'ఏపీ అవినీతికి కేరాఫ్ అడ్రస్'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీని తెలుగుదేశం పార్టీ నేతలు లూటీ చేస్తున్నారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా అవినీతిని పెంచి పోషిస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దైర్యం ఉంటే విచారణకు సిద్ధం కావలని బ్రహ్మానందరెడ్డి సవాల్ విసిరారు.