ఆంధ్రాబ్యాంకు డీజీఎం బదిలీ
Published Fri, Jan 13 2017 11:26 PM | Last Updated on Tue, Sep 5 2017 1:11 AM
- పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జీఎంగా నియామకం
కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రబ్యాంకు కర్నూలు జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. రెండున్నర ఏళ్ల పాటు ఇక్కడ డీజీఎంగా పనిచేసిన ఆయన శుక్రవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈయన స్థానంలో డీజీఎంగా రఘునాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై బదిలీ అయిన గోపాలకృష్ణకు ఈ నెల 17 సన్మాన సభ ఏర్పాటు చేయనున్నారు.
Advertisement
Advertisement