dgm
-
రూ.10 నాణేలపై దుష్ప్రచారం
► నాణేలపై నిషేధం ఏమీ లేదు- ఆంధ్రా బ్యాంక్ డీజీఎం కర్నూలు: రూ.10 నాణేలను కేంద్ర ప్రభుత్వం కానీ, రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా కానీ ఎలాంటి నిషేధం విధించలేదు. కనీసం ఆ ఆలోచన కూడా ఆర్బీఐకి లేదు. రిజర్వుబ్యాంకు నుంచి యథావిదిగా నాణేలు సరఫరా అవుతున్నాయి. అయితే రూ. 10 నాణేలు చెల్లుబాటు కావన్న పుకార్లు షికార్లు చేస్తుండడంతో చిన్నచిన్న వ్యాపారులు, దుకాణదారులు వాటిని తీసుకునేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యం గా డోన్, ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు తదితర ప్రాంతాల్లో వ్యాపారులు వీటిని తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. బ్యాంకర్లు మాత్రం నాణేల చెల్లుబాటుకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆంధ్రాబ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ రఘునాథ్‌ను వివరణ కోరగా పది రూపాయల నాణేలు చెల్లుబాటు కావన్నది దుష్ప్రచారం మాత్రమేనన్నారు. ఏ బ్యాంకుకు వెళ్లినా వాటిని తీసుకుంటారని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు ఎవ్వరో ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రచారం చేస్తున్నారన్నారు. -
ఆంధ్రాబ్యాంకు డీజీఎం బదిలీ
- పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జీఎంగా నియామకం కర్నూలు(అగ్రికల్చర్): ఆంధ్రబ్యాంకు కర్నూలు జోన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గోపాలకృష్ణ పదోన్నతిపై బెంగళూరు సర్కిల్ జనరల్ మేనేజర్‌గా నియమితులయ్యారు. రెండున్నర ఏళ్ల పాటు ఇక్కడ డీజీఎంగా పనిచేసిన ఆయన శుక్రవారం బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారు. ఈయన స్థానంలో డీజీఎంగా రఘునాథ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతిపై బదిలీ అయిన గోపాలకృష్ణకు ఈ నెల 17 సన్మాన సభ ఏర్పాటు చేయనున్నారు. -
ఆంధ్రాబ్యాంకు నూతన డీజీఎంగా రాధాకిషన్‌రావు
శ్రీకాకుళం అర్బన్: ఆంధ్రాబ్యాంక్ నూతన డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా రాధాకిషన్‌రావు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో డీజీఎంగా పనిచేసిన కె.ఉమామహేశ్వరరావుకు హైదరాబాద్‌లోని ఏపెక్స్ కళాశాలకు బదిలీ అయ్యింది. హైదరాబాద్‌లోని డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేసిన రాధాకిషన్‌రావుకు శ్రీకాకుళం జోనల్ కార్యాలయం డీజీఎంగా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలోని జీటీరోడ్‌లోని మెయిన్ బ్రాంచిలో మంగళవారం ఆ బ్రాంచి సిబ్బంది బదిలీపై వెళ్లిపోతున్న ఉమామహేశ్వరరావును ఘనంగా సన్మానించారు. తనకు అందించిన సహాయ సహాకారాలను కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీజీఎంకు అందించాలని ఆయన కోరారు. నూతన డీజీఎం రాధాకిషన్‌రావు మాట్లాడుతూ ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు. కార్యక్రమంలో ఆంధ్రాబ్యాంకు మెయిన్ బ్రాంచి చీఫ్ మేనేజర్ ఐ.చంద్రశేఖర్, సిబ్బంది ఉమాకుమార్, కృష్ణబాబు, ప్రత్యూష, శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు. -
ఐఆర్సీటీసీ అదిరిపోయే విమాన ప్యాకేజీలు
కాజీపేట రూరల్ : దసరా పండుగను పురస్కరించుకుని పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రత్యేక విమాన ప్యాకేజీలను ప్రవేశపెట్టినట్లు ఆ శాఖ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య, ఎగ్జిక్యూటీవ్ పవన్‌కుమార్ సెంగర్ తెలిపారు. కాజీపేటలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్యాకేజీల వివరాలు వెల్లడించారు. 2005లో ప్రారంభమైన ఐఆర్సీటీసీ మొదట రైల్ ప్యాకేజీలను ప్రారంభించిందని, తర్వాత రైల్ కోచ్‌ల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రస్తుతం విమాన ప్యాకేజీలను ప్రవేశపెట్టిందన్నారు. విమాన ప్యాకేజీ యాత్రలో పర్యాటకులకు ఐఆర్సీటీసీ భోజనం, వసతి, బస్సులు తదితర సౌకర్యాలు కల్పిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్– హాంకాంగ్.. హైదరాబాద్ టు çహాంకాంగ్ అంతర్జాతీయ విమాన యాత్ర అక్టోబర్ 8న హైదరాబాద్ రాజీవ్‌గాంధీ విమానశ్రయం నుంచి ప్రారంభమవుతుందన్నారు. తిరిగి 12వ తేదీన హాంకాంగ్‌లో బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. నాలుగు రాత్రులు, 5 రోజులపాటు ఉండేlటూర్లో ఒక్కోక్కరికి రూ.73,419 టికెట్ ధర ఉందన్నారు. ఈ యాత్రలో హంకాంగ్, మకావ్, షెంజెన్ సిటీ లను చూపిస్తారన్నారు. మేడం టుస్సాడ్స్, మైనపు విగ్రహాలు ప్రదేశం, 100 అంతస్తుల హంకాంగ్ ఎల్తైన భవనం, లెడ్ అండ్ సౌండ్ షో, హంకాంగ్ డిస్నిల్యాంyŠ కూడా చూడవచ్చని వివరించారు. హైదరాబాద్–దుబాయి ఈ విమాన యాత్ర హైదరాబాద్‌లో అక్టోబర్ 10న ప్రారంభమై దుబాయికి వెళ్తుందన్నారు. తిరిగి అక్టోబర్ 14న హైదరాబా ద్‌కు వస్తుందన్నారు. 4 రాత్రులు, 5 రోజులపాటు ఉండే టూర్ టికెట్ ధర ఒక్కోక్కరికి రూ.63,586 ఉందన్నారు. ఈ యాత్రలో దుబాయ్ అముదాబి సిటీలు, బూర్జుఖలీఫా, మిరాకిల్ గార్డెన్, డెసర్ సఫారీ తదితర ప్రదేశాలను చూపిస్తారన్నారు. హైదరాబాద్–గోవా హైదరాబాద్–గోవా విమాన యాత్ర అక్టోబర్ 21న హైదరాబాద్‌లో బయలుదేరి వెళ్తుందన్నారు. తిరిగి గోవా నుంచి 24వతీ దీన హైదరాబాద్‌కు వస్తుందన్నారు. ఈ ప్యాకేజీలో మూడు రాత్రులు, నాలుగు రోజులు ఉంటాయన్నారు. ఇందులో ఒక్కోక్కరికి రూ.18,970 టికెట్ ధర ఉందన్నారు. సౌత్ గోవా, నార్త్ గోవా, బీచ్‌లు, చర్చీలు, ఆలయాలు, సముద్రాలపై స్టీమర్‌తో విహార యాత్ర ఉంటుందన్నారు. హైదరాబాద్–తిరుపతి హైదరాబాద్‌లో నవంబర్ 4న విమానయాత్ర బయలుదేరి తిరుపతికి వెళ్తుందన్నారు. తిరిగి తిరుపతిలో 5వ తేదీన బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. అలాగే హైదరాబాద్‌లో 18న బయలుదేరి తిరుపతికి వెళ్తుందన్నారు. 19వ తేదీన తిరుపతి నుం చి బయలుదేరి హైదరాబాద్‌కు వస్తుందన్నారు. ఈ యాత్రలో తిరుమల తిరుపతి దర్శనం, శ్రీకాళహస్తి, కానిపాకం తదితర ప్రదే శాలు చూపిస్తారన్నారు. ఈ ప్యాకేజీలో ఒక్కోక్కరికి టిక్కెట్ ధర రూ.9775 ఉంటుందన్నారు. పర్యాటకులు ఐఆర్సీటీసీ వివరాల ప్యాకేజీల కోసం 040–27702407, 97013–60647, 97013–60609, 97013 – 60605 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.85 కోట్లు
కోటనందూరు : ఈ ఏడాది జిల్లాలో రూ.85 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు డీజీఎం రాజశేఖరరావు తెలిపారు. స్థానిక మహిళా సమాఖ్యను సోమవారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే రూ.19 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. స్త్రీనిధి రుణాల రికవరీ 75 శాతం మాత్రమే ఉందన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి 100 శాతం రికవరీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రౌతులపూడి, ప్రత్తిపాడు, రంగంపేట, పెదపూడి, తాళ్ళరేవు మండలాల్లో రూ.3 కోట్ల వరకూ మొండి బకాయిలున్నాయన్నారు. వీటిలో రూ.1.6 కోట్ల వరకూ దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. రౌతులపూడి సమాఖ్యలో రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్నారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ములగపూడి, బలరాంపురం, గంగవరం, లచ్చిరెడ్డిపాలెం, రాజవరం, మల్లంపేట గ్రామాల సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రాజశేఖరరావు వివరించారు. -
వ్యాసరచన పోటీలకు స్పందన
ౖయెటింక్లయిన్‌కాలనీ : వసుంధర విజ్ఞాన వికాస మండలి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వ్యాసరచన పోటీలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైయ్యారు. స్థానిక సింగరేణి పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీఎం పర్సనల్ వెంకటేశ్వర్రావు హాజరై వ్యాసరచన పోటీలను ప్రారంభించారు. అనంతరం సంస్థ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. కార్యక్రమంలో అధ్యక్షుడు చదువు వెంకట్‌రెడ్డి, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రూ. 377 కోట్ల రుణమాఫీకి ప్రతిపాదనలు
డీజీఎం సుఖదేవ్‌భవ రాయదుర్గం : జిల్లా వ్యాప్తంగా సహకార సొసైటీ బ్యాంకు సంఘాల పరిధిలో రూ. 377 కోట్ల రుణాల మాఫీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ట్లు డీజీఎం, నోడల్ ఆఫీసర్ సుఖదేవ్‌భవ తెలిపారు. ఆ దిశగా రైతుల నుంచి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యామని ఆయన అన్నారు. రాయదుర్గం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకులో గురువారం బ్రాంచి మేనేజర్ వన్నూర్‌స్వామి అధ్యక్షతన రుణమాఫీపై సమావేశం నిర్వహించారు. డీజీఎం మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1.39 లక్షల వంది వ్యవసాయ రుణాలు, 17 వేల మంది బంగారు రుణాల మాఫీకి అర్హత కలిగి ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 80 శాతం వరకు ఆధార్, పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు అకౌంట్ నంబర్లు, రేషన్‌కార్డుల వివరాలను సేకరించామన్నారు. రాయదుర్గం సహకార బ్యాంకు పరిధిలో ఉన్న 7 ప్రాథమిక సొసైటీ సంఘాల్లో 4 వేల అకౌంట్లు ఉండగా, ఇప్పటికే 3వేల అకౌంట్లకు సంబంధించి వివరాలను పూర్తిస్థాయిలో సేకరించామన్నారు. రైతులు సకాలంలో ఆధార్, రేషన్‌కార్డు, పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సులను అందజేసి సహకరించాలని కోరారు. సమావేశంలో సొసైటీల సీఈఓలు టీ శ్రీనివాసులు, కుమార్‌మంగళం, జీ రమణారెడ్డి, కేపీ ఆంజనేయులు పాల్గొన్నారు. -
ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఒకే ఒక్క మెసేజ్ అన్ని సమస్యలకూ పరి ష్కారం చెబుతుందని ఆంధ్రా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభోద్ కె. మొల్రే స్పష్టం చేశారు. బ్యాంకు బరంపురం జోన్ పరిధిలోని 9 జిల్లాల్లో ఈ ఎస్సెమ్మెస్ సేవ అందుబాటులో ఉందన్నారు. ఈనెల 4న డీజీఎంగా విధులు చేపట్టిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్యాంకు కార్యకలాపాలు, అందిస్తున్న సేవల గురించి వివిరంచారు. సమస్యలతో అప్సెట్ అయ్యారా? దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా 9666606060 నెంబర్‌కు ‘అప్సెట్’ అని మెసేజ్ పంపిస్తే క్షణాల్లో పరిష్కారం సూచిస్తామని డీజీఎం చెప్పారు. ఆన్లైన్, మొబైల్ బ్యాంకు కార్యకలాపాలతో పాటు 24 గంటల ఏటీఎం సేవలు కూడా త్వరలో అందుబాట్లోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చిచూస్తే తమ బ్యాంకు మాస్ బ్యాంకుగా వ్యవహరిస్తోందన్నారు. ‘0’నుంచి రూ.100 వరకు బ్యాంకు ఖాతాల్లో ఉండే అవకాశాన్ని కూడా ఖాతాదారులకు కల్పించామన్నారు. ఒడిశా జోన్‌లోని తొమ్మిది జిల్లాల్లో వేలాది బ్రాంచ్‌లో ఖాతాదారులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి కార్యాలయంలోనూ రిసెప్షన్ కౌంటర్‌తోపాటు బ్యాంకు ఖాతాల పై అవగాహన, పథకాలపై చైతన్యం కల్గిం చేందుకు సిబ్బంది అందుబాట్లో ఉంటున్నారన్నారు. రూ.4200 కోట్ల టర్నోవర్ లక్ష్యం ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కొందమాల్, కొరాపుట్, మల్కాన్‌గిరి, కలహండి, నవరంగపూర్ జిల్లాలతో పాటు బరంపురం జోన్లో ఉన్న శ్రీకాకుళం జిల్లా పై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నా రు. తమ ఖాతాల్లో 50 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించినవేనన్నారు. ప్రస్తుతం రూ.4200 కోట్ల టర్నోవ ర్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. రుణాల నిమిత్తం రూ.1476 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. 28 శాతం రుణాల ను చిన్న, మధ్య తరహా సంస్థలకు తక్కువ వడ్డీకే ఇస్తున్నామన్నారు. తమ పరిధిలో 2.40 కోట్ల మంది ఖాతాదారులున్నారన్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకే ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) అమలు చేస్తున్నామని, ఖాతాదారులకు తమ ఖాతా కు సంబంధించి చిరునామా సహా అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉం టుందన్నారు. ‘మనీ ల్యాండరింగ్’ అయ్యే అవకాశాల్ని పరిశీలించేందుకు ఇది దోహదపడుతుంద ని వివరించారు. ఆధార్ సీడింగ్ విషయమై తమకింకా స్పష్టత రావాల్సి ఉందన్నారు. మరిన్ని బ్రాంచీలు శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం సహా ఒడిశాలోని ఐదు ప్రాంతాల్లో నవంబర్ నాటికి కొత్తశాఖలు ఏర్పాటుచేయనున్నట్టు ప్రబోధ్ తెలిపారు. అన్ని బ్రాంచీల్లోనూ వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని, చిటికెలో పని అయిపోయే విధంగా ఆన్లైన్ లావాదేవీలను విస్తృతం చేయనున్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల ఏటీఎం సెంటర్ల సేవల్లో లోపం కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో అన్ని సెంటర్లను ప్రత్యేక సిబ్బంది తో తనిఖీలు చేయిస్తామన్నారు. ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డుల నియామ కం, సీసీ టీవీల ఏర్పాటు వంటి విషయా ల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నా రు. బ్యాంకుల్లో కాయిన్ డిస్పెన్సర్, చెక్ డ్రాపింగ్, అకౌంట్ ఓపెనింగ్, చిన్న మొత్తా ల్లో డిపాజిట్ వంటి వాటి కోసం అందుబా ట్లో ఉన్న సాంకేతిక నైపుణ్యంతో కొత్తకొత్త యంత్రాల్ని ఆమరుస్తున్నామన్నారు. బిల్డ ర్లు, ట్రేడర్లు, రైస్‌మిల్లర్లకు కొత్తగా రుణాలిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రభోద్తోపాటు ఇక్కడి లీడ్‌బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి సహా మరికొం తమంది బ్యాంకు అధికారులు మాట్లాడారు.