• మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజం
కదిరి : ‘అధికారులు లంచమడిగితే జనం తిరగబడాలని ముఖ్యమంత్రి నీతులు చెబుతున్నారు. ఆయనే ఓ పెద్ద అవినీతి పరుడు. టీడీపీకి చెందిన మునిసిపల్ వార్డు మెంబర్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. మీ మాటలు జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. రాష్ట్రంలో రాజకీయ రాక్షస, అవినీతి పాలన సాగుతోంద’ని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం ఆయన కదిరిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పీవీ సిద్దారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నీ 70 నుంచి 80 శాతం అప్పుడే పూర్తయ్యాయన్నారు.
అప్పట్లో 80 శాతం పనులకు ఎంత ఖర్చు చేశారో మిగిలిన 20 శాతం పనులకు ఇప్పుడు చంద్రబాబు అంతకంటే ఎక్కువ వెచ్చిస్తున్నారని విమర్శించారు. తుంగభద్ర డ్యాంలో పూడిక కారణంగా కేసీ కెనాల్ డైవర్షన్‌తో కలిపి హెచ్‌ఎల్‌సీకి దక్కాల్సిన నీటిలో 20 టీఎంసీలు శ్రీశైలం డ్యాంకు చేరుతోందని తెలిపారు. ఆ నీటిని జిల్లాకు రప్పించే ఏర్పాట్లు చేయడానికి జిల్లాకు చెందిన అధికార పక్ష నేతలెవరూ నోరు మెదపకపోవడం సిగ్గుచేటన్నారు. హంద్రీ–నీవా నీటిని కుప్పానికి తీసుకెళ్లి ‘అనంత’కు కన్నీళ్లే మిగిల్చేలా ఉన్నారన్నారు. సమావేశంలో పార్టీ సీఈసీ సభ్యులు డాక్టర్ కడపల మోహన్‌రెడ్డి, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, మునిసిపల్ మాజీæ చైర్‌పర్సన్ ఫర్హానా ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం పెద్ద అవినీతిపరుడు
Published Tue, Aug 9 2016 1:15 AM | Last Updated on Fri, Jun 1 2018 9:07 PM
Advertisement
Advertisement