'

తుని: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే తూర్పు గోదావరి జిల్లా తుని కాపు గర్జనలో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామని హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన విధంగా స్పందించలేదని పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలు బాధ కలిగిస్తున్నాయని, హింస వల్ల ఉద్యమం, ఉద్యమ లక్ష్యం దెబ్బతింటాయన్నారు. హింసాత్మక ధోరణిని విడిచి పెట్టాలని అంబటి పిలుపునిచ్చారు.

ఉద్యమంలో కొన్ని దుష్టశక్తులు ప్రవేశించే ప్రమాదం ఉందని, నేటి ఘటనకు టీడీపీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని అంబటి డిమాండ్ చేశారు. బహిరంగ సభ జరుగుతుందని తెలిసినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తారో, లేదో చెప్పకుండా ప్రతిపక్ష పార్టీపై బురదజల్లడం ఎందుకు అన్నారు. గతంలో రైతుల ప్రయోజనాలను కాపాడమంటే రాజధానికి వ్యతిరేకమన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎందకు కట్టరని అడిగితే పట్టిసీమకు వ్యతిరేకం అన్నారు.. ఇప్పుడు అలాంటి ప్రేలాపనలనే పేలుతున్నారంటూ టీడీపీ సర్కార్ పై అంబటి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement