పాలనకు ‘పచ్చ’వాతం
పాలనకు ‘పచ్చ’వాతం
Published Sun, Jul 17 2016 11:11 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
– కీలక శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి
– పత్రికల్లో కథనాలొచ్చినా చర్యలు శూన్యం
– అనంతపురం రూరల్లో రూ.కోట్ల విలువైన భూములకు ఎన్ఓసీల జారీ
– కాసుల కక్కుర్తితో యథేచ్ఛగా రిజిస్ట్రేషన్లు
– ప్రభుత్వ స్థలాలు, భూముల కబ్జాకు పూర్తిగా సహకరిస్తోన్న అనంతపురం రెవెన్యూ అధికారులు
– ఎంపీ జేసీ, ఎమ్మెల్యే చౌదరి మధ్య పంచాయితీ చేసి అధికార పార్టీకి దగ్గరి వాడినని స్పష్టం చేసిన కలెక్టర్శశిధÆŠ
– అధికారులు కూడా టీడీపీకి సహకరించాలనే సంకేతాలు
కలెక్టర్.. జిల్లా పరిపాలనలో అత్యున్నత అధికారి. ప్రజల సంక్షేమం, అభివృద్ధిలో కలెక్టర్నిర్ణయాలే కీలకం. రాజకీయాలకు అతీతంగా అధికార యంత్రాంగాన్ని నడిపించాలి. అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అయితే.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో కలెక్టర్శశిధర్వారిద్దరి మధ్య పంచాయితీ చేయడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అత్యున్నత అధికారే ఇలా చేస్తే.. జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సందేశం ఇచ్చినట్లు అవుతుందని మేధావులు, ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు.
అనంతపురం నగరాభివృద్ధి విషయంలో ఎంపీ జేసీ దివాకర్రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి మధ్య కొంతకాలంగా విభేదాలున్నాయి. జేసీ అనుచరులు దక్కించుకున్న రైల్వే ఓవర్బ్రిడ్జి (ఆర్ఓబీ) పనులకు ఆటంకం కల్గించేలా ఎమ్మెల్యే వ్యవహరించడం, ఎమ్మెల్యే, మేయర్చేస్తున్న పనులకు జేసీ,ఆయన వర్గీయులు అడ్డుపడటంపై కొద్దిరోజులుగా చర్చ నడుస్తోంది. నగరంలో ప్రతి అభివృద్ధి పని అవినీతిమయమైందని, పంపకాల్లో తేడా వల్లే ఇరువర్గాలు బజారుకెక్కాయని ప్రతిపక్ష పార్టీ విమర్శిస్తోంది. ఈ క్రమంలోనే కలెక్టర్జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య ‘పంచాయితీ’ చేయడాన్ని రాజకీయ పార్టీలు తప్పుబడుతున్నాయి. తద్వారా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అధికార పార్టీకి సహకరించాలనే సంకేతాన్ని ఇచ్చినట్లు అయ్యిందని విమర్శిస్తున్నాయి. దీనివల్ల ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులపై అధికారులు పక్షపాతlవైఖరి చూపే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి వైఖరే జిల్లాలో పాలన గాడి తప్పేందుకు ప్రధాన కారణమవుతోందని చెబుతున్నాయి. ఇక ప్రభుత్వ శాఖల్లో పెచ్చుమీరిన అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాల నాయకులు కూడా అంటున్నారు.
వీటిపై చర్యలు లేవెందుకో?
– అనంతపురం రూరల్æపరిధిలో టీడీపీ వర్గీయులు భూదందాలకు తెగబడుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పచ్చజెండాలు పాతి.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. కొన్ని స్థలాలకు ఎన్ఓసీలు కూడా తెచ్చుకుని రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్అధికారులు సహకరిస్తున్నారు. ఇటీవల సొములదొడ్డిలో పరిటాల, పామురాయి వెంకటేశ్పేరుతో జెండాలను ఓ రెవెన్యూ అధికారి సూచనతోనే నాటారని ఆ శాఖలోనే చర్చ సాగుతోంది. అక్కడ పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను రద్దు చేసి స్థలాన్ని టీడీపీ నేతలకు కట్టబెట్టే ప్రయత్నంలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. రూరల్పరిధిలో ఈ రెండేళ్లలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములు, స్థలాలు, ఎన్ఓసీలతో రిజిస్ట్రేషన్లు చేసిన వాటి విలువ రూ.వంద కోట్లకుపైగా ఉంటుంది.
– ఎరువుల కుంభకోణం జిల్లాలో కలకలం రేపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా భాస్కర్ఫర్టిలైజర్స్లో ఎరువులు ఉన్నట్లు స్పష్టమైంది. దీనిపై విచారణ కూడా డొల్లగా సాగుతోందని, ఇందుకు కారణం ఓ ముఖ్య ప్రజాప్రతినిధి జోక్యమేనని తెలుస్తోంది.
• జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. మొక్కల కోనుగోలు, పెంపకానికి పెట్టిన ఖర్చు అంతా కాగితాల్లో చూపి నిధులు ఆరగించారు. ఈ విషయంపై పత్రికల్లో ససాక్ష్యాలతో కథనాలు వచ్చినా ఎలాంటి చర్యలూ లేవు. ఇక్కడి అధికారికి ఓ మంత్రి అండదండలు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
• అనంతపురం నగర పాలక సంస్థలో అవినీతి ఏస్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టెండర్లు ఖరారు కాకముందే రోడ్ల నిర్మాణం, గతంలో ఎంపీ నిధులతో చేపట్టిన నిర్మాణాలకు ఇప్పటి పాలకవర్గం మరోసారి బిల్లులు చేయడం, శ్రమదానం పేరుతో జరిగిన పనులకు బిల్లులు డ్రా చేయడం, నామినేషన్పనులు ఇష్టారాజ్యంగా చేపట్టడం వంటివి సర్వ సాధారణమయ్యాయి.
• ఎన్పీకుంట సోలార్కుంభకోణంపై విచారణకు ఏజేసీ–2ను నియమించారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకూ విచారణ మొదలు పెట్టలేదు. సాగుదారులకు పరిహారం కూడా ఇవ్వలేదు. దీనికి కారణం అధికార పార్టీ నేతల ఒత్తిడేనని తెలుస్తోంది.
ఇలా చెబుతూ పోతే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. జిల్లా యంత్రాంగం ఇష్టారాజ్యంగా పనిచేస్తోంది. కిందిస్థాయి అధికారులపై తీవ్రంగా స్పందించే కలెక్టర్.. అధికార పార్టీ జోక్యం చేసుకుంటే మాత్రం నిమ్మకుండిపోతున్నారనే విమర్శలున్నాయి. ప్రతి అంశంలోనూ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ చాలామంది అధికారులు టీడీపీ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నారు.
స్థాయిని దిగజార్చడమే – రాంభూపాల్, సీపీఎం జిల్లా కార్యదర్శి
జిల్లా అభివృద్ధి, నిధులు రప్పించడంపై కలెక్టర్దృష్టి సారించాలి. అయితే.. అధికార పార్టీ నేతలకు అనుకూలంగా మాట్లాడుతూ వారితో సఖ్యతగా ఉంటే చాలనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధుల మధ్య పంచాయితీ చేయడమంటే స్థాయిని దిగజార్చడమే!. ఐఏఎస్లు ఇలా వ్యవహరించకూడదు. వ్యక్తిగత స్వలాభం కోసమే ఎంపీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఈక్రమంలో కలెక్టర్పంచాయితీ చేశారంటే ప్రభుత్వమే ఈ పంచాయితీ చేయించినట్లు భావించాలి.
నా రాజకీయ జీవితంలో ఇలాంటి కలెక్టర్ను చూడలేదు – అనంత వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ
40 ఏళ్లుగా ఎంతోమంది కలెక్టర్లను చూశా. అయితే గెస్ట్హౌస్కు వెళ్లి ఎంపీ, ఎమ్మెల్యే మధ్య పంచాయితీ చేసిన కలెక్టర్ను తొలిసారి చూస్తున్నా. ఇది దురదృష్టకరం. ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చడమంటే అవినీతిని పంచడమే! ఐఏఎస్లతో పంచాయితీలు చేయించేలా సీఎం వ్యవస్థలను దిగజారుస్తున్నారు.ఇది సమాజానికి మంచిది కాదు. కలెక్టర్పంచాయితీ చేయడం ద్వారా కిందిస్థాయి అధికారులు, సిబ్బందికి ఎలాంటి మెసేజ్ పంపినట్లయ్యిందో ఇట్టే తెలుస్తోంది. గ్రీవెన్స్కు వచ్చే ప్రజలకు న్యాయం జరగడం లేదు. పింbè న్, రేషన్కార్డు కూడా ఇవ్వలేకపోతున్నారు. నగరంలో పైపులైన్పనులకు 17 శాతానికి తక్కువకు టెండర్ వేస్తే రద్దు చేశారు. 8 శాతం ఎక్కువకు వేసిన వారికి ఇచ్చారు.
ఇలాంటి చర్యలు సరికాదు – జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి
టీడీపీ ప్రజాప్రతినిధుల వైఖరితోనే జిల్లా అభివృద్ధి ఆగింది. అభివృద్ధికి పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత కలెక్టర్ది. అయితే.. కలెక్టర్ఇద్దరు నేతల మధ్య పంచాయితీ చేయడం సరికాదు. ఈ ఘటన చూస్తే సీఎం చెప్పి ఇద్దరినీ రాజీ చేయించినట్లు అర్థం చేసుకోవాలి. ఇంతకంటే హీనస్థితి మరొకటి ఉండదు.
Advertisement
Advertisement