ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్ | all problems will be solves with single sms, says bank dgm | Sakshi
Sakshi News home page

ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్

Published Thu, Aug 14 2014 10:47 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్ - Sakshi

ఒక్క మెసేజ్‌తో.. సర్వ సమస్యలకు చెక్

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ఒకే ఒక్క మెసేజ్ అన్ని సమస్యలకూ పరి ష్కారం చెబుతుందని ఆంధ్రా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రభోద్ కె. మొల్రే స్పష్టం చేశారు. బ్యాంకు బరంపురం జోన్ పరిధిలోని 9 జిల్లాల్లో ఈ ఎస్సెమ్మెస్ సేవ అందుబాటులో ఉందన్నారు. ఈనెల 4న డీజీఎంగా విధులు చేపట్టిన ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం శ్రీకాకుళం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ బ్యాంకు కార్యకలాపాలు, అందిస్తున్న సేవల గురించి వివిరంచారు.
 
సమస్యలతో అప్‌సెట్ అయ్యారా?
దేశవ్యాప్తంగా ఆంధ్రాబ్యాంకు ఖాతాదారులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నా 9666606060 నెంబర్‌కు ‘అప్‌సెట్’ అని మెసేజ్ పంపిస్తే క్షణాల్లో పరిష్కారం సూచిస్తామని డీజీఎం చెప్పారు. ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకు కార్యకలాపాలతో పాటు 24 గంటల ఏటీఎం సేవలు కూడా త్వరలో అందుబాట్లోకి వస్తాయని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకులతో పోల్చిచూస్తే తమ బ్యాంకు మాస్ బ్యాంకుగా వ్యవహరిస్తోందన్నారు. ‘0’నుంచి రూ.100 వరకు బ్యాంకు ఖాతాల్లో ఉండే అవకాశాన్ని కూడా ఖాతాదారులకు కల్పించామన్నారు. ఒడిశా జోన్‌లోని తొమ్మిది జిల్లాల్లో వేలాది బ్రాంచ్‌లో ఖాతాదారులకు సేవలందించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు ప్రతి కార్యాలయంలోనూ రిసెప్షన్ కౌంటర్‌తోపాటు బ్యాంకు ఖాతాల పై అవగాహన, పథకాలపై చైతన్యం కల్గిం చేందుకు సిబ్బంది అందుబాట్లో ఉంటున్నారన్నారు.
 
రూ.4200 కోట్ల టర్నోవర్ లక్ష్యం
ఒడిశాలోని గంజాం, గజపతి, రాయగడ, కొందమాల్, కొరాపుట్, మల్కాన్‌గిరి, కలహండి, నవరంగపూర్ జిల్లాలతో పాటు బరంపురం జోన్‌లో ఉన్న శ్రీకాకుళం జిల్లా పై తాము ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నా రు. తమ ఖాతాల్లో 50 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించినవేనన్నారు. ప్రస్తుతం రూ.4200 కోట్ల టర్నోవ ర్ లక్ష్యంగా పనిచేస్తున్నట్టు చెప్పారు. రుణాల నిమిత్తం రూ.1476 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. 28 శాతం రుణాల ను చిన్న, మధ్య తరహా సంస్థలకు తక్కువ వడ్డీకే ఇస్తున్నామన్నారు. తమ పరిధిలో 2.40 కోట్ల మంది ఖాతాదారులున్నారన్నారు. రిజర్వు బ్యాంకు ఆదేశాల మేరకే ‘నో యువర్ కస్టమర్’ (కేవైసీ) అమలు చేస్తున్నామని, ఖాతాదారులకు తమ ఖాతా కు సంబంధించి చిరునామా సహా అన్ని పత్రాలు సమర్పించాల్సి ఉం టుందన్నారు. ‘మనీ ల్యాండరింగ్’ అయ్యే అవకాశాల్ని పరిశీలించేందుకు ఇది దోహదపడుతుంద ని వివరించారు. ఆధార్ సీడింగ్ విషయమై తమకింకా స్పష్టత రావాల్సి ఉందన్నారు.
 
మరిన్ని బ్రాంచీలు
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం సహా ఒడిశాలోని ఐదు ప్రాంతాల్లో నవంబర్ నాటికి కొత్తశాఖలు ఏర్పాటుచేయనున్నట్టు ప్రబోధ్ తెలిపారు. అన్ని బ్రాంచీల్లోనూ వృద్ధులు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నామని, చిటికెలో పని అయిపోయే విధంగా ఆన్‌లైన్ లావాదేవీలను విస్తృతం చేయనున్నట్టు చెప్పారు. కొన్ని చోట్ల ఏటీఎం సెంటర్ల సేవల్లో లోపం కనిపిస్తోందని ఆయన దృష్టికి తీసుకువెళ్లగా త్వరలో అన్ని సెంటర్లను ప్రత్యేక సిబ్బంది తో తనిఖీలు చేయిస్తామన్నారు. ఏటీఎం సెంటర్లలో సెక్యూరిటీ గార్డుల నియామ కం, సీసీ టీవీల ఏర్పాటు వంటి విషయా ల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నా రు. బ్యాంకుల్లో కాయిన్ డిస్పెన్సర్, చెక్ డ్రాపింగ్, అకౌంట్ ఓపెనింగ్, చిన్న మొత్తా ల్లో డిపాజిట్ వంటి వాటి కోసం అందుబా ట్లో ఉన్న సాంకేతిక నైపుణ్యంతో కొత్తకొత్త యంత్రాల్ని ఆమరుస్తున్నామన్నారు. బిల్డ ర్లు, ట్రేడర్లు, రైస్‌మిల్లర్లకు కొత్తగా రుణాలిచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ప్రభోద్‌తోపాటు ఇక్కడి లీడ్‌బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి సహా మరికొం తమంది బ్యాంకు అధికారులు మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement