అమ్మవారి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు.. | ammavaari darshanam anantha lokalaku | Sakshi
Sakshi News home page

అమ్మవారి దర్శనానికి వెళ్తూ అనంత లోకాలకు..

Published Sat, Sep 3 2016 12:23 AM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM

ammavaari darshanam anantha lokalaku

 
కోదాడ అర్బన్‌ : నిలిచి ఉన్న ట్యాంకర్‌ను కారు ఢీకొనడంతో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద గురువారం అర్ధరాత్రి జరిగింది.  కోదాడ రూరల్‌ పోలీసుల కథనం ప్రకారం.. హన్మకొండకు చెందిన వద్దిరాజు శ్రీనా«థ్‌(38) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి దర్శనం కోసం గురువారం రాత్రి కోదాడ మీదుగా విజయవాడకు వెళ్లేందుకు తన కారులో బయల్దేరాడు. మండల పరిధిలోని నల్లబండగూడెంలోని రామాపురం క్రాస్‌రోడ్డు సమీపంలోకి రాగానే రోడ్డుపై నిలిపి ఉంచిన ట్యాంకర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో శ్రీనాథ్‌ అక్కడికక్కడే వృుతిచెందాడు. రూరల్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శ్రీనా«థ్‌ వృుతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కాగా వృుతుడి భార్య కళ్యా ణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్‌ ఎస్సై విజయ్‌ప్రకాశ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement