స్త్రీనిధి రుణ లక్ష్యం రూ.85 కోట్లు
Published Mon, Jul 25 2016 11:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:14 AM
కోటనందూరు : ఈ ఏడాది జిల్లాలో రూ.85 కోట్ల స్త్రీనిధి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు డీజీఎం రాజశేఖరరావు తెలిపారు. స్థానిక మహిళా సమాఖ్యను సోమవారం సందర్శించిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటికే రూ.19 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు. స్త్రీనిధి రుణాల రికవరీ 75 శాతం మాత్రమే ఉందన్నారు. నాలుగు బృందాలను ఏర్పాటు చేసి 100 శాతం రికవరీకి ప్రయత్నిస్తున్నామన్నారు. రౌతులపూడి, ప్రత్తిపాడు, రంగంపేట, పెదపూడి, తాళ్ళరేవు మండలాల్లో రూ.3 కోట్ల వరకూ మొండి బకాయిలున్నాయన్నారు. వీటిలో రూ.1.6 కోట్ల వరకూ దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామన్నారు. రౌతులపూడి సమాఖ్యలో రూ.50 లక్షల మేర అవినీతి జరిగిందన్నారు. అవకతవకలు జరిగినట్లు గుర్తించిన ములగపూడి, బలరాంపురం, గంగవరం, లచ్చిరెడ్డిపాలెం, రాజవరం, మల్లంపేట గ్రామాల సిబ్బందిపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు రాజశేఖరరావు వివరించారు.
Advertisement